నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, June 2, 2011

రేప్ చేయబోయిన వాడి అంగం కోసిపారేసిన బంగ్లాదేశీ కాళిక


రేప్ కేసుల్లో నేరస్తులకు castration శిక్షగా విధించాలని రాడికల్ మహిళా హక్కుల వాదులు ఎప్పటినుండో కోరుతున్నారు. పిల్లల పైన లైంగిక అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇదే సరయిన శిక్ష అని ఈ మధ్య ఒక కోర్టు కూడా చెప్పింది. అయితే ఇవన్నీ ఎప్పుడు నిజమౌతాయో గానీ బంగ్లదేశ్‌లో ఒక నలభై యేళ్ళ మహిళ తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డ తన పొరుగింటి వ్యక్తికి ఈ శిక్ష విధించింది.


  
బంగ్లా రాజధాని ఢాకాకి 150 కిలోమీటర్ల దూరంలోని మీర్జాపురంలో ఒక పల్లెటూరిలో మొంజు బేగమ్ అనే మహిళ తనపైన అత్యాచార యత్నం చేసిన తన పొరుగింటి వాడైన మొజమిల్ హక్ మాజి అనే వ్యక్తి పురుషాంగం కత్తిరించింది. అంతటితో ఆగక ఆ అంగాన్ని ఒక పాలిథీన్ పేపర్లో చుట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మాజి పైన కేసు పెట్టింది. అందుకు సాక్ష్యంగా ఆ అవయవాన్ని పోలీసులకు చూపెట్టింది.
 


పోలీసుల కథనం మేరకు మాజి గత ఆరు నెలలుగా మొంజుని వేధిస్తూ ఉన్నాడు. చివరికి తెగించి మొంజు ఉంటున్న పాకలోకి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ప్రవేశించి ఆమె పైన అత్యాచార యత్నం చేశాడు. అతడి బారి నుండి తప్పించుకొనే ప్రయత్నంలో ఆమె చేతికి కూరగాయలు కోసుకునే కత్తి దొరికింది. దానితో అతడి అంగాన్ని కోసింది మొంజు.


 
అయితే పురుషాంగాన్ని కోల్పోయిన మాజి కథనం వేరుగా ఉంది. తమిద్దరి మధ్యా గత 15 సంవత్సరాలుగా లైంగిక సంబంధం ఉందనీ, అయితే ఇటీవల ఢాకాకు లేపుకెళ్ళి అక్కడ కాపురం పెట్టమని మొంజు తనని బలవంతం చేస్తుందని, తను భార్యనీ, పిల్లలని వదిలి రానని చెప్పడంతో ఆమె తన మీద కోపం పెంచుకుందని, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తనని రమ్మని పిలవడంతో తాను వచ్చానని, ఇద్దరూ శృంగారంలో ఉన్న సమయంలో ఆమె తన అంగాన్ని చేజిక్కించుకొని అంతకు ముందే పథకం ప్రకారం అందుబాటులో ఉంచుకొన్న కత్తితో దాన్ని కోసేసిందని మాజి పోలీసులతో చెప్పాడు. పోలీసులు మొంజు బేగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మాజి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయితే అరెస్టు చేస్తామని అంటున్నారు.


మాజికి చికిత్స చేస్తున్న ఢాకాలోని షేర్-ఈ-బంగ్లా వైద్యులు అంగాన్ని బాగా మొదట్లోకి కోయడం వలన తిరిగి అతికించడం సాధ్యపడదని, మాజికి మూత్రం పోసుకోవడానికి మాత్రం ఆపరేషన్ చేయడం వల్ల వీలవుతుందని చెప్పారు.


ఈ సంఘటనలో ఇద్దరికీ పెళ్ళయి పిల్లలుండడం విశేషం. మొంజు బేగమ్‌కి ముగ్గురు పిల్లలయితే, మొజమిల్ హక్ మాజికి అయిదుగురు పిల్లలున్నారు. 

No comments: