నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 3, 2010

నర్సుకెక్కువ డాక్టరుకి తక్కువ

మన దేశంలో డాక్టర్-పేషంటు నిష్పత్తిని క్రమ బద్ధీకరించడానికి ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతొ ముందుకొచ్చింది.అది గ్రామీణ డాక్టర్ అన్న కాన్సెప్టు.ఇందులో ఒక కొత్త డిగ్రీని స్రుస్టించి అందులొ శిక్షణ పొందిన వాళ్ళకు బీ ఆర్ ఎం ఎస్ అని తోక తగిలిస్తారు.మెడిసిన్లో చెప్పే అన్ని సబ్జెక్టులూ చెప్తారు కానీ ఆపరేషన్లకు సంబంధించిన విషయాలు దీనిలో ఉండవు.ఈ కోర్సు మామూలు మెడిసిన్ లాగా కాకుండా మూడున్నర యేళ్ళలో పూర్తి అవుతుంది. వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో మాత్రమె ప్రాక్టీసు చేయలని ముందుగానే ఒక నిబంధన విదిస్తారు.
ఇప్పుడు ఇచ్చె శిక్షణతొ నాలుగున్నరేళ్ళు చదువు,ఒక సంవత్సరం హౌస్ సర్జెన్సి చెసి బయటకు వచ్చిన డాక్టర్లె కాంఫిడెంట్ గా వైద్యం చేయలెని పరిస్థితి వుంది.మరి ఒక సంవత్సరం తక్కువ చదివి హౌస్ సర్జెన్సీ లెకుండా బయటకు వచ్చిన వీళ్ళ్ళు చేసే వైద్యం ఎలా వుండబోతుందో ఈ ఆలోచన చేసిన మహానుభావులు ఆలోచించారా? ఆ..ఏమైతే ఎంలే పల్లెటూరి జనమే కదా అని తేలిగ్గా తీసుకున్నారా? వీళ్ళ ఉద్దేశ్యం గ్రామీణ ప్రజలకు ఒక రకం వైద్యం, నగర వాసులకు మరొక రకం వైద్యం అందించడమా?
ప్రభువులు ఇలా బుర్ర బద్ధలు కొట్టుకొని కొత్త కొత్త పధకాలు ఆలోచించకుండా ఇప్పుడున్న అన్ని పి హెచ్ సీలలొ ఖాళీలు భర్తీ చేసి, వారి చేత సిబ్బందిచేత సరిగ్గా పని చెయించగలిగితే ఈ సమస్య పూర్తిగ కాకపోయిన కొంత మేరకైన తీరిపోదా? ఈ హాస్పిటల్స్ లో పనిచేసే ఒక్క డాక్టరు సమయానికి రాడు.కొందరైతె వారానికొ, నెలకో ఒకసారి వచ్చి తను బ్రతికే వున్ననని, హస్పిటల్ భవనం కూలిపోకుండా ఉందనీ నిర్ధారించుకొని పోతూ ఉంటారు. ఇక్కడకి వచ్చె రోగులకు నర్సులొ వాళ్ళకీ తీరిక లేకపోతె ఫోర్త్ క్లాస్ సిబ్బందొ వైద్యం అందిస్తూ ఉంటే సదరు డాక్టరు గారు అదే వూరిలోనో లేక సమీపంలో మరో వూరిలోనో తన ప్రైవేటు ప్రాక్టిసులో యమ బిజీగా రెండు చేతుల్తో ఆర్జిస్తూ ఉంటాడు. మీకు చేతనైతే ముందు ఉన్న వాటిని సరి చేయండి. అప్పుడు అవసరమనిపిస్తె కొత్త పధకాల జోలికి పోవచ్చు.
అంతే కానీ ఇలా సగం చదువు చెప్పి నర్సు కెక్కువ డాక్టరుకి తక్కువ అయిన శంకర్ దాదాలతో వైద్యం చేయించి ప్రాణాలతో ఆడుకోవద్దు.

1 comment:

kvsv said...

ఇప్పుడున్న డాక్టర్లు జనాన్ని చావ******తున్నది చాలదని...ఈ సగం బుర్ర డాక్టర్లని తయారుచేస్తున్నది కాబోలు ...జనాబా నియంత్రణకి ...ఎవ్వరూ రెస్పోండ్ అవ్వలా ఈ విష్యం పై ...మంచి టపా ఇచ్చారు...