నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, April 19, 2010

108:రెండు విధాల దుర్వినియోగం

108 సర్వీసు ఆపదలో ఎంత ఉపయోగకరమో దాని అవసరం వచ్చిన వాళ్ళను అడిగితే చెప్తారు.ఏ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళకైనా టక్కున గుర్తొచ్చే నంబరు 108.కుయ్య్య్...కుయ్య్య్...మని ఒక సభలో వై ఎస్సార్ మిమిక్రి చేయడం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
కానీ ఈ 108 కూడా మనవాళ్ళ చేతుల్లో దుర్వినియోగానికి గురవుతోంది.ఈ దుర్వినియోగం రెండు వైపుల నుండీ ఉంటుంది.ప్రతి చిన్నదానికి 108 కి ఫోన్ చేసి వాళ్ళ కాలాన్నీ శ్రమనూ వృధా చేసేవాళ్ళున్నారు. ఎముకల డాక్టరుగ ప్రాక్టీసు చేసే నా కజిన్ కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఆ మధ్య కలిసినప్పుడు.

చేతి వేళ్ళకు దెబ్బ తగిలినా 108 కి ఫోన్ చేసి అందులో హాస్పిటల్ కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారట.ఇంట్లో ముసలి వాళ్ళు కింద పడి కాలో చెయ్యో విరిగితే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళకుండా ఇంట్లోనె ఉంచి అవీ ఇవి టాబ్లెట్లు ఇచ్చి సరిపుచ్చి ఉన్నట్టుండి నొప్పి ఎక్కువయితే 108 కి ఫోన్ చేసి "మా ఇంట్లో ఒకరు కింద పడి కాలు విరగ్గొట్టున్నారు" అని చెప్పి 108 ని ఆటో లాగా వాడుకొనే వాళ్ళు కూడా ఉంటారు.

ఇంకోరకమైన దుర్వినియోగం 108 స్టాఫ్ నుంచి పేషంట్ల్కు ఎదురవుతూంది. ఈ సిబ్బంది ఏదో ఒక హాస్పిటల్ తో టై అప్ పెట్టుకొని పేషంట్లను నేరుగా ఆ హాస్పిటల్ కి తీసుకు వెళ్తారు. వాళ్ళు ఈ పేషంటు తాట ఒలిచి డబ్బు పిండి ప్రతిగా ఈ సిబ్బందికి కమీషన్లు ముట్టజెబుతారు.

ఇలాంటి చిన్న చిన్న వాటిని సవరించుకొంటే 108 మరింత ప్రయోజనకారి అవుతుంది.

1 comment:

kvsv said...

108 నుండి దిగిన ఒక అబ్బాయినడిగా ఏమైందని?వేలు చూపించాడు...దాని పై రాయి పడిందట..ఈ రోగిని తీసుకు రాడానికి వాళ్ళ వూరు వెళ్ళి..తిరిగి హాస్పటిల్ కి రాడానికి 500 లో 600లో రూపాయలు..ఆయిల్ కి ఖర్చయి వుంటుంది...ఏ పధకాన్నయినా బ్రష్టు పట్టించ గల ఘనులు మన ప్రజలు..