నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, June 30, 2011

మానభంగం ఆయుధంగా సౌత్ ఆఫ్రికాలో లెస్బియన్ల మీద దాడులు


లెస్బియన్ల, గే లని గుర్తిస్తూ ఎన్ని చట్టాలొచ్చినా ప్రజల్లో వారిపైన అపోహలు తొలగడం లేదు. శరత్ లాంటివారు ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా ఇంకా అలాంటి లైంగిక కార్యకలాపాలు తప్పు, లేదా నేరం అన్న అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య రామ్ దేవ్ బాబా హోమో సెక్సువాలిటీ ఒక జబ్బు, ఈ జబ్బు పాలిట పడ్ద వారు జంతువులతో సమానం అని, తను వారికి ఆ జబ్బు నయం చేయగలనని ప్రకటించడం, గే, లెస్బియన్ హక్కుల కోసం పోరాడే బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇదేమీ జబ్బు కాదు, నువ్వు చికిత్స చేయాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకోవోయ్ అని ఘాటుగా సమాధానం చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.


   
అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో లెస్బియన్ల మీద దాడులు పెరిగి పోయాయి. ఈ దాడుల్లో మానభంగం అన్నది ప్రధాన ఆయుధంగా మారింది. లెస్బియన్ల మీద మానభంగానికి పాల్పడడం ద్వారా వారిని ఆ అలవాటు నుంచి బయట పడేస్తున్నామని ఈ చర్యకి పాల్పడ్డవారు చెప్పుకొంటున్నారు. అందు చేత వీటికి CORRECTIVE RAPES అని ఒక గౌరవమైన పేరు పెట్టారు.
Noxolo Nkosana 
సౌత్ ఆఫ్రికా జాతీయ ఫుట్ బాల్ జట్టులో సభ్యురాలయిన యూడీ సిమెలాన్ అనే లెస్బియన్ హక్కుల కార్యకర్త పైన కొందరు దాడి చేసి ఆమెని సామూహిక మానభంగం చేసి్, కత్తులతో పొడిచి చంపిన సంఘటనతో ఈ అకృత్యాలు వెలుగులోకొచ్చాయి. సిమెలాన్ తనని లెస్బియన్‌గా ప్రకటించుకొని, బహిరంగంగా ఒక మహిళతో కలిసి జీవిస్తున్న మొదటి మహిళ.
   
 ఈ సంఘటన తరువాత ఉవ్వెత్తున వెల్లువెత్తిన నిరసనతో అప్పటి వరకూ తమ మీద జరిగిన అకృత్యాలపైన ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన లెస్బియన్లు బయటకి రావడం మొదలు పెట్టారు. లులేకి సిజ్వే అనే సామాజిక కార్యకర్త మాటల్లో వారానికి కనీసం పది మంది లెస్బియన్లు సామూహిక మానభంగానికి గురవుతున్నారు. కానీ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసుల నుంచి కూడా వీరికి అవమానం ఎదురౌతుంది. నువ్వు ఆడవారితోనే చేస్తావు కదా, మగాళ్ళు నిన్ను ఎలా రేప్ చేస్తారు అని అవమానంగా మాట్లాడతారని, అందుకే ఎక్కువ మంది  తమకి జరిగిన న్యాయాన్ని మౌనంగా భరిస్తారని ఆమె చెప్పారు.




లెస్బియన్, గే హక్కులని గుర్తించిన ఒకే ఒక్క ఆఫ్రికా దేశం సౌత్ ఆఫ్రికా. అయితే అక్కడ ప్రజల్లో మాత్రం వీరి పట్ల వివక్ష తొలిగిపోలేదు. ప్రతి సంవత్సరం అక్కడ నమోదయ్యే 50,000 రేప్ కేసుల్లో ఎన్ని లెస్బియన్ల మీద జరుగుతున్నాయో ఖచ్చితంగా తెలియదు. చాలా మంది ఫిర్యాదు దారులు తాము లెస్బియన్స్ అని చెప్పుకోవడానికి వెనుకాడుతారు.


ఈ అకృత్యాలకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి హోమో సెక్సువాలిటీ, అందునా ఆడవారి మధ్య, అసహజమైన చర్య అన్న నమ్మకం. ఇది మతానికి విరుద్ధం అన్న భావనతో ఈ దాడులు జరుగుతున్నాయాన్నది ఒక కారణం. 
 


ఇక రెండవది, కొంచెం కండలు పెంచి, మగ రాయుళ్ళలా ఉన్న లెస్బియన్లు, (వీరిని Butch Lesbians అంటారు,) తమ ప్రియురాళ్ళను, తమ ఆడవారిని తమ నుంచి లాక్కుంటారన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం.


"ఈ లెస్బియన్లు మమ్మల్ని కించ పరుస్తున్నారు. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో శృంగారం చేస్తుంది అంటే, మేము చేతగాని వాఅమనేగా అర్ధం" అని చెప్పాడు ఇలాంటి కేసులో ఇరుక్కున్న తులాని బెంగు అనే వాడు. " ఒక సారి మేము రేప్ చేస్తే ఇలాంటి ఆడవాళ్ళు అమ్మాయిలయి పోతారు". ఇది మూడవ కారణం.


ఏప్రిల్‌లో నోక్సొలో నోగ్వజా అన్న అమ్మాయిని ఎనిమిది మంది కలిసి మానభంగం చేసి దాఋణంగా హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. 170,000 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా సంతకాలు చేసి పంపడంతో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ కరెక్టివ్ రేప్ కేసుల మీద సీరియస్ యాక్షన్ మొదలయింది.

Wednesday, June 29, 2011

కలెక్టర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో!!!


ఎంత పేదవాడైనా తమ పిల్లల్ని ఎంత చెత్తదయినా ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించి, చదివించే ఈ రోజుల్లో ప్రభుత్వ అదికారులు, అందునా సాక్షాత్తూ ఒక జిల్లాకి కలెక్టరుగా ఉన్న వ్యక్తి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిఉంచడం అన్నది ఊహకి కూడా అందని విషయం. 


  
అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకి కలెక్టరుగా ఉన్న ఆనంద్ కుమార్ అనే IAS ఆఫీసర్ ఈ పని చేసి చూపించాడు. 


 
ఒక రోజు ఉదయాన్నే ఆనంద్ కుమార్ తన సతీమణితో కలిసి, తన కూతురు గోపికని తీసుకొని కుముయిలన్‌కుట్టయ్ లోని  ఒక పంచాయతీ పాఠశాలకి వెళ్ళాడు. సాక్షాత్తూ కలెక్టరు, ఎటువంటి మందీ మార్బలం లేకుండా స్కూలుకి రావడం చూసిన హెడ్ మాస్టరు కంగారు పడుతూ ఉంటే ఆయన్ని మరింత షాక్‌కి గురి చేస్తూ "నా కూతురుకి ఈ స్కూలులో సీటు కావాలి" అన్నారు కలెక్టర్.


తన కూతురుకి కూడా మిగతా పిల్లల లాగా మధ్యాహ్న భోజనం కూడా పెట్టమని, మిగిలిన పిల్లలతో కలిపి మామూలుగానే చూడమని చెప్పి తన కూతురుని ఆ స్కూలులో జాయిన్ చేశారు ఆనంద్ కుమార్.


ఆ మధ్య ఒక మైనర్ ఆపరేషన్  కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా గాంధీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు మన గవర్నర్ నరసింహన్,  వీ ఐ పీ కి ఆపరేషన్ అంటే సీనియర్ డాక్టర్స్ వచ్చి చేస్తారు. వాళ్ళు ఉన్నంత సేపు సిబ్బంది అంతా మనికాళ్ళమీద ఉండి పని చేస్తారు కాబట్టి  ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద సాహసం కాదు కానీ భవిష్యత్‌కి పునాది వేయాల్సిన వయసులో ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించిన ఆనంద్ కుమార్ నిర్ణయం మాత్రం హర్షించదగ్గది. 


కలెక్టర్ కూతురు తమ స్కూలులో చేరాక సిబ్బంది మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆ స్కూలులో టీచర్లందరూ ఇప్పుడు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదువు చెబుతున్నారు.

ఎన్ని తరాలు అనుభవిస్తారు రిజర్వేషన్లు?


మనకి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా ఇంకా రిజర్వేషన్లు ఉండాలా అన్నది పెద్ద ప్రశ్న. రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ప్రతిపాదించిన అంబేడ్కర్ కూడా పది సంవత్సరాలు ఉంచి తరువాత ఎత్తేయమని చెప్పాడు. అయితే ఇది తేనె తుట్టె కాబట్టి ఏ ప్రభుత్వమూ రిజర్వేషన్లు ఎత్తి వేసే పని పెట్టుకోలేదు. అలాగే నేను కూడా ఆ జోలికి పోదలుచుకోలేదు. 


  
ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఒక కుటుంబలో ఎన్ని తరాలైనా రిజర్వేషన్లు అనుభవించవచ్చా అన్నది. ఒక తరంలో రిజర్వేషన్ ద్వారా డాక్టరో, ఇంజనీరో, ఐయ్యేయెస్సో, ఐపీయెస్సో అయ్యాక వాళ్ల పిల్లలు కూడా రిజర్వేషన్ కోసం పోటీ పడితే వాళ్ళతో సామాన్య బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబంలోంచి వచ్చిన పిల్లలు పోటీ పడగలరా? 


 
ఇలా ఆ కుటుంబాల్లోని తర తరాలుగా రిజర్వేషన్ ఫలితాలు దక్కుతూ ఉంటే ఒక సాధారణ మాదిగ, మాల, కుమ్మరి, చాకలి, వడ్రంగి వారికి అభివృద్ధి ఫలాలు దక్కేదెన్నడు? ఈ దళిత, బీసీ నాయకులు ఎప్పుడూ మాకు రాజ్యాధికారం కావాలి అనో, ఎస్సీలను వర్గీకరించాలి అనో, లేక వర్గీకరించకూడదు అనో గొడవ చేస్తూ ఉంటారు కానీ తమ వర్గాల ప్రజలందరికీ ఉపయోగపడేలా క్రీమీ లేయర్‌ని రిజర్వేషన్ పరిధిలోంచి తప్పించాలని ప్రతిపాదనలు చేయరెందుకో? అలా చేస్తే తమకి కూడా బొక్క పడుతుందన్న భయమా?

దళిత కార్డు బయటకి తీస్తే చెప్పుచ్చుక్కొట్టొద్దూ?!


మహిళలకి, దళితులకి రాజ్యాధికారం కావాలి అప్పుడే ఆ వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది, రక్షణ లభిస్తుంది అని ఆ వర్గాల నాయకులు అదే పనిగా ఊదరగొడుతూ ఉంటారు ఎక్కడ అవకాశం దొరికినా. కానీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ఒక దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత మహిళల మీద ఇబ్బడిముబ్బడిగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులకి, మహిళలకీ రాజ్యాధికారం లభించి ఏమి ఒరిగింది?




ముఖ్యమంత్రిగా తన రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించలేక తాను దళిత వర్గానికి చెందిన దాన్ని కావడం వల్ల విపక్షాలు తన మీద దాడి చేస్తున్నాయని ఒక కుంటిసాకు చెబ్తూ చాలా కన్వీనియెంట్‌గా తన తప్పుని కప్పిపుచ్చుకొనే దారి ఎంచుకొంది మాయావతి. 
   
ముఖ్యమంత్రి అయ్యుండీ తన బాధ్యత నెరవేర్చలేక నేను దళితురాలిని కావడం వల్లనే నా మీద అభాంఢాలు వేస్తున్నారని విపక్షాల మీదపడి ఏదవడానికి కనీసం సిగ్గయినా అనిపించలేదు ఈ నాయకురాలికి. 
  
అయినా దళిత, బలహీన వర్గానికి చెందిన మహిళ ఆమెలా వేయి రూపాయల నోట్లతో చేసిన దండలు చేసుకుని ఊరేగుతారా? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిలువెత్తూ పాలరాతి విగ్రహాలు పెట్టించుకొంటారా? ఒక స్థాయి నాయకులు కూడా ప్రతి చిన్నదానికి కులం కార్డు బయటికి తీసి నేను ఫలానా కులం వాడిని కాబట్టే నామీద అభియోగాలు మోపుతున్నారు అని ఏడ్చి చావడం ఎంతవరకూ సబబో వారికే తెలియాలి.

Tuesday, June 28, 2011

సత్య సాయిబాబా దైవాంశ గురించి ఇంకా అనుమానాలున్నాయా?


సత్య సాయి బాబా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఉత్త ఫ్రాడ్, ఆయన చేసేవన్నీ చీప్ మ్యాజిక్ ట్రిక్స్ అనే వాళ్ళు ఒక వైపు ఉంటే, కలియుగంలో వెలసిన సాక్షాత్ దైవాంశ సంభూతుడు ఆయన అనే వాళ్ళు ఇంకొకవైపు ఉంటారు. దేవుడో, ఫ్రాడో ఆయన తన డబ్బు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయనని దేవుడని ఒప్పుకోవడానికి ఇంకేమి కావాలి అని మధ్యేమార్గంలో వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
  


అసలు ఆయన దేవుడా కాదా అన్న వాదనతో పని ఏమిటి అని ప్రశ్నిస్తే, ఈ వాదన చాలా అవసరం అని నా ఉద్ధేశ్యం. కోట్లమంది భక్తులను, కోటాను కోట్ల సంపదను సంపాదించిన వ్యక్తి నిజంగా తన దైవాంశతోనే ఇదంతా సాధించాడా లేదా అన్నది తేల్చుకోవడం భవిష్యత్ తరాలవారికి ఎంతో అవసరం.


అయితే నా ఉద్ధేశ్యంలో ఆయన దైవాంశ ఉన్నవాడా లేక మామూలు మనిషా అన్న ప్రశ్నకి సమాధానం ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన అనుచరులూ, ట్రస్టు సభ్యులే ఇచ్చారు. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక అంటారు. బాబాతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి ఆయన దేవుడు అన్న నమ్మకం కానీ భయం కానీ ఉన్నట్లయితే ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా ఆయన సామాజిక సేవా కార్యకాలాపాలకి కూడబెట్టిన సంపదని తమ స్వంతానికి తరలించే సాహసం చేసి ఉండేవారా? బాబా పైనుండి ముడ్డి మీద తన్ని శిక్షిస్తాడన్న భయం ఉండేది కదా?


  
బాబాని దగ్గరనుండి చూసి ఆయన కూడా ఒక మామూలు మనిషే అని తెలిసి ఉన్నవారు కాబట్టే ఎవరికి దొరికింది వారు దోచిపారేసే సాహసం చేశారని నా అభిప్రాయం. దేవుడో, కాదో కానీ ఎన్నో మంచి పనులు చేసి, ఎందరికో సాయం చేసిన ఆ మనిషి చివరికి తన మరణం తరువాత తనవారు అని నమ్మిన వారి కారణం గానే నిత్యం వార్తల్లో నానుతూ అప్రదిష్ట పాలయ్యాడు. బాబాని తన స్వంత మనుషులు కంపు పట్టించినంతగా  ఆయన బద్ధవ్యతిరేకులయిన నాస్తికవాదులు కూడా పట్టించలేకపోయారు.

Saturday, June 25, 2011

అబ్బే దాడి చేయలా, చితగ్గొట్టారంతే!


మన వాడు అనుకుంటే వాడు కుమ్మినా సమ్మగా ఉంటుందని సామెత. దాన్ని మొన్న తిక్క శంకర్రావు నిరూపిస్తే నిన్న మరొక బడుద్ధాయి బృందం రిపీట్ చేసింది. 


  
ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియల సందర్భంగా తమ మీద జరిగింది అసలు దాడే కాదని అది కేవలం ఒక భావోద్వేగ పూరిత సంఘటన మాత్రమే అని తెలంగాణా నాయకులు వివేక్, సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాధం, ఇంకొకాయన చేతులు పైకెత్తి అభివాదం చేస్తూ ఫోజిచ్చి మరీ చెప్పుకొచ్చారు.


భావోద్వేగం అన్న పదం ఇటీవల బాగా పాపులరయింది. ఆ మధ్య వైఎస్సార్ చనిపోయిన కొత్తల్లో అంబటి రాంభాబు ఎప్పుడు టీవీ తెరపై కనిపించినా ఓ ఇరవై ముప్పై సార్లు భావోద్వేగం అన్న ఊతపదం లేకుండా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఈ పదాన్ని తెలంగాణా కోసం పోరాటం అంటూ, మంత్రిపదవులు వదులుకోలేక, బయట ఎక్కడైనా సిన్సియర్ ఉద్యమ కారులు ఉన్నచోటకి పోతే వారి చేతుల్లో దెబ్బలు తప్పించుకోలేక భవోద్వేగాన్ని బాగా అడ్డు పెట్టుకొంటున్నారీ కుహనా తెలంగాణా పోరాటయోధులు.

Thursday, June 23, 2011

తిక్క శంకరా! నిన్ను చావగొట్టింది ఎవరో నీకు తెలియదా?


మొన్న ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియలలో చోటు చేసుకున్న అరాచకత్వం ఆయన కూడా హర్షించి ఉండేవారు కాదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మడిమ తిప్పకుండా పోరాడిన వ్యక్తి ఆయన. ఆయన వేర్పాటువాదాన్ని హర్షించని వారు కూడ ఆయన విధానాల పట్ల ఎన్నడూ విమర్శలు చేయలెదు. ఆ అవకాశం ఇవ్వకుండా ఆయన పోరుబాట నడిచింది. ఉద్యమం పేరిట డబ్బు దండుకోవడం, దందాలు చేయడం లాంటి చిల్లర పనులకు ఎన్నడూ పాల్పడలేదు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఎన్నడూ విమర్శలనెదుర్కోలేదు. అలాంటి వ్యక్తి అంతిమ సంస్కారానికి హాజరయిన కాంగ్రెస్, తెదేపా నాయకులమీద హింసకు పాల్పడడం అన్నది అనుచితమైన చర్య, అది వేరే విషయం. ఇక్కడ టాపిక్ అది కాదు. 


 
తెలంగాణా కార్యకర్తల చేత చీపురు దెబ్బలు, చెప్పుయ్ దెబ్బలు, చావు దెబ్బలు తిన్న మంత్రి శంకర్ రావు ఎలా తెలివిగా ఆ దెబ్బలని తెలంగాణా ద్రోహులు, సీమాంధ్ర వ్యక్తుల ఖాతాలోకి నెట్టేశారన్నది ఇక్కడ టాపిక్. 
  
చావు దెబ్బలు తిని, పోలీసుల అండతో గుద్దలు చినిగి బయట పడ్డ శంకర్రావు తనని తెలంగాణా తమ్ముళ్ళు చావగొట్టారని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డాడో, లేక తన స్వంత గడ్డామీద తన వారి చేతుల్లోనే తన్నులు తిన్నానని చెప్పుకోవడానికి అహం అడ్డొచ్చిందో కానీ తనని కుమ్మిపారేసింది అంత్య క్రియలలో పాల్గొనేవారి ముసుగులో ఉన్న ఉద్యమ వ్యతిరేక శక్తులు, సీమాంధ్ర వ్యక్తులు అని చెప్పుకొని సంబరపడ్డాడు.


శంకరన్నా, నీకు బడితె పూజ చేసింది తెలంగాణా వాళ్ళే అని నీకు తెలియదా? ఉద్యమం పేరు చెప్తూనే, మంత్రి పదవిని అంటి పెట్టుకొని ఉద్యమ ద్రోహం చేస్తున్నావని నీమీద వారికి కోపంగా ఉందన్న విషయం నీకు తెలియదా? రేప్పొద్దున ఈ పదవులు నాకొక లెక్కా కాదు, పక్కా కాదు, తొక్కలో మంత్రి పదవి నాకొద్దు, ఉద్యమమే నాకు ముద్దు అని రాజీనామా విసిరి కొడితే, నిన్ను చెప్పులతో కొట్టిన వాళ్ళే నిన్ను భుజాల మీద ఊరేగిస్తారని కూడ నీకు తెలుసు కదా?


అయినా నా పదవి నాకు ముఖ్యం అనుకునే నీలాంటి వాళ్ళు ఉద్యమాల జోలికి, ఉద్యమకారులున్న చోటికీ వెళ్ల కూడదు. ఇల్లూ, అసెంబ్లీ దాటి మరో చోటికి పోకుండా రోజులో రెండు మూడు సార్లు సోనియమ్మ నామ జపం చేసుకుంటూ, ఇలా ఎవరైనా చనిపొయినప్పుడు ప్రెస్‌నీ, మీడియానీ ఇంటికే పిలిపించుకొని ఈ సంతాప సందేశం పడేస్తే సరిపోతుంది కదా! ఇలా ఎండల్లో చెమట్లు కక్కుకుంటా పోవడమెందుకు, చావుదెబ్బలు తిని వొళ్ళు, గుడ్దలూ పాడు చేసుకోవడమెందుకు, అకారణంగా ఆ పాపాన్ని మరెవరిమీదకో తోసి ఇంకొంచెం పాపం మూటగట్టుకోవదమెందుకూ చెప్పరాదే?

Thursday, June 16, 2011

బాబా రామ్‌దేవ్ నీకిది తగునా?


రామ్‌దేవ్ బాబా గారూ, మీకున్న అశేష అభిమానుల్లో నేను ఒకడిని. ఆ మధ్య మీరు అంగరంగ వైభవంగా డిల్లీ రాం‌లీలా మైదానంలో నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు మీకోసం అక్కడిదాకా రాలేకపోయినా ఇక్కడినుంచి నేను కూడా చప్పట్లు కొట్టాను. సన్యాసికి ఇంత సీను అవసరమా అని గిట్టని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు సన్యాసి అయితే మాత్రం కలాపోసన ఉండఖ్ఖర్లేదా అని గొడవ వేసుకున్నాను నేను మీమీద అభిమానంతో. మీ కోర్కెలు అసంబద్ధం అని వాళ్ళంటే ఏది ఏమైనా దేశం మొత్తాన్ని  నల్ల ధనం గురించి మాట్లాడుకొనేలా చేశాడ్రా మావాడు అని  చంకలు గుద్దుకొన్నాను.
  


అయితే బాబాగారూ, మీ దృష్టికి మీలాంటి వాడే మరొక బాబా చేస్తున్న అకుంఠిత దీక్ష కనరాలేదా. ఆయన మీలాగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరినీ ఉరి తీయండి, చట్టాలు మార్చి స్వదేశీ చట్టం తీసుకురండి, విదేశాల్లో ఉన్న నల్ల ధనమంతా మన దేశానికి తీసుకురండి అని గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఆయన అడిగింది హిందువులు అతి పవిత్రంగా భావించే గంగా నదిని బతకనియ్యండ్రా బాబూ అని మాత్రమే.


మీకు ఇప్పటికీ అర్ధం కాకపోతే నేనె చెప్తాను వినండి. నెను చెప్తున్నది స్వామి నిగమానంద సరస్వతి గురించి. పాపం ఆయనకి మీలాగా కోట్ల సంఖ్యలో శిష్యపరమాణువులు, కోటానుకోట్ల ఆస్తులూ, స్వంత ద్వీపాలు లెవు కాబట్టి ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి మీడియా కూడా. కాబట్టి దీక్ష మొదలయిన రెండో రోజునే పోలీసులొచ్చి ఆయన దీక్షని భగ్నం చేసే శ్రమ తీసుకోలేదు. కాబట్టి ఆయన మూడు నెలలయినా దీక్ష కొనసాగించి కోమాలోకి వెళ్ళాడు. 
   


మీడియాని, రాజకీయ నాయకులని, నాలాంటి టైమ్‌పాస్ గాళ్ళని వదిలేయండి. ఆయన కోమాలో ఉన్న Himalayan Institute of Medical Sciences లోనే మీరూ ఉన్నారు కదా. రెండు రోజులయితే ఆయన ఉన్న ICU లోనే మీరూ ఉన్నారు. ఆయన మీకు కనిపించలేదా? శోభనం రాత్రి అలక పాన్పు ఎక్కిన అల్లుడిని కాళ్ళు గడ్దం పట్టుకున్నట్లు ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి రోజుకి రెండుసార్లు ఆ హాస్పిటల్‌కి వచ్చి మిమ్మల్ని బతిమిలాడుకున్నప్పుడయినా ఆ అభాగ్యుడి సంగతేమిటో కాస్త చూడమంటే నిగమానంద దీక్ష గురించి ఆయన బతికున్నప్పుడే దేశమంతా తెలిసి ఉండేది కదా? నిగమానందకి నేను మద్ధతు ప్రకటిస్తున్నాను అని మీరు ఒక మాట చెప్పి ఉంటే కనీసం కోమాలో ఉన్నప్పుడయినా ఆయన దీక్ష ఫలించి ఉండేదేమో కదా?
  


అలా అయితే మీ వారం రోజుల దీక్ష ఆయన 114  రోజుల మొక్కవోని దీక్షముందు వెలవెల పోతుందని భయపడ్డారేమో కదా?

బ్రెస్టారెంట్లు-తిండితో బాటు అందాల విందు


ఇటీవల అమెరికాలో బ్రెస్టారెంట్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇవి ఆర్ధిక మాంద్యాన్ని సైతం తట్టుకొని లాభాలనార్జిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే breastaurant అంటే breast చూపించే అమ్మాయిలున్న restaurant అని అర్ధం. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు అమ్మాయిలే అయి ఉంటారు. వాళ్ళు కురచ నిక్కర్లు, బిగుతు జాకెట్లు వేసుకుని, ఒక మాటలో చెప్పాలంటే ఇపుడొస్తున్న తెలుగు, హిందీ సిన్మాల హీరోయిన్లలా ఉంటారన్నమాట.
Breastaurants Grow 

అందాలు చూపితే మాత్రమె సరిపోదు. మేము ఆహారం కూడా మంచి క్వాలిటీతో అందిస్తాము అని చెప్పుకుంటారు ఈ బ్రెస్టారెంట్ల యజమానులు. Twinpeaks , muga n jugs, hooters, burger girl, honey schack ఇవి కొన్ని ఈ టైపు రెస్టారెంట్ల పేర్లు. 
 


 అమెరికాలో విజయవంతమయ్యాక ఆ ఊపుతో యూరప్‌ని కూడా ఆక్రమించుకోవడానికి ఈ రెస్టారెంట్ల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నరు.




అలా అని ఇందులో పని చేసే అమ్మయిలు అశ్లీలంగా వేషధారణతో ఉంటారు అంటే వీళ్ళు ఒప్పుకోరు. మా అమ్మాయిలు ఏం చూపించాలో అంతవరకే చూపిస్తారు. ఏం చూపకూడదో అది చూపించరు అని సమర్ధించుకుంటారు. అయితే ఈ రెస్టారెంట్లు అశ్లీలతని పోషిస్తున్నాయని సంప్రదాయవాదులు దుమ్మెత్తి పోయడమే కాకుండ తమ ప్రాంతంలో ఇవి ఉండడానికి వీల్లేదని కోర్టులకు కూడా ఎక్కుతున్నారు.

 


వీటిలో పని చెసే అమ్మాయిలు  ఏం చూపినా, ఏం చూపకపోయినా వీళ్ళ బ్యాలన్సు షీట్లు మాత్రం లాభాలనే చూపిస్తున్నాయి.