మొత్తానికి సినిమా నిర్మాతల్లొ కదలిక వచ్చింది.అనవసర ఖర్చులని తగ్గించాలన్న ప్రయత్నం మొదలయ్యింది.తెలుగు సినిమా వ్యయాన్ని వీళ్ళే ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు.ఎన్ని రోజులు ఆడినా లాభాలు రాని స్థాయికి తీసుకెళ్ళారు.ఖర్చు తగ్గించడం అనేది మంచి పనే.అందుకు నా వంతుగా కొన్ని సలహాలు.
1.పాటలు లోకల్ టాలెంటుతో పాడించండి.ఉదిత్ నారాయణ్ గొప్ప సింగరయ్యిండొచ్చు.కానీ తెలుగు పాటలు పాడేటప్పుడు అతగాడి గొంతు దాఋణంగా ఉంటుంది.అతడి హోటల్ రూం ఖర్చుతో లోకల్ టాలెంటుని హైర్ చేసుకోవచ్చు.
2.ముమైత్ ఖాన్ కన్నా బాగా ఊపే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు.వాళ్ళలో కొంచెం కంటికి నదురుగ కనిపించే అమ్మాయిలతో ఐటం సాంగ్స్ తియ్యండి.సూపర్ గా ఉంటుంది.
3.విదేశాలని తలదన్నే లొకేషన్స్ మన దేశంలో చాలా ఉన్నాయి.పాటల కోసం అక్కడికి వెళ్ళండి.తక్కువ ఖర్చుతో పనయిపోతుంది.కథ డిమాండ్ చేస్తేనే విదేశాలకు విమానమెక్కండి.
4.ఒక సారి నాటక రంగాన్ని చూడండి.మాంచి టైమింగ్ ఉన్న కమేడియన్లు ఎంతో మంది కనిపిస్తారు.సినిమాలలో ఎస్టాబ్లిష్ అయ్యిన వాళ్ళకేమీ తీసిపోరు.బ్రహ్మానందం అండ్ కంపెనీ కన్నా చాలా బాగా చేయగలరు.పైపెచ్చు పారితోషికం తక్కువిచ్చినా తీసుకొంటారు.
5.ముంబాయి భామలకేమీ తీసిపోని అందగత్తెలు చాలామంది మీకు నిత్యం కనిపిస్తూ ఉంటారు.అందాల ఆరబోతలో కూడా ఏమీ తక్కువ చేయరు.కొద్దిగా సాహసించి వాళ్ళకొక చాన్స్ ఇవ్వండి.
6.ఎంత పెద్ద స్టార్ అయినా మేమిచ్చేది ఇంతే అని తెగేసి చెప్పండి.వాళ్ళు ఖచ్చితంగా దిగి వస్తారు.
7.చేతిలో తెల్ల కాగితాల బొత్తులు పట్టుకొని మీకేసి దీనంగా చూసే యువకుడికి ఒక అరగంట కేటాయించండి.మాంచి కథ చెప్తాడు.ఎక్కువ డబ్బులు తీసుకొని చెప్పిన దాన్నే,తీసిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పే రచయితల కన్నా మంచి కథ తయారవుతుంది.
8.కాబట్టి నిర్మాతలూ కొంచెం పెట్టెలో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి(out of the box thinking).ఖర్చు తగ్గుతుంది.
4 comments:
రెండవ పాయింటు నిజమే. మొమయిత్ ఖాన్ ఏం బావుంటుందని ఐటెం సాంగ్స్ చేయిస్తారో నాకర్ధం కాదు. పోకిరీలో పాట బావుండి ఆ పాట హిట్టయ్యింది కానీ మొమయిత్ గొప్పదనం వల్ల అని కొందరు అనుకొని మిగతా సినిమాలలో ఆమెకు ఎలా ఛాన్సిస్తారొ నాకస్సలు అర్ధం కాదు. నేనయితే మొమయిత్ ఖాన్ సినిమాలో వస్తే మొఖం తిప్పేసుకుంటాను లేదా డివిడి తిప్పేస్తాను.
nijame maastaroo... enno blogs unna mee blog nee chaduvutunnam kada.. alane andariki chance ravvalendi.. no offense..
Ano,no offence taken.Thanks for visiting my blog.I want the same thing in cinema industry also.Give chancwe to new talent.Save money and make money.
All are very good points.
Better ,please circulate this through the mail.
Post a Comment