నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 31, 2010

కనక దుర్గమ్మ ఆలయం-లడ్డూ తయారీ-శుచీ శుభ్రతా

ఇంద్ర కీలాద్రిపైనున్న కనక దుర్గమ్మ ఆలయంలో లడ్డూ తయారీకి కేవలం బ్రాహ్మణులనీ వైశ్యులనీ మాత్రమె అనుమతించాలన్న నిర్ణయాన్ని కొంతమంది విచిత్రంగా సమర్ధిస్తున్నారు. లడ్డూ తయారీకి శుచీ శుభ్రత పాటించాలనీ అందుకు వీళ్ళయితేనే సరి పోతారనీ లాజిక్కు తీస్తున్నారు.

శుచీ శుభ్రత అనేది కులంలో గానీ పుట్టుకలో గానీ ఉండవు.శుబ్బరంగా స్నానం చేసి ఉతికిన బట్టలెసుకొంటే ఏ కులం వాడైనా శుభ్రంగా శుచిగా ఉన్నట్టే. ఆలా కాకపోతే ఎవరైన కంపుగా ఉన్నట్టే.

నా చిన్నప్పుడు మా వూరిలో యానాది పోలిగాడు నా క్లాస్ మేట్. వాళ్ళమ్మ వాడిని ప్రతి రోజూ ఉదయం వాళ్ళు కాపలా ఉంటున్న పొలం పక్కనే పారుతున్న పంట కాలువలో శుద్ధంగా స్నానం చేయించి, ఉతికిన బట్టలేసి, అవి ఊళ్ళో ఉన్న రెడ్డెమ్మలు, నాయుడమ్మలూ, బాపనమ్మలు వాళ్ళ పిల్లలకు పనికి రాకపోతే దానంగా ఇచ్చినవే అయినా, స్కూలుకి పంపేది.వాడు శుభ్రత విషయంలో ఏ ఇతర సో కాల్డ్ ఉన్నత కులాల పిల్లలకి ఏమీ తీసిపోకుండా వుండేవాడు.వాడితో పోలిస్తే వూళ్ళో ఉన్న పెద్ద రెడ్ల, నాయుళ్ళ,పంతుళ్ళ,శెట్టి గార్ల పిల్లలే కొంచెం మురికిగా ఉండే వాళ్ళు.

అలాగే దుర్గ గుడిలో పోటు దగ్గర ఒక షవర్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ పూలులో దిగాలంటే ఎలాగైతే స్నానం చేసి దిగుతామో లడ్డూలు చేసే ముందు షవర్ తప్పనిసరి అని, వెంట్రుకలు రాలిపడకుండా తలకి కాప్ లు, ప్రతిరోజూ ఫ్రెష్ గా ఉతికి ఇస్త్రీ చేసిన యునిఫాం ధరించాలని రూలు పెడితే శుచీ శుభ్రతా పాటించవచ్చు కదా? ఈ మాత్రం దానికి కొంత మందికి ఉపాధి దూరం చేసి కుల మత వైషమ్యాలు పెంచడం దెనికి?
PS.This is my last post on this subject.

శ్యామలా ఆంటీ, చానళ్ళ వాళ్ళకెలాగూ లేదు,నీ కేమైంది బుద్ధి?

ఈ మధ్య శ్యామల ఆంటీ అనె ఒక సెక్సీ జోగినితొ అన్ని చానళ్ళ వాళ్ళూ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు.ఏపీ మీడియా కబుర్లు బ్లాగులో రాము గారు దీనిమీద ఒక పోస్టు కూడా పెట్టారు.దానిలో ఒక ప్రశ్న అడుగుతాడు యాంకరు.ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా కామెంటు చేశారా అని.దానికి ఆంటీ జవాబు ఏమిటంటే “ఒక సారి కొంత మంది యువకులు నన్ను చూసి దీనమ్మా ఏమి హైటుందిరా ఇది అన్నారు.అప్పుడు నేను వాళ్ళ వంక ఇలా చూశాను”అని ఒక ఫోజిస్తుంది.

చూసేవాళ్ళకి ఆమె ఆ కామెంటుని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.సరే ఆమెకి ఆ కామెంటు నచ్చడంలో తప్పు లేదు.కొంత మంది ఆడవాళ్ళకి తమలో ఏది బాగా వుందో దానీ అందరూ చూడాలనీ మెచ్చుకోవాలనీ అనిపించవచ్చు.అది వాళ్ళ ఇష్టం.కానీ ఈ విషయాన్ని పబ్లిగ్గా చెబితే అది చూస్తున్న కుర్ర వాళ్ళు ఇలాంటి వయసులో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి కామెంట్లని ఎంజాయ్ చేస్తారేమో అనుకొని దారిన పోయే అందరు ఆడవాళ్ళను వాళ్ళ వంటిలో సొగసులనూ ఎత్తి చూపుతూ కామెంట్ చేయడం మొదలు పెడితే ఎలా?

అదే ప్రోగ్రాంలో మరొక ప్రశ్న మీకెవరు నచ్చుతారు అని.నాకు మహెష్ బాబు ఇష్టం కానీ అతను చల సాఫ్ట్, నా ఎత్తుకి నాకు ప్రభాస్ అయితే సరిగ్గా సరిపొతాడు అన్నది ఆంటీ జవాబు. వాళ్ళు అడిగింది మీకెవరు నచ్చుతారు అని ఆంటీ, ఎత్తు బరువు సరి చుసుకొని జత గట్టమని కాదు. ఫ్లర్టింగ్ అంటే మీకిష్టం వుండవచ్చు కానీ అది ప్రైవేటుగా చేసుకోవాలి ఇలా బహిరంగంగా కాదు.

ఆంటీ కసక్కు మనిపించే షోకు నీలో ఉంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకో. లేదంటే ఓపెన్ టు ఆల్ అయిపోతావు. కొంచెం జాగ్రత్త.

Tuesday, March 30, 2010

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మా ని కులమేమిటమ్మా?

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ ఆలయంలో లడ్డూ తయారీ ఇకపై కేవలం బ్రాహ్మణులూ, వైశ్యులూ మాత్రమె చేయాలని దేవస్థానం వాళ్ళు ఒక హుకుం జారీ చేశారు.దీని వెనక లాజిక్ నాకు అర్ధం కాలేదు.అంటే ఆ కులాల వాళ్ళకి తప్ప మిగతావారికి లడ్డూ తయారీ చేతకాదని వాళ్ళ ఉద్ద్ధేశ్యమా లేకపోతే ఇతర కులాల వాళ్ళు చేయడం వలన లడ్డూలు అపవిత్రం అయిపోతాయా?

రాష్ట్రంలో రుచికీ,శుచికీ అత్యంత పేరు పొందిన మిఠాయి దుకాణం పుల్లా రెడ్డిది.ఇప్పుడు ఇందులో ఆయన లేక పోవచ్చు.కానీ ఒకప్పుడు ఆయన స్వయంగా స్వీట్లు తయారు చేసేవారనీ అవి అందరికీ నచ్చేవి అనీ అందరికి తెలిసిన విషయమే కదా?

నా చిన్నప్పుడు మ వూరిలో మా స్కూలు బయట బీబీ పప్పూ బెల్లం కలిపి వుండలు చేసి అమ్మేది.చాల రుచిగా వుండేవి.గుళ్ళో పంతులు చేసే పొంగలికి ఏమీ తీసిపోని స్థాయిలో వుండేవి ఆ వుండలు రుచిలో.అలాగే మాదిగ రంగమ్మ చేసే అరిశెలు కూడా మా వూళ్ళో చాలా ఫేమస్.పెద్ద రెడ్లు కూడా పండగ వస్తే ఆమెని వాళ్ళ ఇళ్ళకి పిలిపించుకొని అరిశెలు చేయించుకొనేవాళ్ళు.

మా వూరి గుడిలో పూజారి శాస్త్రి పెళ్ళాం కూడా ఎవరికీ తెలియకుండా ఆమె చేత అరిశెలు చేయించి కూతురికి సారెలో పంపించింది అని ఒక పుకారు ఉంది కూడా. ఇంకే ఇతర బాపనోళ్ళ ఇళ్ళలో కానీ శెట్టి గార్ల ఇళ్ళలో కానీ ఆమెతో పోటీ పడి అరిశెలు రుచిగా చేయగలిగిన వంట గాళ్ళు మా వూరిలో లేరు ఆడయిన మగయినా.

లడ్డూల సంగతి సరే స్నానాల గదులు, పాయిఖానాలు కూడా బాపనోళ్ళనీ, శెట్టి గార్లనె కడగమండి చూద్దాం.అప్పుడు దీన్ని అందరూ స్వాగతించవచ్చు.

ఒరేయ్ చెత్త వెధవల్లారా ఇప్పటికే హిందూ మతం కులాల పెర్లతో ఉప కులాల పేర్లతో ముక్కలు చెక్కలై పోయింది.వాటిని కలపాల్సిన వెధవలు మీరే ఇంకా చీల్చడం ఏమైన బావుందా?ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని ఈ నియమాన్ని ఎత్తి అవతల పారేయండి.లెకుంటే దుర్గమ్మ మిమ్మల్ని తన కాలి కింద వేసి తొక్కి పారెస్తుంది.

ఉరేయ్ దళిత సంఘాల వాళ్ళూ ఈ నిస్సహాయ దళితుడి బాధ మీకు కనిపించడం లేదా?

మనకి ఎన్నో సంఘాలున్నాయి.కవులకీ,కళాకారులకీ,కష్ట జీవులకీ,ఉద్యోగులకీ,నిరుద్యోగులకీ,విద్యార్ధులకి,మహిళలకీ,ఎట్సెట్రా ఎట్సెట్రా... కానీ కులాల పేరుతో ఉన్నన్ని సంఘాలు ఇంకే ప్రాతిపదికనా లేవు.దళిత సంఘాలు,బీసీ సంఘాలు, కమ్మ,రెడ్డి,కాపు,బలిజ, ఇలా ప్రతి కులం పేరిట సంఘాలున్నాయి.ఈ అన్నింటిలో చాలా పవర్ ఫుల్ దళిత సంఘాలు.వాళ్ళ వెనక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నందువలన వాళ్ళతో ఎవరైనా కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు.

ఈ దళిత సంఘాలన్నీ కూడా ఒక్కటి కాదు.మాల,మాదిగ,యానాది,యెరుకల ఇలా నానా రకాల సంఘాలు ఉన్నాయి.ఎవరైనా దళితుడుకి అన్యాయం జరిగితే ఈ సంఘాల వాళ్ళు దాన్ని ఎదుర్కొంటారని సాధారణంగా ఏవరైనా భావిస్తారు. ఇటీవల ఆంధ్ర జ్యోతిలో బాడుగ నేతలు అని ఈ సంఘాలపై వచ్చిన కధనానికి వ్యతిరేకంగా ఎంతో గొడవ చేసి నానా యాగీ చేయడం అందరికీ గుర్తే కదా!

అయితే ఇప్పుడు ఈ దళిత నేతలు,అణగారిన వర్గాల ఆశాజ్యోతులూ ఒక దిక్కూ మొక్కూ లేని అమాయక నిస్సహాయ దళిత యువకుడికి అంతు లేని అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకొన్న పాపాన పోలేదు.

ఆయేషా మీరా హత్య కేసులో జైలులో పడి జబ్బుతోనో, విష ప్రయోగం వల్లనో నానాటికీ చిక్కి శల్యమౌతున్న సత్యం బాబు ఒక దళితుడన్న విషయం వీళ్ళ కంటికి కనిపించడం లేదా? లేకుంటే ఇక్కడ దండుకోవడానికి ఏమీ గిట్టుబాటు కాదని వీళ్ళు ఇటువైపు తమ దృష్టి సారించడం లేదా?

వాటే క్యాచ్ డేవిడ్ హస్సీ!

ఈ రోజు ఢిల్లీ కొల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ లొ కొల్ కతా ఓడిపోయినా ఆ జట్టుకి చెందిన డేవిడ్ హస్సీ ఎప్పటికీ మరపు రాని ఒక అద్భుతమైన క్యాచ్ ని అందరికీ చూపించాడు.ఇంతకు ముందు చాల అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనలని చూశాను కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. జాంటీ రోడ్స్ నేలకి సమాంతరంగా బంతిని పట్టుకొని రన్ అవుట్ చేయడం చూశాను. అదె జట్టు ఆటగాళ్ళు అనేక సార్లు కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేయడం చూశాను గానీ ఈ హస్సీ యాక్ట్ మాత్రం అన్నింటికన్నా ముందున నిలుస్తుంది.

కోలింగ్ వుడ్ కొట్టిన బంతి బౌండరీ దాటి పడితే అక్కడ ఉన్న హస్సీ గాలిలోకి జంప్ చేసి గాలిలో ఉండగానే బంతి ఇవతలికి లాగి మళ్ళి ఎగిరి బంతిని పట్టుకొని బౌండరీ ఇవతల ల్యాండయ్యాడు.ఆ విన్యాసం చూస్తే గానీ అర్ధం చేసుకోవడం కష్టం.మొయ్త్తానికి నైట్ రైడర్స్ ఓడిపోయినా మంచి ఫీల్డింగ్ విన్యాసం చూసే అవకాశం దొరికింది.వెరీ వెల్ డన్ డేవిడ్ హస్సీ.

Monday, March 29, 2010

సబితా ఇంద్రా రెడ్డీ,ఆడపిల్లకి న్యాయం చేయలేని హోం మంత్రి ఉంటేనేం ఊడితేనేం

ఐ న్యూస్ లో ఆయేషా మీరా హత్య కేసుకు సంభందించిన అందర్నీ కూర్చోబెట్టి, వాళ్ళతో బాటు కొందరు నిపుణులని కలిపి ఒక ప్రోగ్రం వేశారు.దాన్ని చూసి రాస్తున్న పోస్టు ఇది.

లీడర్ సినిమాలో ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టిన డైలాగ్ ఒకటుంది.ముఖ్య మంత్రిగా ఉన్న రానా అంటాడు"ఆడపిల్లకి న్యాయం చేయలేని ముఖ్య మంత్రి ఉంటే ఏం, ఊడితే ఏం" అని.ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూశాక నాకు అనిపించింది సబితా ఇంద్రా రెడ్డిని అడగాలని”ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని మీ తొక్కలో హోం మంత్ర పదవి ఉంటేనేం ఊడితెనేం” అని.

ఏంత మంది ముద్దాయిలని మార్చారు ఈ కేసులో! లడ్డూ సింగ్ అని, వంట వాడు అని, ఆ పిల్ల మేన మామ అని, చివరికి ఇప్పుడు సత్యం బాబు అనే ఒక అమాయకుడిని ఇరికించారు. ఆయేషా అమ్మ మొదటినుండీ మొత్తుకొంటూనే ఉంది.అసలు నేరస్థుడు వీళ్ళెవరిలోనూ లేడు.అతడు కోనేరు రంగారావు మనవడు” అని.అదేమీ పట్టించుకోకుండా పోలీసులు వాళ్ళ పాటికి వాళ్ళు ఒకటో నేరస్థుడు, రెండో నేరస్థుడు అంటూ పాత్రధారులని మారుస్తూ పోతున్నారు.

ఆసలు సత్యం బాబుని చూసిన ఏ వెధవయినా అతడికి ఒక ఆరోగ్యమైన అమ్మాయిని మాన భంగం చేసి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి లాక్కు వెళ్ళి చంప గలిగేంత బలం ఉందని అనుకొంటారా?అసలు ఆ సమయంలో అతడు తమ ఊళ్ళోనే ఉన్నాడని వాళ్ళ ఊరిలో వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెప్పినా అది ఈ పోలీసుల చెవికి ఎక్కక పోవడానికి వెనక ఏ వీ ఐ పీ ఉన్నాడో అన్న అనుమానం మనకి కలగకమానుతుందా?

ఫాపం ఆ అభాగ్యుడు ఇప్పుడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నాడు.కొన్నాళ్ళకి అతడు పోలీసుల చేతిలోనె చచ్చిపోతాడని అతని అమ్మ. ఇదే కేసులొ ఇంతకు ముందు నేరస్థుడిగ చెప్పబడ్డ లడ్డూ సింగు చెప్తుంటె అది నిజం కాబోలనిపిస్తోంది.శుద్ధంగా నడుచుకొటూ జైలుకి పోయిన పిల్లవాడు ఇప్పుడు సరిగ్గా అడుగులు వేయలేక పోవడం చూసిన వారెవరికైనా ఇదే అనుమానం కలగకమానదు.


మహిళా రిజర్వేషన్ అని చంకలు గుద్దుకోవడం కాదు.సాటి మహిళలకు న్యాయం చేసినప్పుడే ఈ మహిళా ప్రజా ప్రతినిధులకూ, మహిళా మంత్రులకూ విలువ ఉంటుంది.లేక పోతే కూరలో కరివేపాకుకి ఎంత విలువ ఉంటుందో వీళ్ళ బ్రతుకులకి అంతే విలువ ఉంటుంది.

కాబట్టి ఓ చేవెళ్ళ చెల్లెమ్మా ఇకనైనా కళ్ళు తెరువు.సదరు నేరస్థుడి వెనక ఇప్పటిదాకా అండగా ఉన్న ముసలోడు ఇప్పుడు లేదు.యమ ధర్మరాజు అతడి పాపాల చిట్టా లెక్కేస్తూ ఉంటాడు ఈ సరికి.నువ్వు ఇప్పుడైనా ఆయేషాకి న్యాయం చేయ గలిగితే ఆ చిట్టాలో ఒక పాపం తగ్గి ముసలోడి ఆత్మ శంతిస్తుంది

నిలువెత్తు బంగారం స్వామి నిత్యానందం

ఈ మధ్య కాలంలో బాగా విమర్శలకు గురైన వ్యక్తి స్వామి నిత్యానంద.నేను కూడా అనేక సార్లు స్నేహితులతోనూ ఒక బ్లాగులోనూ అతణ్ణి తిట్టాను కూడా.కానీ ఇప్పుడు చర్చిలో వెలుగులొకి వస్తున్న సెక్స్ స్కాండల్ చూశాక అతగాడు చేసినదాన్లో అంత తప్పు లెదేమోననిపిస్తోంది.

ఆ వీడియో క్లిప్పింగ్ అందరూ చూసే ఉంటారు.నటి రంజిత అతని పైకి ఎగబాగుతున్న సీన్ గుర్తు చేసుకొండి. వెనకీ నుండే మాంచి కసక్కుమనిపించే ఆ స్ట్రక్చరుతో ఒక అమ్మాయి అలా పైకి పాకితే ఏ మగవాడికైనా తిక్క బుద్ధులు పుట్టకుండా ఉంటాయా నిజంగా పరిత్యాగి అయితే తప్ప. నిత్యానంద ఏదో పైకి స్వామినని చెప్పుకొంటాడు కానీ మామూలు మనిషే కదా?

స్వామినని మోసం చేయడం తప్పే కానీ చట్టపరంగా నేరం కాదని చాలామంది నిపుణులు టీవీ చానళ్ళలో అప్పుడే చెప్పి ఉన్నారు కదా.అస్సలు విషయమేమిటంటే నిత్యం ఏమి చేసినా ఆ ఆడవాళ్ళ సంపూర్ణ అనుమతితోనే చేశాడు.వాళ్ళు కూడా పెద్ద వారే. తాము ఏమి చేస్తున్నారో తెలిసి అందుకు ఒప్పుకొనే అతనితో శృంగారంలో పల్గొన్నవారే.

ఈ చర్చి స్కాండల్ అలా కా దు.ఇది సృష్టి వైపరీత్యం.అబం శుభం తెలియని బాలురతో మగ ప్రీష్ట్ లు సాగించిన దాఋణం.దీనిని వర్ణించటానికి ఈ పదం సరిపోదు.అందులోనూ వాళ్ళు చెవిటి పిల్లలు. వయసులో చిన్నవారు. ఆ ఫాదర్ వెధవలు కుతి తీర్చుకోవాలంటే నన్ లు కూడా ఉంటారు కదా? వాళ్ళు పెద్ద వారు.వాళ్ళని ఒప్పించి వాళ్ళకు ఇష్టమైతే ఇద్దరూ కలిసి ఏ యేట్లో దూకినా బాగానే ఉండేది.

ఇప్పుడు చెప్పండి. ఈ దొంగ వెధవలతో పోలిస్తే మన స్వామి నిత్యానంద బంగారమే కదా?పోనీ కనీసం కాకి బంగారమైనా అవుతాడు కదా?

Sunday, March 28, 2010

దళితుడైతే అన్నిటికీ అతీతుడౌతాడా?

మొన్న రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది.ఏసీబీ దాడిలో బుక్కయిన ఒక అధికారికి ఐ ఏ ఎస్ గా ఎల పదవీ ఉన్నతి కల్పించారని ఒక టీడీపీ సభ్యుడు ప్రశ్న లేవనెత్తాడు. దానికి ఏం చెప్పాలో పాలుపోని అధికార పార్టీ తరఫునుంచి చీఫ్ విప్ భట్టు విక్రమార్క హర్ష వర్ధన్ అనే ఆ అధికారి కులాన్ని గుర్తు చేసి ఒక దళిత అధికారి మీద ఆరోపణలు ఎలా చేస్తారని ఎదురు దాడికి దిగాడు.

ఆ అధికారి ఏ రెడ్డో,కమ్మో, నాయుడో, రాజో, శర్మో లెక శాస్త్రో అయితే తెలుగుదేశమోళ్ళు కూడా పిచ్చి కేకలేసి అసెంబ్లీని కంపు కంపు చేసి పెట్టి ఉండే వాళ్ళు గానీ దళిత అధికారి అనే లోపు రూటు మార్చారు. ఆసలు సదరు అధికారి మీద అవినీతి నిరోధక శాఖ వాళ్ళతొ దాడి చేయించింది కాంగ్రెస్ వాళ్ళేనని ఎదురు దాడికి దిగారు.

దళితుడైనంత మాత్రాన అవినీతికి పాల్పడవచ్చని వీళ్ళ ఉద్ధేశ్యమా?కులం మాటున కోట్లకు కోట్లు బొక్కినా చూడకుండా వదిలేయాల్నా?అస్సలు ఈ నాయకులకు అణగారిన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందొ వాళ్ళకు బాగా తెలుసు.దళిత వోటుబ్యాంకుని గుంపగుత్తుగా కొల్లగొట్టాలనేదే వీళ్ళ లక్ష్యమని అందరికీ తెలిసిన విషయమే.

నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఒక్కరికైనా రిజర్వు చేయని స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారా?రబ్బరు స్టాంపులా తప్ప స్వతత్ర్యంగా పని చేసే అవకాసం కల్పించారా?

ఎందుకీ అవకాశవాద ప్రేమ వీళ్ళకి?

Wednesday, March 24, 2010

ఉరేయ్ సుప్రీం కోర్టోళ్ళూ రాధా కృష్ణుల జోలికెందుకెళ్తార్రా?

సుప్రీం కోర్టులో సహ జీవనం గురించి, పెళ్ళికి ముందు సెక్స్ గురించీ ఒక విప్లవాత్మకమైన తీర్పు వెలివడింది.సరె వాళ్ళ ఖర్మాన వాళ్ళు పోతార్లే అనుకొంటే ఆ తీర్పులో నాకు కాలిన పాయింటు ఒకటి ఉంది. ఆది రాధా కృష్ణులు చేసింది సహ జీవనమే అన్న కంక్లూజన్.అస్సలు రాధా కృష్ణుల గురించి వీళ్ళకు ఏం తెలుసు? వీళ్ళు చూసొచ్చారా? లేదా ఏ చరిత్ర పుస్తకంలో నైనా ఉందా?పురాణాల్లో ఉన్న విషయాలని చరిత్ర కింద తీసుకొని తీర్పులో ప్రస్తావించడం భావ్యమా?

సరే దీన్నలా ఉంచుదాం.పెళ్ళికి ముందు శృంగారం గురించి ఉదాహరణగా వీళ్ళె జీసస్ క్రైస్త్ ని కోట్ చేసి ఉండొచ్చుగా? యేసు క్రీస్తు కూడా ఒక పెళ్ళి కాని మహిళకు పుట్టాడు కదా? అంతె ఆమె పెళ్ళికి ముందు ఎవరితోనో శృంగారం చేసింది అనే కద అర్ధం? క్రైస్తవుల మనొభావాలు దెబ్బ తింటాయని ఆ ఉదాహరణ ఇవ్వలేదేమో? లేక క్రైస్తవం జోలికెళ్తే గొడవలై పోతాయని భయమేమో? హిందూయిజాన్ని తిడితే ఏమీ కాదన్న ధైర్యమేమో?ఫైపెచ్చు హిందుయిజాన్ని తిడితె లౌకికవాది అన్న బిరుదు కూడా వస్తుంది కదా!

Tuesday, March 23, 2010

మాభూమి సినిమాకి ముప్పయ్యేళ్ళు

మా భూమి సినిమా విడుదలై నేటికి మూడు దశాబ్ధాలు అయ్యింది. ఈ తరం వారికి అస్సలు ఆ సినిమా గురించి తెలుసొ లేదో గానీ ఆ సినిమాని చూసిన వాళ్ళెవరూ దాన్ని మర్చిపోలేరు. అంతగా ఆకట్టుకోవడానికి ఏముంది అందులో.మా భూమి చూడని,చూడలేకపోయిన వారికోసం ఈ పోస్టు.ఇందులో నేని చిత్రాన్ని సమీక్షించ బోవడం లేదు. ఈది మాభూమి సినిమాకి ఒక పొగడ్త మాత్రమే.

కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలం లేదు, మెరిసి పోయే అందమైన భామలు లేరు, బెత్తెడు బట్టలతో ఎక్స్ పోజ్ చేసే అమ్మాయిలు లేరు, ఐటం పాటలు లేవు, చెవులు హోరెత్తిపోయేల రణ గొణ సంగీతం లేదు. మరేముంది?

గుండెల్ని పిండే ఇతివృత్తం ఉంది. జీవితాంతం వెంటాడే పాటలున్నాయి, వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే పాత్రలున్నాయి. ఫల్లె ప్రజల దయనీయ గాధలున్నాయి. ఇప్పుడు కొంతమంది వెధవలచేత పొగడ బడుతున్న నిజాం గాడు చేసిన దురాగతలు, వాటి మీద సగటు జీవి చేసిన మహోన్నత పోరాటం ఉంది. స్పందిచే హృదయాన్ని కదిలించే విషయాలు ఎన్నో ఉన్నాయి.

ఈ సినిమాని చూడాలనుకొంటే ఎక్కడా డీవీడీ మీకు దొరక్కపోవచ్చు. యూ ట్యూబ్ లొ పదేసి నిమిషాల నిడివితో సినిమా మొత్తాన్ని ఒక అభిమాని పోస్టు చేసి ఉన్నాడు. చూడండి. సినిమా అంతా చూసే ఓపిక లేకపోతే అదే యూ ట్యూబ్ లో బండెనక బండి కట్టీ… అనే ఒక ఆవేశ పూరిత పాట వుంది.వినండి. పాల బుగ్గల జీతగాడా.. అనె మరొక కరుణా రస భరితమైన గేయం కూడా ఉంది. ఈది మిమ్మల్ని ఎన్నో రోజుల దాకా వెంటాడుతుంది. దీన్ని కూడా వినండి.

ఈనాడు మన సినిమా జీవులు ఎప్పుడు చూసినా తాము తీసిన సినిమాలలో అతి తక్కువ శాతం మాత్రమే హిట్టవుతున్నాయి, అధిక భాగం ఫట్టవుతున్నాయి అని ఏడిచి చస్తుంటారు. ఆ వెధవలని ఈ సినిమా చూడమని నా విన్నపం. ంఅంచి కథనెన్నుకొని దాన్ని హృద్యంగా తీస్తే మనం చూడక చస్తామా.

ఈ సందర్భంలో ఏదైన చానల్ ఈ సినిమాని ప్రసారం చేస్తే బావుణ్ణు.

Monday, March 22, 2010

విజయం కౌగిలిలోంచి బయట పడి పరాజయాన్ని అందిపుచ్చుకున్న సూపర్ కింగ్స్

ఏదైనా మ్యాచ్ లో ఒక జట్టు ఆటగాళ్ళు అద్భుతంగా ఆడాల్సిన అవసరం వచ్చింది అంటే జట్టు పరాజయం ముంగిట్లో ఉంది అని అర్ధం.అప్పుడు ఆ జట్టు ఆటగాళ్ళు ఎక్స్ ట్రార్డినరిగ ఆడి జట్టుని అందులోంచి తప్పించాల్సిన అవసరం వస్తుంది.కానీ నిన్న ఇందుకు విరుద్ధంగా చెన్నై లో సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక తమాషా చోటు చేసుకొంది.తమ జట్టు విజయం ముంగిట్లో ఉన్న తరుణంలో చెన్నై ఆటగాళ్ళు అరివీర భయంకరమైన ఆట తీరుతో అపజయాన్ని స్వంతం చేసుకొన్నారు.

చెన్నై ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు పూర్తయ్యాక పరిస్థితి చూడండి.చిన్న లక్ష్యం,మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం,భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్,బంతికి ఒకటి కన్నా తక్కువ పరుగులు కావల్సి ఉంది....ఇలాంటి స్థితిలో ఏ జట్టైనా సింగిల్స్ తీస్తూ లూజ్ బాల్స్ వచ్చినప్పుడు బౌండరీలు సాధిస్తూ ఎలాంటి రిస్కూ లేకుండా లక్ష్యం వైపు తాపీగా నడుచుకొంటూ వెళ్తార్.కానీ చెన్నై వీరులు నడుచుకొంటూ వెళ్తే మజా ఏముంది అనుకొన్నారో ఏమో లక్ష్యం వైపు ఉసైన్ బోల్ట్ లాగా మెరుపు వేగతో పరుగెత్తాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు.

ఇంత చేసినా ఇన్నింగ్స్ చివరి రెండు బంతులు మిగిలి ఉండగా పరిస్థితి చూడండి.మ్యాచ్ తై లో ఉంది, ఇరు జట్ల స్కోరులు సమం,రెండు బంతులున్నాయి, చెన్నై నుండి ఎనిమిదో ఆటగాడు బంతిని ఎదుర్కొంటూ ఉంటే అవతలి వైపు మంచి హిట్టర్ గా పేరు గాంచిన మోర్కెల్ ఉన్నాడు.కొంచెం కామన్సెన్సు ఉన్న వాడెవరైనా ఆ బంతికి ఏదో ఒక విధంగా బ్యాటుని తాకించి అవతలి వైపుకి వెళ్ళాలనుకొంటాడు ఆ ప్రయత్నంలో పరుగు సాధిస్తే విజయం, అవుటైన పోయేదేమీ లేదు. తరువాతి బంతికి మోర్కెల్ లాంటి వాడు ఏదో ఒక విధంగా పరుగు సాధించగలడు.

స్కూలు క్రికెట్ స్థాయిలో ఇలాంటి సిచుయేషన్ వచ్చినప్పుడు పిల్లలు కూడా పాటించే స్ట్రేటజీ ఇది. అలాంటిది ఒక ఐ పీ ఎల్ మ్యాచ్ లో ఆడే ఆటగాడికి తెలియక పోవడం వింతగా అనిపించడం లేదా?

ఏదైతేనేం, మొత్తానికి చాలా రోజుల తరువాత ప్రీతీ జింటా మొహంలో నవ్వు కనిపించింది. పంజాబు కింగులూ మీ ఆట తీరు మార్చుకోక పోతే ఇదే ఆఖరు నవ్వు అవుతుంది ఈ ఐ పీ ఎల్ సీజన్ లో.

Thursday, March 18, 2010

పైరసీని ప్రోత్సహిద్దాం.

నిన్నా మొన్నా తెలుగు సినిమా వాళ్ళందరూ పైరసీకి వ్యతిరేకంగా వూదరొగొట్టేస్తున్నారు.ఏ చానల్లో చూసినా ఇదే వరస.నా మట్టుకు నాకైతే పైరసీ మీద ఎలాంటి కంప్లైంటూ లేదు. పైపెచ్చు పైరసీ అనేది మధ్య తరగతి వాళ్ళకు చాలా మేలు చేసే ఒక అవసరంలాగా తోచింది.

ఉదాహరణకు ఒక టౌన్లో, మెట్రో సిటీ కాదు, ఒక సాదా సీదా కుటుంబాన్ని తీసుకోండి.మొగుడు,పెళ్ళాం,ఇద్దరు పిల్లలు కలిసి సినిమాకి వెళ్ళి రావడానికి ఇంటర్వెల్లో కూల్ డ్రింకులతో కలిపి ఎంత లేదన్నా అయిదొందలు అవుతుంది. ఇంత పెట్టి సినిమాకి వెళ్తే అదొట్టి చెత్త అయితే ఎక్కడో కాల్తుంది కదా?అదే ఒక ముప్పయ్యో, ఇరవయ్యో పెట్టి పైరేటెడ్ సీడీ కొని చూస్తే ఆ సినిమా బాగా లేకపోయినా పెద్దగా భాదేమి ఉండదు కదా?


అయినా సినిమా బావుంటే ప్రేక్షకుడు హాలుకి వచ్చి సినిమా చూస్తాడని అరుంధతి,మగధీర నిరూపించాయి కదా?ఆ సినిమాలు గ్రాఫిక్స్ వల్లనే హిట్టయ్యాయి అనుకొన్నా అష్టా చెమ్మా,హ్యాపీ డేస్ లాంటి చిన్న సినిమాలూ,గ్రాఫిక్స్ మాయా జాలం లేని చిత్రాలు కూడా జనాన్ని హాలుకే రప్పించాయి కదా?

పైరసీ మీద పడి వూరికే ఏడ్చే కన్నా సినిమా వాళ్ళు తమ ఖర్చు కొంచెం తగ్గించుకో వచ్చు కదా?సూపర్ స్టార్ల రెమ్యూనరేషన్ ని తగ్గించవచ్చు. బొంబాయి పిల్లల కోసం పోయే బదులు అంత కన్నా అందగత్తెలు అయిన మన లోకల్ ఆడ పిల్లలకి అవకాశం ఇయ్యొచ్చు కదా? తెలుగెలా పలకాలో కూడా తెలియని ఏ ఉదిత్ నారాయణ్ నో తెచ్చి పాటల్ని ఖూనీ చేసే కన్నా లోకల్ టాలెంట్ కి చాన్సు ఇస్తే తక్కువ బడ్జెట్ లొ ఇరగ దీస్తారు కద?

ధియేటర్లు కూడా మొదటి వారమని చెప్పి టికెట్ రేటు పెంచి జన్నాన్ని భయపెట్టి తీరా ఆ వారం గడిచే లోగా సినిమాలో పస లేదని అందరికీ తెలిసి వెల వెల పోయే కన్నా కొంచెం రేటు తగ్గించి ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించుకోవడం తెలివైన పని కాదా?

Wednesday, March 17, 2010

పంచాంగం చదివే పంతుళ్ళూ ఏది నిజం చెప్పండి.

ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఆఫీసులలో ముగ్గురు పంతుళ్ళు పంచాంగ పఠనం చేశారు.అయితే ఎక్కడ పంతులు అక్కడి పార్టీని ఆకాశానికెత్తేసి ఆ పార్టీకి, దాని నాయకుడుకీ బంగారు భవిష్యత్తు ఉందని చెప్పాడు.చివరికి చిరంజీవిని కూడా రాబోయే కాలానికి కాబోయే మహా నాయకుడు అని ఒక పంతులు పొగిడేశాడు. అయితే చిరంజీవి లోలోపల నవ్వుకొని ఉంటాడనుకోండి.
దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసిందేమిటంటే ఎవరు డబ్బులు ఇస్తే వారికి మహా భవిష్యత్తు ఉన్నట్టు వీరి చేతిలోని పంచాంగం వీరికి చెబుతుందన్నమాట.

Sunday, March 14, 2010

ఈ చెత్త ---------లు దేవుని బిడ్డలు,దేవుని దూతలూనా?

------లో మీకు తెలిసిన అత్యంత దారుణమైన బూతు మాట ని జోడించి చదువుకో వలసిందిగా మనవి.
ఈ మధ్య క్రైస్తవ మత బోధకులు చిన్న పిల్లల పైన జరిపిన లైంగిక అత్యాచారాలు చర్చిని పట్టి కుదిపేతున్నాయి.సాక్షాత్తూ ప్రస్తుత పోపు గారి సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందనేది ఇందులో హైలైట్. ఈ విషయాలు బయట పడ్డాక కూడా చర్చిలోని కొందరు పెద్దలు సదరు భోధకులని శిక్షించకుండా వాటిని కప్పి పెట్టాలని ప్రయత్నించడం ఇంకా బాధాకరమైన విషయం.ఈ పెద్దల జాబితాలో ఇప్పటి పోపు బెనెడిక్టు కూడా వున్నాడట.అయితే ఇవి ఈనాటి పాపాలు కాదు.1950 దశాబ్ధం నాటివి.ఆ వెధవల పాపం పండి బయట పడడానికి ఇంత కాలం పట్టింది.

తెల్లటి గౌనులేసుకొని,చేతిలో శిలువ ఆకారంలో ఒక పెద్ద దండం పట్టుకొని చూడడానికి చాలా పవిత్రంగా కనిపించే ఈ నీచులు చేసిన అకృత్యాలు వినడానికే వెగటు పుట్టిస్తాయి.
కేథలిక్ స్కూళ్ళలో చదువుకొనే పిల్లలని,ఇతర సంస్థలలొ వుండే పిల్లలనీ,చర్చి కార్యక్రమాలో సంగీతం వాయించే బృందాలలో పిల్లలనీ ఈ వెధవలు లైంగికంగా అత్యాచారాలు జరిపి వేధించే వారట.అ పిల్లలని నగ్నంగా మార్చి తాకడం,వారితో అంగ చూషణ యానల్ సెక్స్ లాంటి వినడానికే వెగటు పుట్టించే దారుణమైన పనులు చేసేవారని చాలా మంది బాధిత పిల్లలు ఫిర్యాదు చేసిన విషయం ఇప్పుడిప్పుడే బయట పడి సంచలనం సృష్టిస్తోంది.

కంపు మరీ ఎక్కువవడంతో ఇక దాచిపెట్టలేక చర్చిలో పెద్దలు దొంగలు పడ్డ అరవై యేళ్ళకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు విచారణకి ఆదేశించారు.ఇలాంటి నీచులని దేవుడి బిడ్డలుగా, దైవ ప్రభోదకులుగా ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడు చెప్పండి ----- స్థానంలో యేం రాయాలో?

Sunday, March 7, 2010

తెలంగాణా కావాలా వద్దా అని ఎవరు తేల్చాలి?

అస్సలు ఈ తెలంగాణా కావాలి అనె వాళ్ళకు గానీ, వద్దు సమైక్యంగ వుందాం అనే వాళ్ళకు గానీ ఆ వాదం వెనక మోటివ్ రాజకీయమే అన్న విషయం చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు. తెలంగాణా వస్తే నాలుగు కేబినెట్ పదవులో, సీ ఎమ్మో లేకుంటే డిప్యూటీయో వస్తుందన్న ఆశతో తెలంగాణా వాదులూ, హైదరాబాద్ విడిపోతే అందులో ఉన్న తమ వందల వేల కోట్ల ఆస్తుల విలువ పడి పోతుందన్న ఏకైక మోటివ్ తో సమైక్య వాదులూ పోరాటం చెస్తున్నారన్న విసహయం సుస్పష్టం.
అయితె తెలంగాణా వచ్చినా రాకున్నా దానివల్ల ప్రభావితమయ్యె మూడో నాలుగో కోట్ల సాధారణ ప్రజానీకం అభిప్రాయం సరిగ్గా వెలుగు చూడటం లేదు. అందుకే ఈ క్రిష్ణా రామా కమిటీల స్థానంలో ప్రజల అభిప్రాయం తెలుసుకొనెందుకు ఒక రెఫరెండం పెట్టి చూస్తే మంచిది కాదా? ఎక్కువ మంది మాకు తెలంగాణా కావాలి అంటే ఈ లగడపాటి జగడపాటిలను తుంగలో తొక్కి తెలంగాణా ఇచ్చెయ్యాల్సిందే.వాళ్ళు వద్దు అంటే ప్రత్యేక ఉద్యమాన్ని కట్ట కట్టి చరిత్ర చెత్త బుట్టలో పారేయవచ్చు.
ప్రజలు అఫెక్టయ్యె విషయానికి సంభందించిన అంతిమ నిర్ణయం ప్రజలకే వదిలి పెట్టడం తెలివైన పని కాదా?

Thursday, March 4, 2010

ఒరేయ్ మూర్ఖుల్లారా అసలైన దేవుడిని తెలుసుకోండి

దేశంలో బాబాలకు, స్వాములకూ బ్యాడ్ టైం నడుస్తోంది. మొన్నటికి మొన్న కల్కి భగవాన్, నిన్న అమ్మాయిలతో కామ కేళీ కలాపాలలో నిత్యానందం ....ఇక నోట్లోంచి లింగాలు బయటికి తీయగలిగి కూడా చెక్ బౌన్స్ కాకుండా ఆపలేని సాయి బాబా జూనియర్, కబ్జా కోరు కాళేశ్వర్ ఉండనే ఉన్నారాయే. కొంతమంది ఇదంతా కేవలం విష ప్రచారమనీ, హిందువుల మనో భావాలు దెబ్బ తీసే కుట్ర అనీ వాదిస్తున్నారు.కానీ నా ఉద్దెశ్యంలో ఈ దొంగ వెధవ బాబాల వల్లనె హిందు మతం భ్రష్టు పట్టి పోతోంది.అయిన వీళ్ళని అని ఏం లాభం.కషాయం చూడగానే ఎగేసుకొని పోయే భక్తులని అనాలి ముందు. అసలు7 మనకేం తక్కువ?ముగ్గురు త్రిమూర్తులని పిలవబడే ఫస్ట్ క్లాస్ దేవుళ్ళూ,చిన్నాచితక దేవుళ్ళు ఓ మూడూ కోట్లూ, ఫెమినిస్టులు ఫీలవకుండా ఎందరో దేవతా మూర్తులూ, వీళ్ళలో కొందరు శాంతి మూర్తులు లక్ష్మి, సరస్వతి లాగా మరికొందరు రౌద్ర మూర్తులు కాళి ఎట్సెట్రా ఉండగా ఈ అందరినీ వదిలి పెట్టి ఈ వెధవలని దేవుళ్ళు అని పూజించాల్సిన ఖర్మ మనకేంటి?
అందుకె శంకరాచార్యులు గారు ఎప్పుడో అద్వైతాన్ని భోదించారు.ఒరేయ్ వెధవాయిలూ దైవత్వం ఎక్కడో లేదురా, అది నీలో ఉంది, నాలో ఉంది అన్ని చోట్లా ఉంది అని.మమూలూ భాషలో చెబితే వీళ్ళు వినరని సంస్క్రుతంలొ రెండు మాటలు చెప్పారు: సర్వం ఖల్విదం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి అని. అంటే అనీ చోట్లా బ్రహ్మం నిండి ఉంది, నేనే బ్రహ్మాన్ని అని. కాబట్టి విశ్వ వ్యాపితమైఉన్న దైవత్వాన్ని అరాధించండి, పూజించండి. దొంగ బాబాలని చీత్కరించండి.

Wednesday, March 3, 2010

నర్సుకెక్కువ డాక్టరుకి తక్కువ

మన దేశంలో డాక్టర్-పేషంటు నిష్పత్తిని క్రమ బద్ధీకరించడానికి ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతొ ముందుకొచ్చింది.అది గ్రామీణ డాక్టర్ అన్న కాన్సెప్టు.ఇందులో ఒక కొత్త డిగ్రీని స్రుస్టించి అందులొ శిక్షణ పొందిన వాళ్ళకు బీ ఆర్ ఎం ఎస్ అని తోక తగిలిస్తారు.మెడిసిన్లో చెప్పే అన్ని సబ్జెక్టులూ చెప్తారు కానీ ఆపరేషన్లకు సంబంధించిన విషయాలు దీనిలో ఉండవు.ఈ కోర్సు మామూలు మెడిసిన్ లాగా కాకుండా మూడున్నర యేళ్ళలో పూర్తి అవుతుంది. వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో మాత్రమె ప్రాక్టీసు చేయలని ముందుగానే ఒక నిబంధన విదిస్తారు.
ఇప్పుడు ఇచ్చె శిక్షణతొ నాలుగున్నరేళ్ళు చదువు,ఒక సంవత్సరం హౌస్ సర్జెన్సి చెసి బయటకు వచ్చిన డాక్టర్లె కాంఫిడెంట్ గా వైద్యం చేయలెని పరిస్థితి వుంది.మరి ఒక సంవత్సరం తక్కువ చదివి హౌస్ సర్జెన్సీ లెకుండా బయటకు వచ్చిన వీళ్ళ్ళు చేసే వైద్యం ఎలా వుండబోతుందో ఈ ఆలోచన చేసిన మహానుభావులు ఆలోచించారా? ఆ..ఏమైతే ఎంలే పల్లెటూరి జనమే కదా అని తేలిగ్గా తీసుకున్నారా? వీళ్ళ ఉద్దేశ్యం గ్రామీణ ప్రజలకు ఒక రకం వైద్యం, నగర వాసులకు మరొక రకం వైద్యం అందించడమా?
ప్రభువులు ఇలా బుర్ర బద్ధలు కొట్టుకొని కొత్త కొత్త పధకాలు ఆలోచించకుండా ఇప్పుడున్న అన్ని పి హెచ్ సీలలొ ఖాళీలు భర్తీ చేసి, వారి చేత సిబ్బందిచేత సరిగ్గా పని చెయించగలిగితే ఈ సమస్య పూర్తిగ కాకపోయిన కొంత మేరకైన తీరిపోదా? ఈ హాస్పిటల్స్ లో పనిచేసే ఒక్క డాక్టరు సమయానికి రాడు.కొందరైతె వారానికొ, నెలకో ఒకసారి వచ్చి తను బ్రతికే వున్ననని, హస్పిటల్ భవనం కూలిపోకుండా ఉందనీ నిర్ధారించుకొని పోతూ ఉంటారు. ఇక్కడకి వచ్చె రోగులకు నర్సులొ వాళ్ళకీ తీరిక లేకపోతె ఫోర్త్ క్లాస్ సిబ్బందొ వైద్యం అందిస్తూ ఉంటే సదరు డాక్టరు గారు అదే వూరిలోనో లేక సమీపంలో మరో వూరిలోనో తన ప్రైవేటు ప్రాక్టిసులో యమ బిజీగా రెండు చేతుల్తో ఆర్జిస్తూ ఉంటాడు. మీకు చేతనైతే ముందు ఉన్న వాటిని సరి చేయండి. అప్పుడు అవసరమనిపిస్తె కొత్త పధకాల జోలికి పోవచ్చు.
అంతే కానీ ఇలా సగం చదువు చెప్పి నర్సు కెక్కువ డాక్టరుకి తక్కువ అయిన శంకర్ దాదాలతో వైద్యం చేయించి ప్రాణాలతో ఆడుకోవద్దు.

Tuesday, March 2, 2010

వైఎస్సార్ Vs చంద్ర బాబు

చంద్ర బాబు నాయుడు వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి ఇద్దరు ఒకే కాలంలొ కాంగ్రెస్ పార్టీలో ప్రవెశించి అక్కడ మంత్రులై తరువాత బాబు మామగారి పార్టీలో దూరి సీ ఎం పదవిని అధిష్టించి రాష్ట్రానికి సి ఈ ఓ గా తనని తను అభివర్ణించుకొని దరిమిలా వై ఎస్ దెబ్బకి వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో దెబ్బ తిన్నాడు.ఈ ఇద్దరి మధ్య సారూప్యాలూ,వైవిధ్యాలూ అన్వేషించే ప్రయత్నం ఈ వరస టపాలలో.
మొదటిగ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వై ఎస్ సంక్షెమ పధకలు అయన్ని గెలిపించాయని.ప్రత్యర్ధులు ఆయన అవినీతిని ఎత్తి చూపుతారు.కాంగ్రెస్ వాళ్ళు బాబు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారబట్టే ప్రజలు ఆయనని తిప్పిగొట్టారని అంటారు.
నా విశ్లేషణ ఏమంటే : చంద్ర బాబు రూపాయి తింటే అందులో వంద పైసలూ తనకో లేక తన పార్టీ వాళ్ళకో దక్కేలా చూశాడు.వై ఎస్ రూపాయి తినే చోట పది రూపాయలు తినేలా చేసి అందులొ ఒక పావలో అర్ధో ప్రజలకు పడేసే వాడు.అంతే అందరు గప్ చుప్.నిజంగా తెలివంటే ఇదీ.
ఒక పక్క రాష్ట్రంలోని వనరులన్నింటిని తనొ, తనకు కావలసిన వాళ్ళో దొచుకొనే ఏర్పాట్లు చేసిన ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ వై ఎస్ కె పట్టం కట్టారంటే ఇడె అందులో రహస్యం.ఐరన్ ఓర్ మొత్తాన్నీ గాలి స్వాములు లారీల్లో అటు పిమ్మట ఓడల్లో అక్కించి తరలిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు కదా!ఎడొ ప్రతి పక్షాలు గోల చేయడం మినహా కోర్టులూ స్వపక్షంలోని ప్రతిపక్షం ఏమీ మట్లాడకుండా మిన్నకుండిపోయారు కదా.
రాజకీయ నాయకులు తెలుసుకోవలసిన నీతి ఏమంటే నువ్వు ఎంత తిన్నావన్నది ముఖ్యం కాదు.అందులో అంతో ఇంతో ప్రజల మొహాన్న వేశావా లేదా అన్నదే ప్రధానం.

ఒరేయ్ వెధవా,రామక్రిష్ణ పరమహంసతో కల్కిని పోలుస్తావా?కళ్ళు పోతాయ్!

ఈ మధ్య మహా టీవీ వాళ్ళు కల్కి భగవాన్ ని ఫుట్ బాలాడేస్తున్నారు.రోజుకో ఎపిసోడ్ చొప్పున స్పెషల్ టాక్ షోలు పెట్టి సదరు భగవాన్ చేతిలో మోసపోయిన వాళ్ళని, అతన్ని నమ్మని హేతు వాదులనీ పోగేసి వరదాయ పాళెం లోని అశ్రమం లో జరుగుతున్న జుగుప్సాకరమైన కార్యక్రమాల వుజువల్స్ ని చూపించి ఎడా పెడా కుమ్మేస్తున్నారు.భక్తులుగా పిలుచుకొనె దాసాజీలు డ్రగ్స్ మత్తులో, నగ్నంగా తయారయ్యి పిచ్చి వెదవల్లాగ తయరయ్యి ఎగురుతు వుంటే దానిని సమర్ధించుకొనే ప్రయత్నంలొ లోకేష్ అనబడే ఆశ్రమ మేనేజర్ రామ క్రిష్ణ పరమహంస కానీ మీరాభాయి కానీ అప్పట్లో నగ్నంగానే ఉండే వాళ్ళు అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.ఆ పెద్ద మనిషి ఉద్ధెశ్యం తన బాస్ కూడా ఆ స్థాయికి చెందిన వాడు అని చెప్పటం కావచ్చు.
రామక్రిష్ణ పరమహంస సాదా సీదాగా పైన ఒక ఉత్తరీయం మాత్రమే వేసుకొని ఉన్నట్లు ఆయన బొమ్మ ఆయన్ని ప్రత్యంక్షంగా చూడని నాలాంటి వాళ్ళకున్న అభిప్రాయం.మీరాభాయిని కూడా బొమ్మల్లోనో సినిమలలోనొ మత్రమే చూసిన మాకున్న నమ్మకం. అయిన గుడ్డల సొంగతి తీసి పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడైనా శిష్యులతో కలవడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడైనా ఉందా?రామక్రిష్ణ గారి ప్రియ శిష్యుడు వివేకానందుడు ఆయన డబ్బు మనిషైతె ఆయనతో కలిసి వుండే వాడా? అసలాయన పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు నిర్మించి బోధ చేశాడా?
అలాంటి మహానుభావులతో కల్కి లాంటి ఫోర్ ట్వంటీ గాళ్ళను పొల్చడమే తప్పు. ఒరేయ్ లోకేష్ కళ్ళు పోతాయిరా రాస్కెల్.