నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, June 3, 2011

కాలిఫోర్నియా బూతు సామ్రాజ్యానికి గడ్డు కాలం


బూతు చిత్రాలు, బూతు పుస్తకాలకు ఇంగ్లీషులో పోర్నోగ్రఫీ అని ఒక ముద్దు పేరుంది. ఇంటర్నెట్‌లో ఈ పోర్నో సైట్‌లు మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. చాలామటుకూ ఈ బూతు సినిమాలు, ఫోటోలు  ఎక్కడో గుప్‌ఛుప్‌గా చిత్రీకరిస్తుంటారు. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పోర్నోగ్రఫీని 1980 దశకంలోనే చట్టబద్ధం చేశారు. దీని వల్ల వీటిలో నటించే నటీ నటులకు కొన్ని హక్కులు ఏర్పడ్డాయి. కొన్నేళ్ళ క్రితం వరకూ మూడు ముద్దులూ ఆరు భంగిమలుగా వర్ధిల్లిన ఈ బూతు సామ్రాజ్యం ఇప్పుడు కష్టాల్లో పడింది. 


ఇందుకు మొదటి కారణం ఇంటర్నెట్. బూతు ఫ్రీగా నెట్‌లో దొరుకుతున్నందువలన డబ్బులిచ్చి డీవీడీలు కొనే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ డీవీడిలని ఎవడో ఒకడు నెట్‌లో అప్‌లోడ్ చేసి పారేస్తే ఇక దాన్నుండి అందరూ డౌన్‌లోడ్ చేసుకోవడం మొదలుపెట్టి డబ్బులిచ్చి కొనడం మానేస్తారన్నది ఈ బూతు సామ్రాజ్యాన్ని నడిపే వాళ్ళ బాధ. 


 
ఇకపోతే కాలిఫోర్నియా రాష్ట్రం బూతు సిన్మాలలో నటులు ఖచ్చితంగా కండోమ్స్ ధరించాలని ఒత్తిడి చేస్తూ త్వరలో ఆ దిశగా ఒక చట్టాన్ని తేనుండడం కూడా వీరిని ఆందోళనకు గురి చేస్తుంది. తొడుగులేసుకుని శృంగారం చేసే ఎవడు చూస్తాడు అన్నది వీరి కంప్లైంటు. అయితే వీటిలో నటించే నటీ నటులు మాత్రం ఈ కండోమ్ నిబంధనని స్వాగతిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమాలలో నటించిన కొందరు HIV బారిన పడడంతో కోర్టులు Hustler, Forsaken Picturesఅనే రెండు బూతు కంపెనీలకు జరిమానా కూడా విధించాయి. దీనికి తోడు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం నుండి పోర్నో పరిశ్రమ ఇంకా కోలుకోకపోవడం కూడా దీని దయనీయ స్థితికి ఒక కారణం.


   
అందుకని చాలామంది సంప్రదాయక డీవీడీ, పుస్తకాలు లాంటి వ్యవహారానికి స్వస్తి చెప్పి ఇంటర్నెట్‌లో పే సైట్ల కింద మారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక డీవీడీలో కొంత క్రియేటివిటీ ఉపయోగించే వీలుంటుంది, ముందూ వెనకా కొంచేం స్టోరీ పెట్టి మధ్యలో సెక్స్ చూపించవచ్చు, నెట్‌లో ఇవన్నీ డబ్బులిచ్చేవాళ్ళకి నచ్చవు, మొదటినుంచీ చివరివరకూ సెక్స్ మాత్రమే ఉండాలి అని కొందరు వాపోతున్నారు.   

2 comments:

Yagna said...

క్రిష్ణ గారూ,
బూతు సామ్రాజ్యం ఇప్పుడూ వటవ్రుక్షంలా విస్తరించిందండీ. ఎంతకాలం జనాలు ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోలు చూస్తారు? జనాల టేస్ట్ ఇప్పుడు 'లైవ్ స్ట్రీమింగ్' మీద పడింది. ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెబ్సైట్ కి వెళ్ళడం, పైసలు చెల్లించడం, ఏది ఎలా చూడాలో అది అలా చూడడం, ఇదీ ఇప్పటి కథ. చూసేవాళ్ళూ హ్యాపీ, చూపించేవాళ్ళూ హ్యాపీ, నిర్వాహకులూ హ్యాపీ. Win, Win, Win... సర్వేజనా సుఖినోభవంతు!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అవును. కళాత్మక బూతు అంతరించిపోతోంది.