నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 24, 2010

ఉరేయ్ సుప్రీం కోర్టోళ్ళూ రాధా కృష్ణుల జోలికెందుకెళ్తార్రా?

సుప్రీం కోర్టులో సహ జీవనం గురించి, పెళ్ళికి ముందు సెక్స్ గురించీ ఒక విప్లవాత్మకమైన తీర్పు వెలివడింది.సరె వాళ్ళ ఖర్మాన వాళ్ళు పోతార్లే అనుకొంటే ఆ తీర్పులో నాకు కాలిన పాయింటు ఒకటి ఉంది. ఆది రాధా కృష్ణులు చేసింది సహ జీవనమే అన్న కంక్లూజన్.అస్సలు రాధా కృష్ణుల గురించి వీళ్ళకు ఏం తెలుసు? వీళ్ళు చూసొచ్చారా? లేదా ఏ చరిత్ర పుస్తకంలో నైనా ఉందా?పురాణాల్లో ఉన్న విషయాలని చరిత్ర కింద తీసుకొని తీర్పులో ప్రస్తావించడం భావ్యమా?

సరే దీన్నలా ఉంచుదాం.పెళ్ళికి ముందు శృంగారం గురించి ఉదాహరణగా వీళ్ళె జీసస్ క్రైస్త్ ని కోట్ చేసి ఉండొచ్చుగా? యేసు క్రీస్తు కూడా ఒక పెళ్ళి కాని మహిళకు పుట్టాడు కదా? అంతె ఆమె పెళ్ళికి ముందు ఎవరితోనో శృంగారం చేసింది అనే కద అర్ధం? క్రైస్తవుల మనొభావాలు దెబ్బ తింటాయని ఆ ఉదాహరణ ఇవ్వలేదేమో? లేక క్రైస్తవం జోలికెళ్తే గొడవలై పోతాయని భయమేమో? హిందూయిజాన్ని తిడితే ఏమీ కాదన్న ధైర్యమేమో?ఫైపెచ్చు హిందుయిజాన్ని తిడితె లౌకికవాది అన్న బిరుదు కూడా వస్తుంది కదా!

6 comments:

mady's said...

Really very wrong comments by supreme court.
this is not acceptable.

http://telugu.greatandhra.com/sangathulu/20-03-2010/teer_24.php

sudha said...

అత్యున్నత న్యాయస్థానం లో కూర్చుని ఇతిహాసాలను ( అంతరార్ధం తెలియకుండానే ) అపహాస్యం చేసే వ్యాక్యలు చేస్తూ తీర్పులు చెప్పే వీళ్ళు న్యాయాధిపతులు. వీరికి ఉన్నతమైన స్థానాలు ఇచ్చి గౌరవించటం ఎంత హాస్యాస్పదం.

సుధ

durgeswara said...

ధర్మాన్ని ఎంతకించపరచినా చలించనంతా స్పర్షజ్ఞానం కోల్పోయినది హిందూధార్మిక జాతి అని అందరికీ ప్రగాఢ నమ్మకం . ఇది వాల్ల అనుమానం కాదు వాస్తవంగా చూస్తున్నదే కదా !

srivasuki said...

హిందువులు ఎంత అరిచి మొత్తుకున్నా వినే నాథుడు లేడు ఎందుకంటే తిరిగి వినాల్సింది హిందువులే కదా. అందుకే ఈ వంకరి ఉదాహరణ చెప్పారు 'న్యాయమూర్తులు.

కత్తి మహేష్ కుమార్ said...

ఏంటో తలతిక్క లాజిక్కు...

ఉత్తి ఉరేష్ కుమార్ said...

@చెప్పు దెబ్బలు: క్రీస్తుకథ కోట్ చేసారా లేదా అనేది అప్రస్తుతం. కోట్ లతో తీర్పులు పుట్టవు. పోస్టు మాడ్రనిజం - కుతి కలిస్తేనే తీర్పులు పుడతాయి. అది సహజం. క్రైస్తవుల జోలికెళితే గొడవలవుతాయన్నది అనేది అర్థరహితం.