నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, June 16, 2011

బాబా రామ్‌దేవ్ నీకిది తగునా?


రామ్‌దేవ్ బాబా గారూ, మీకున్న అశేష అభిమానుల్లో నేను ఒకడిని. ఆ మధ్య మీరు అంగరంగ వైభవంగా డిల్లీ రాం‌లీలా మైదానంలో నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు మీకోసం అక్కడిదాకా రాలేకపోయినా ఇక్కడినుంచి నేను కూడా చప్పట్లు కొట్టాను. సన్యాసికి ఇంత సీను అవసరమా అని గిట్టని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు సన్యాసి అయితే మాత్రం కలాపోసన ఉండఖ్ఖర్లేదా అని గొడవ వేసుకున్నాను నేను మీమీద అభిమానంతో. మీ కోర్కెలు అసంబద్ధం అని వాళ్ళంటే ఏది ఏమైనా దేశం మొత్తాన్ని  నల్ల ధనం గురించి మాట్లాడుకొనేలా చేశాడ్రా మావాడు అని  చంకలు గుద్దుకొన్నాను.
  


అయితే బాబాగారూ, మీ దృష్టికి మీలాంటి వాడే మరొక బాబా చేస్తున్న అకుంఠిత దీక్ష కనరాలేదా. ఆయన మీలాగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరినీ ఉరి తీయండి, చట్టాలు మార్చి స్వదేశీ చట్టం తీసుకురండి, విదేశాల్లో ఉన్న నల్ల ధనమంతా మన దేశానికి తీసుకురండి అని గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఆయన అడిగింది హిందువులు అతి పవిత్రంగా భావించే గంగా నదిని బతకనియ్యండ్రా బాబూ అని మాత్రమే.


మీకు ఇప్పటికీ అర్ధం కాకపోతే నేనె చెప్తాను వినండి. నెను చెప్తున్నది స్వామి నిగమానంద సరస్వతి గురించి. పాపం ఆయనకి మీలాగా కోట్ల సంఖ్యలో శిష్యపరమాణువులు, కోటానుకోట్ల ఆస్తులూ, స్వంత ద్వీపాలు లెవు కాబట్టి ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి మీడియా కూడా. కాబట్టి దీక్ష మొదలయిన రెండో రోజునే పోలీసులొచ్చి ఆయన దీక్షని భగ్నం చేసే శ్రమ తీసుకోలేదు. కాబట్టి ఆయన మూడు నెలలయినా దీక్ష కొనసాగించి కోమాలోకి వెళ్ళాడు. 
   


మీడియాని, రాజకీయ నాయకులని, నాలాంటి టైమ్‌పాస్ గాళ్ళని వదిలేయండి. ఆయన కోమాలో ఉన్న Himalayan Institute of Medical Sciences లోనే మీరూ ఉన్నారు కదా. రెండు రోజులయితే ఆయన ఉన్న ICU లోనే మీరూ ఉన్నారు. ఆయన మీకు కనిపించలేదా? శోభనం రాత్రి అలక పాన్పు ఎక్కిన అల్లుడిని కాళ్ళు గడ్దం పట్టుకున్నట్లు ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి రోజుకి రెండుసార్లు ఆ హాస్పిటల్‌కి వచ్చి మిమ్మల్ని బతిమిలాడుకున్నప్పుడయినా ఆ అభాగ్యుడి సంగతేమిటో కాస్త చూడమంటే నిగమానంద దీక్ష గురించి ఆయన బతికున్నప్పుడే దేశమంతా తెలిసి ఉండేది కదా? నిగమానందకి నేను మద్ధతు ప్రకటిస్తున్నాను అని మీరు ఒక మాట చెప్పి ఉంటే కనీసం కోమాలో ఉన్నప్పుడయినా ఆయన దీక్ష ఫలించి ఉండేదేమో కదా?
  


అలా అయితే మీ వారం రోజుల దీక్ష ఆయన 114  రోజుల మొక్కవోని దీక్షముందు వెలవెల పోతుందని భయపడ్డారేమో కదా?

14 comments:

Anonymous said...

అలా అయితే మీ వారం రోజుల దీక్ష ఆయన 114 రోజుల మొక్కవోని దీక్షముందు వెలవెల పోతుందని భయపడ్డారేమో కదా?

I think the above line is unnecessary. You are projecting yourself on Baba Ramdev. it is not fair that after the incident happened.

Praveen Sarma said...

బాబాలని విమర్శిస్తే నీది మార్తాండవాదం అనో, చీబోరికవాదం అనో అంటారు. వీళ్ళ రొటీన్ స్టైలే అది. ఈ లింక్ చూడు: http://telugu.stalin-mao.in/57212974

Apparao Sastri said...

పూల దండ , చెప్పు దెబ్బ రెండూ సరిగ్గా పడలేదనుకుంటా :(
అక్కడ పూల దండ సూటిగా వేసి ఉంటె బాగుండేది- ఇక్కడ చెప్పు దెబ్బ కొట్ట కుండా

Praveen Sarma said...

కెలుకుడుగాళ్ళు పెట్టిన ఈ బ్లాగులు చూడు:
http://onlyforpraveen.wordpress.com
http://prapisasa.wordpress.com
http://toluteestaa.wordpress.com
http://pranaadavanam.wordpress.com

Apparao Sastri said...

good info

Praveen Sarma said...

మతం కంటే డబ్బులే ముఖ్యమనుకున్నప్పుడు సెక్యులరిస్ట్‌లని విమర్శిస్తే వాళ్ళకేమిటి లాభం? నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నిజమే కానీ నిగమానంద సరస్వతి కేవలం పేదవాడనే కారణంగా అతను నిరాహార దీక్ష చేస్తే మీడియా పట్టించుకోకపోవడం, అతను హాస్పిటల్‌లో చనిపోవడం బాధ కలిగించాయి.

Praveen Sarma said...
This comment has been removed by the author.
Praveen Sarma said...

http://vasavya.blogspot.com/2011/06/blog-post_04.html

Snkr said...
This comment has been removed by the author.
Snkr said...

తనే ICUలో వున్న బాబా/డాబా, ఇంకా ICUలో ఎవరెవరు వున్నారు, ఏ ఏ కారణాల మీద వున్నారు, నిరాహార దీక్షలు తనలా ఎవరైనా చేశారా? చేస్తే ఎందుకు చేశారు? ఏదో మీ చేతిలో బ్లాగుంది కదా అని రాసి పడేశారు గాని, ఇవన్నీ ఆరా తీయడం బెడ్ మీద నీరసంగా పడుకున్న ఏ మనిషికైనా సహజంగా వుంటుందా? మరీ మీరూ ప్రవీణ్ లా మాట్లాడితే ఎలా? :)) :P

Praveen Sarma said...

డబ్బున్న బాబా సినిమాలాగ భారీ సెట్టింగ్‌ల మధ్య ఉత్తిత్తి నిరాహార దీక్ష చేసినా మనవాళ్ళు విజిలేస్తారు. నిగమానంద సరస్వతి లాంటి పేద సన్యాసి చనిపోతే అదో పెద్ద వార్త అనుకోరు. వీళ్ళకి మతం కంటే డబ్బే ముఖ్యం కదా.

Anonymous said...

జాతీ నహీ, ధరమ్ నహీ, పైసే హై పరమాత్మా

పుట్టపర్తి అనూరాధ. said...

పాపం ..నాకు ఒళ్ళు జలదరిస్తూంది..కానీ అతను ఎందుకలా చనిపోయాడు..కనీసం వాస్తవాన్ని గమనించి మన చంద్రబాబులా తెలివిగా దీక్షకు జాతీయగీతం పాడేయ వలసింది..

Praveen Sarma said...

ఒకావిడ పంపించిన లింక్ చదివిన తరువాతే నాకు ఆ విషయం తెలిసింది. లేకపోతే నాకూ ఆ విషయం తెలిసేది కాదు.