నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, June 2, 2011

మన రాష్ట్రం నుండి ఎంతమందిని తీహార్ జైల్లో పెట్టొచ్చు?


అవినీతిపైన పోరాటం ఇప్పుడు తీవ్రమౌతుంది. ఆ తీవ్రతకు అధికార పీఠాలు కదుల్తున్నాయి. కల్మాడీ, రాజా, కనిమోళి, ఇంకెందరో ఇప్పుడు తీహార్‌లో ఊచలు లెక్కపెడుతున్నారు. అన్నా హజారే దీక్షకు దిగితే ప్రభుత్వం దిగి వచ్చింది. రేపు ఢిల్లీ రామ్ లీలా మైదానంలొ నిరాహార దీక్ష చేస్తానని రామ్‌దేవ్ బాబా ప్రకటిస్తే ఆయనను దీక్ష చేయవద్దని మీసాలు, గడ్డాలు పట్తుకొని బతిమలాడుకుంటున్నారు మంత్రివర్యులు. 


 
అవినీతి అంశమ్మీదే తమిళనాడులో కరుణానిధిని మూల కూర్చోబెట్టారు. ఇదే గతి తమకీ పడుతుందని భయపడి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి, దొంగచాటు మైనింగ్‌కీ రాజాధిరాజులైన బెళ్ళారి రెడ్డి బ్రదర్స్‌ని దూరంగా పెట్టాలని చూస్తున్నారు. అసలు వాళ్ళు మంత్రివర్గంలోకి ఎలా వచ్చారో నాకు తెలియదంటే నాకు తెలియదని అందరూ తప్పించుకొంటున్నారు. చివరికి వాళ్ళకి ఆరాధ్యదైవమైన సుష్మా స్వరాజ్ కూడా అబ్బే వాళ్ళు అసలు మా పార్టీలో ఉన్న విషయమే నాకు తెలియదు అనేదాకా వచ్చింది.
ఈ అవినీతిపైన పోరాటం మన రాష్ట్రానికి కూడా పాకి మన వాళ్ళని కూడా ఒక దెబ్బేస్తే మన రాష్ట్రం నుంచి తీహార్‌కి వలస కట్టే వాళ్ళెవరో చూద్దాం.


నాకైతే ఆ లిస్టులో మొదటగా కనిపించేది జగన్ మోహన్ రెడ్డి. ఇక్కడ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అని ప్రతిపక్షాల గోల చూసి కాకుండా గాలి బ్రదర్స్‌తో యువ నేత గారికున్న అత్యంత సన్నిహిత బంధాన్ని చూసి సారు తీహార్ బాటపట్టే మొదటి వ్యక్తి అని నా నమ్మకం. ఇక సాక్షిలో, ఆయన సిమెంటు కంపెనీల్లో, పవర్ ప్లాంట్లలో బినామీ పెట్టుబడులు అన్నీ ఇన్నీ కావు కదా. ఆర్ధిక శాస్త్రం అసలు తెలియని నా బోటి వారికి కూడా కొంత నాలెడ్జి కలిగించే ఆ కుంభకోణాల బాగోతం చూసాక తీహారే జగన్‌కి సరయిన స్థానం అని అనిపించకుండా ఉంటుందా.


   
 తరువాత స్థానంలో తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్ర బాబు నాయుడు ఉంటారని నా అంచనా. ఆయన పాలనలో ఎన్ని ఆరోపణలు, భూ సంతర్పణలు, కుంభకోణాలు. ఇన్ని ఉన్నాక తీహార్‌కి వెళ్ళకుండా ఆపడం సాధ్యమా. మూడవ స్థానంలో తెలంగాణా పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ దండుకున్న కేసీఆర్ ఫామిలీ ఉంటుందని నా నమ్మకం. 


ఈ ముగ్గుర్నీ తీహార్‌కి పంపేస్తే రాష్ట్రం కొంచెం కుదుట పడుతుందేమో?

9 comments:

Praveen Sarma said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

శ్రీకాంతాచారి said...

దీంట్లో కూడా తెలంగాణా పై మీకున్న అక్కసు బయట పడుతుంది. మీరు రాంకులే ఇవ్వదలుచుకుంటే నక్కబావ తర్వాత సొమ్ములు పానాయన్న బొత్స, రాయపాటి ఆరోపణలు చేసిన కన్నా, అడ్డదిడ్డంగా కబ్జాలు చేసిన లగడపాటి, డబ్బులు దండుకుని టికెట్లిచ్చిన చిరు ఇలా చాలా మంది పేర్లు రావాలేమో KCR కంటే ముందు..

Praveen Sarma said...

మలక్పేట్ రౌడీ నా చేతిలో ఓడిపోయాడు. వాడు నా మీద పెట్టే వీడియోలకి మాలికలో బేనర్లు పెట్టమంటే దమ్ము లేక కప్పలా పారిపోయాడు.

Anonymous said...

@ శ్రీకాంతాచారి ,

Is internet available in HELL also ?!

Anonymous said...

@ is internet available in HELL also?

ఈయన ఆ శ్రీకాంతాచారి కాదులెండి. ఆయన పేరు పెట్టుకున్న మూర్ఖ తెలబాన్.

అయితే ఇక్కడ ఈ శ్రీకాంతాచారి ఒక విషయం ఒప్పుకున్నాడు...కేసీఆర్ ఫ్యామిలీ డబ్బులు దండుకున్న విషయాన్ని. కాకపోతే స్థానాల విషయంలో ఈయన విబేధిస్తున్నాడు. అంతే.

Anonymous said...

babu praveen,
ee post ki nee comment ki sambandam unda.

nuvvu cheppedhi nijam ayina, yeela asandrba prakatanlu comments to ee madya tega visugistunnatlu ledhu.
oka sari alochinchu.
malla naa meeda daadi cheyakem mallika group vadini ani. :)

Anonymous said...

శ్రీకాంతాచారి గారు, మొదట మీ కామెంట్ చూసి మీరు ఇంకా కెసిఆర్ గారికి మొదటి స్థానం ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారేమో అని అనుకున్నాను.

కృష్ణ గారు, వక్ర మార్గాల్లో డబ్బు దండుకునే నాయకులని ప్రాంతాలకు అతీతంగా ఖండించడం మాని, (శ్రీకాంతాచారి గారి లా) ప్రాంతీయ లేదా వ్యక్తిగత అభిమానాలతో సంకుచితంగా జనం వారిని వెనక వేసుకుని వచ్చినంత కాలం మన రాష్ట్రం నుండి ఎవరు తీహార్ జైలు కి వెళ్ళడం కాదు కదా కనీసం house arrest కూడా కారు. మీరు బెంగ లేదా ఆశలు పెట్టుకోకండి :-)

Yagna said...

"is internet available in HELL also?"
కెవ్వ్వ్వ్వ్వ్....ప్రాంతాలవారీగా జనాల్ని ముక్కలు చేసేవాడు దున్నపోతైపుట్టున్...

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) said...

దీంట్లోగూడా ప్రాంతీయ విభేదాలెందుకు గానీ, ఆంధ్ర ప్రాంత వరకు టాప్ టెన్ ర్యాంకర్లనీ, తెలంగాణా వరకో టాప్ టెన్ ర్యాంకర్లనీ సెలక్ట్ చేసెయ్యండి.
అన్నట్లు,Anonymous గారూ! ఏ ప్రాంతం వాడైనా నాయకుడు వినాయకుడేనండీ:)