ఐ న్యూస్ లో ఆయేషా మీరా హత్య కేసుకు సంభందించిన అందర్నీ కూర్చోబెట్టి, వాళ్ళతో బాటు కొందరు నిపుణులని కలిపి ఒక ప్రోగ్రం వేశారు.దాన్ని చూసి రాస్తున్న పోస్టు ఇది.
లీడర్ సినిమాలో ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టిన డైలాగ్ ఒకటుంది.ముఖ్య మంత్రిగా ఉన్న రానా అంటాడు"ఆడపిల్లకి న్యాయం చేయలేని ముఖ్య మంత్రి ఉంటే ఏం, ఊడితే ఏం" అని.ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూశాక నాకు అనిపించింది సబితా ఇంద్రా రెడ్డిని అడగాలని”ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని మీ తొక్కలో హోం మంత్ర పదవి ఉంటేనేం ఊడితెనేం” అని.
ఏంత మంది ముద్దాయిలని మార్చారు ఈ కేసులో! లడ్డూ సింగ్ అని, వంట వాడు అని, ఆ పిల్ల మేన మామ అని, చివరికి ఇప్పుడు సత్యం బాబు అనే ఒక అమాయకుడిని ఇరికించారు. ఆయేషా అమ్మ మొదటినుండీ మొత్తుకొంటూనే ఉంది.అసలు నేరస్థుడు వీళ్ళెవరిలోనూ లేడు.అతడు కోనేరు రంగారావు మనవడు” అని.అదేమీ పట్టించుకోకుండా పోలీసులు వాళ్ళ పాటికి వాళ్ళు ఒకటో నేరస్థుడు, రెండో నేరస్థుడు అంటూ పాత్రధారులని మారుస్తూ పోతున్నారు.
ఆసలు సత్యం బాబుని చూసిన ఏ వెధవయినా అతడికి ఒక ఆరోగ్యమైన అమ్మాయిని మాన భంగం చేసి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి లాక్కు వెళ్ళి చంప గలిగేంత బలం ఉందని అనుకొంటారా?అసలు ఆ సమయంలో అతడు తమ ఊళ్ళోనే ఉన్నాడని వాళ్ళ ఊరిలో వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెప్పినా అది ఈ పోలీసుల చెవికి ఎక్కక పోవడానికి వెనక ఏ వీ ఐ పీ ఉన్నాడో అన్న అనుమానం మనకి కలగకమానుతుందా?
ఫాపం ఆ అభాగ్యుడు ఇప్పుడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నాడు.కొన్నాళ్ళకి అతడు పోలీసుల చేతిలోనె చచ్చిపోతాడని అతని అమ్మ. ఇదే కేసులొ ఇంతకు ముందు నేరస్థుడిగ చెప్పబడ్డ లడ్డూ సింగు చెప్తుంటె అది నిజం కాబోలనిపిస్తోంది.శుద్ధంగా నడుచుకొటూ జైలుకి పోయిన పిల్లవాడు ఇప్పుడు సరిగ్గా అడుగులు వేయలేక పోవడం చూసిన వారెవరికైనా ఇదే అనుమానం కలగకమానదు.
మహిళా రిజర్వేషన్ అని చంకలు గుద్దుకోవడం కాదు.సాటి మహిళలకు న్యాయం చేసినప్పుడే ఈ మహిళా ప్రజా ప్రతినిధులకూ, మహిళా మంత్రులకూ విలువ ఉంటుంది.లేక పోతే కూరలో కరివేపాకుకి ఎంత విలువ ఉంటుందో వీళ్ళ బ్రతుకులకి అంతే విలువ ఉంటుంది.
కాబట్టి ఓ చేవెళ్ళ చెల్లెమ్మా ఇకనైనా కళ్ళు తెరువు.సదరు నేరస్థుడి వెనక ఇప్పటిదాకా అండగా ఉన్న ముసలోడు ఇప్పుడు లేదు.యమ ధర్మరాజు అతడి పాపాల చిట్టా లెక్కేస్తూ ఉంటాడు ఈ సరికి.నువ్వు ఇప్పుడైనా ఆయేషాకి న్యాయం చేయ గలిగితే ఆ చిట్టాలో ఒక పాపం తగ్గి ముసలోడి ఆత్మ శంతిస్తుంది
7 comments:
వాడి తాత పోయినా,వాడి నాన్న ఉన్నాడు కదా ఇంకా బతికే,అయినా తాత,నాన్న ఉన్న లేకపోయినా,ఈ చెల్లమ్మ గారికి నిజంగా దమ్ము ఉంటె, అప్పుడే చేసేది ఏమైనా. ఇప్పుడు తాత పోయినా పెద్ద ఏమీ పీకలేదు ఈవిడ.
చెప్పాటానికి చేయాటనికి చాలా తేడా ఉంది.అయినా మన జనాలు అంత మంచి వాళ్ళు ఏమి కాదు.అలాంటి వాళ్ళికి ఇలాంటి నాయకులు కాక మంచి నయకులు వస్తారా?
హోం మంత్రి ఒక డమ్మీ. పోలీస్ డిపార్ట్మెంట్ హోం మంత్రి పర్మిషన్ లేకుండా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఒక పోలీస్ ఆఫీసరే బాహాటంగా ప్రకటించడం జరిగింది.
దళిత హక్కులు అని గొతు చించుకుని అరిచే దళిత నాయకులు ఏమైనారు.సాటి దళితునికి అన్యాయం అవుతుంటే ఏమిచేస్తున్నారు.
ఈ చెల్లెమ్మ ఏమైనా పీకగలిగి ఉంటే అసలు ఈమెని హోం మంత్రిని కానిచ్చే వారు కాదు.ఏమీ పీకలేని డమ్మీ కాబట్టె ఈ పదవి దక్కింది.
సిందు గారూ మీరు చాలా సినికల్ గా ఆలోచిస్తున్నారు.ఈ జనంలో మనందరం ఉన్నాము.మనం మంచి వాళ్ళం కాదు కాబట్టి ఎవరైనా మంకి ఏ అన్యాయమైనా చేయవచ్చని మీ అభిప్రాయమా?
హోం మంత్రిని డమ్మీ నుంచి మరింత డమ్మీగా మార్చడానికి ప్రాణమిత్రుడికి భద్రతా వ్యవహారాల సలహా దారుడిగా పదవిని కట్టబెట్టి పోయారుగా మన దివంగత నేత.
దళిత సంఘాలు ఎక్కడ దండుడు అవకాశలుంటే అక్కడికే వస్తారు.ఇలాంటి అన్యాయాలతో వారికి సంబందం ఉండదు.
దళిత సంఘాలు పని చేసేది రిజర్వేషన్ల కోసం, డబ్బున్న దళితుల సంక్షేమం కోసం. అన్యాయంగా క్రిమినల్ కేసులలో ఇరుక్కునే పేద దళితులతో వాళ్ళకి పని లేదు.
భలే చెప్పారు శర్మ గారూ! ఇక్కడ బ్లాగులో మనం ఇవన్నీ మాట్లాడుకో గలుగుతున్నాం గానీ బయట ఇలా ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళమా!థాంక్యూ కూడలీ!
Post a Comment