ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ ఆలయంలో లడ్డూ తయారీ ఇకపై కేవలం బ్రాహ్మణులూ, వైశ్యులూ మాత్రమె చేయాలని దేవస్థానం వాళ్ళు ఒక హుకుం జారీ చేశారు.దీని వెనక లాజిక్ నాకు అర్ధం కాలేదు.అంటే ఆ కులాల వాళ్ళకి తప్ప మిగతావారికి లడ్డూ తయారీ చేతకాదని వాళ్ళ ఉద్ద్ధేశ్యమా లేకపోతే ఇతర కులాల వాళ్ళు చేయడం వలన లడ్డూలు అపవిత్రం అయిపోతాయా?
రాష్ట్రంలో రుచికీ,శుచికీ అత్యంత పేరు పొందిన మిఠాయి దుకాణం పుల్లా రెడ్డిది.ఇప్పుడు ఇందులో ఆయన లేక పోవచ్చు.కానీ ఒకప్పుడు ఆయన స్వయంగా స్వీట్లు తయారు చేసేవారనీ అవి అందరికీ నచ్చేవి అనీ అందరికి తెలిసిన విషయమే కదా?
నా చిన్నప్పుడు మ వూరిలో మా స్కూలు బయట బీబీ పప్పూ బెల్లం కలిపి వుండలు చేసి అమ్మేది.చాల రుచిగా వుండేవి.గుళ్ళో పంతులు చేసే పొంగలికి ఏమీ తీసిపోని స్థాయిలో వుండేవి ఆ వుండలు రుచిలో.అలాగే మాదిగ రంగమ్మ చేసే అరిశెలు కూడా మా వూళ్ళో చాలా ఫేమస్.పెద్ద రెడ్లు కూడా పండగ వస్తే ఆమెని వాళ్ళ ఇళ్ళకి పిలిపించుకొని అరిశెలు చేయించుకొనేవాళ్ళు.
మా వూరి గుడిలో పూజారి శాస్త్రి పెళ్ళాం కూడా ఎవరికీ తెలియకుండా ఆమె చేత అరిశెలు చేయించి కూతురికి సారెలో పంపించింది అని ఒక పుకారు ఉంది కూడా. ఇంకే ఇతర బాపనోళ్ళ ఇళ్ళలో కానీ శెట్టి గార్ల ఇళ్ళలో కానీ ఆమెతో పోటీ పడి అరిశెలు రుచిగా చేయగలిగిన వంట గాళ్ళు మా వూరిలో లేరు ఆడయిన మగయినా.
లడ్డూల సంగతి సరే స్నానాల గదులు, పాయిఖానాలు కూడా బాపనోళ్ళనీ, శెట్టి గార్లనె కడగమండి చూద్దాం.అప్పుడు దీన్ని అందరూ స్వాగతించవచ్చు.
ఒరేయ్ చెత్త వెధవల్లారా ఇప్పటికే హిందూ మతం కులాల పెర్లతో ఉప కులాల పేర్లతో ముక్కలు చెక్కలై పోయింది.వాటిని కలపాల్సిన వెధవలు మీరే ఇంకా చీల్చడం ఏమైన బావుందా?ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని ఈ నియమాన్ని ఎత్తి అవతల పారేయండి.లెకుంటే దుర్గమ్మ మిమ్మల్ని తన కాలి కింద వేసి తొక్కి పారెస్తుంది.
22 comments:
@పాయిఖానాలు కూడా బాపనోళ్ళనీ, శెట్టి గార్లనె కడగమండి చూద్దాం.అప్పుడు దీన్ని అందరూ స్వాగతించవచ్చు.
గుడ్.
నిప్పులు కడిగిన కులాల
మసిబొగ్గుల మాటున
గౌరవంగా బ్రతికేద్దాం.
వినే చెవిలో సీసం.
పలికే నాలుకను చీలికచేసే
ఆదర్శాలను అభినందించి
ప్రశ్నిస్తే వెలి.
ఎదురుతిరిగితే తల తెగాలి.
అనే, ప్రమాణాలందించిన
పెద్దల బుద్దులని అక్షరాలా ఆచరించి.
అంటరానితనాన్నీ,
రెండూగ్లాసుల విధానాన్నీ
అఫిషియల్గా చట్టంబద్దం చేసి
కులాల ఆచారాల్ని
రాజ్యాంగంకన్నా అపురూపమందాం.
అందరూ కలసికట్టుగా
కూలాల్ని ఉద్దరిద్ధాం.
మానవత్వానికి సరదాగా సమాధికట్టి,
మార్పుని ఆశించేవారిని
‘కులపిచ్చిగాళ్ళని’ నిరసించి నోరుమూయించి
మువ్వన్నెల జెండాకాక, కుల అజండాని
భుజానమోస్తూ, భారతదేశాన్ని బలోపేతం చేద్దాం.
from http://parnashaala.blogspot.com/2008/08/blog-post.html
అదేదో సినిమాలో హీరో బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పేదరికం వల్ల చెప్పుల షాప్ లో పని చేస్తాడు. పేదరికం వల్ల ఆ పని చేసినా ఇంట్లోవాళ్ళు అతన్ని తిడతారు. ఆధునిక యుగంలో కూడా కులాన్ని బట్టి వృత్తిని ఆచరిస్తే ఎలా?
KAMAL మీ కవితలో ఆవేశం చాలా ఉందండీ.మీనుండి మరిన్ని ఆణిముత్యాల కోసం ఎదురు చూస్తుంటాం.
మహానైవేద్యం రుచి కంటే శుచి గా పెట్టాలి.
ఆ యా గుడి నియమం ప్రకారం మడి తోనే వండాలి, ఈ ఈ పదార్డాలు మాత్రం పెట్టాలి అని నియమం ఉంటుంది. ఇక్కడ కులం కంటే ఆచారం, నియమం ముఖ్యం. అయితే ఎవరు ఏమి పెట్టినా ఆమె కాదనదు.
అయితే ఇక్కడ విషయం వేరు. అమ్మవారికి నేను నైవేద్యం పెడతానంటె నేను పెడతానని ఎవరూ కొట్టుకోవటం లేదు. సమస్య భక్తులకు అమ్మే లడ్డు దానివల్ల వచ్చె ఆదాయం గూర్చి. ఇది డబ్బు కుతి సమస్యే కాని కుల సమస్య కాదు.
ఎప్పటి లాగే డబ్బు కుతి, స్వార్డం కులం రూపం లోనో మతం రూపం లోనో ప్రాంతం రూపం లోనో బయట పడుతుంది. ఆవేశ పరులు మూర్ఖం గా విషయం తెలుసుకొకుండా కొట్టుకొంటుటారు.
ఈ నియమం వల్ల కొంత మందికి భుక్తి పొతుంది.కాదంటారా.ఇంత కాలం లేని శుచి ఇప్పుడు గుర్తొచ్చిందా?భక్త కన్నప్ప శివ లింగం పైన కాలు ఆనించి మాంసం పెడితే పరమ శివుడు వద్దన్నాడా?
శుచిగా ఆచారవంతంగా ఎలాఉండాలో శిక్షణ నిచ్చి ఈప్రసాదాల తయారీలో పాల్గొనేవారిని మలచుకోవచ్చు. కాకుంటే కాంట్రాక్ట్ పద్దతులలో ప్రసాదాలు తయారు చేపిస్తున్నప్పుడు డబ్బుకోసమే పనిచేసేవారు శుచి శుభ్రత పాటించకపోవటం జరుగుతుంది .వాల్లే కులమైనా జరిగేది అదే. ఈ ప్రమాదాన్ని నివారించే చర్యలు చేపట్టాలి.
ఇక భక్త కన్నప్పతో మనలను పోల్చుకోవటం తగదు.మనకోరికలకోసం మాత్రమే గుడికెల్లేమనకూ భగవంతునికోసమే తన తను,ప్రాణాలను సమర్పించడానికి సిద్ధపడ్ద కన్నప్పకు పోలికా? ఆస్థితిని చేరినవారి మనోస్థితి అత్యున్నతం .అది మనలాంటి సామాన్యులందరికీ అందదు.
అసలు భగవత్ ప్రసాదాన్ని అమ్మటమే తప్పు . అన్నింటినీ వ్యాపారమ్ చేసుకునే వ్యాపారులతో నిండిపోయి ఉంది ఆలయ వ్యవస్థ .ఇలాంటి వివాదాలే వస్తుంటాయి . తప్పదు కలి ప్రభావం.
నేను చెప్పిన మాట లో అసలు విషయం వదిలారు.
ఇక్కడ ఎవరికైనా లడ్డూలు చేసి అమ్మటం దాని ఆదాయం మీద కన్ను కాని భక్తి గా అమ్మవారికి నైవేద్యం పెట్టటం మీద పేచీ కాదు.
ఇది డబ్బు, గుడి పై పెత్తనానికి సంబంధించిన విషయం కాని కుల ఆధిపత్యానికి సంబంధించినది కాదు. అది గమనించి రాయండి.
ఒక విషయం జరగ్గానే ఆ కులం వాళ్ళనో ప్రాతంవాళ్ళనో గుడ్డిగా తిట్టి ప్రొవోక్ చెయ్యటం సరి కాదు.
మైత్రేయీ,
కులాన్ని తిట్టొద్దు అంటూనే తెలివిగా సమస్య కులానిది కాదు..లడ్డూల మీద వచ్చే డబ్బు, గోంగూర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నావ్ ! ఇక్కడ సమస్య కులం గురించే. కేవలం ఒక కులం వాళ్ళకే శుచి, మడి, తొక్క తోలు ఉంటాయి గనుక.. వాళ్ళు మాత్రమే సో-కాల్డ్ సంప్రదాయాలు పాటిస్తారు కనక వాళ్ళే దేవుడి ప్రసాదం చేయడానికి అర్హులు అనడం నిజంగా కులవివక్షే ! దీనికి బ్రాహ్మల్ని, బ్రాహ్మణ కులాన్ని తిడ్తే తప్పు ! బ్రాహ్మలు ఇదేదో తమమీద దాడిలాగా భావించి ఈ కులవివక్షని మీలాగా సమర్ధిస్తే ఇంకా పెద్ద తప్పు !! భక్త కన్నప్ప, మాదిగ తిమ్మప్ప ఉదాహరణలు,పుక్కిటి పురాణాల వత్తాసు అవసరం లేదు ఇలాంటి నీచమయిన కులవివక్షని ఖండించడానికి !
BTW, the rule is imposed by the temple EO and other authorities. Not by the contractors as you tried to indicate ("Dabbu kuti")
ఉద్యోగం దొరక్క చిన్నచిన్న పనులు చేసే పేద బ్రాహ్మణులు ఉన్నారు. వేరే కులాలవాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోతే దేవాలయాలలో లడ్డూలు తయారు చెయ్యడం తప్పా?
ఇక్కడ చర్చ జరిపిన మైత్రేయగారి అభిప్రాయాన్ని తప్పుదోవపట్టించే విధంగా ఆలొచించకండి. ఆయన ఆలోచన కులవివక్షతా లేక ఆచారకాండగూర్చి మాట్లాడుతున్నారా అనేది ఆలొచించాలి.
ఇక భక్త కన్నప్ప లాంటి మహాభక్తుల చరిత్రలు పుక్కిటపురాణాలుగా భావిమ్చేవారు ఈచర్చలో పాల్గోవాల్సిన అవసరం ఉందంటారా ? ఎందుకంటే ఇది మతవిషయం .దీనిలో మతం పైన నమ్మకంలేనివాల్లకు,అంతర్గతంగా ఈధర్మం పై వ్యతిరేకత కలవాల్లకు ఆసక్తి ఎందుకు? ఇప్పుడు ముస్లింల లలో మగవాల్లతో పాటు స్త్రీలు నమాజ్ కు మసీద్కు రావటం నిషేధం ,కారణం అక్కడ ఆచారాలప్రకారం వారి నిబంధనలు అవి. అక్కడ సమానత్వం లేదు <అనే అనుచిత అభిప్రాయాలతో వెల్లటం తప్పు,ఇలావెల్లుంటే వెల్లేవాల్లకు ముప్పుకూడా .
కాబట్టి మత విషయాలలో దానిని అనుసరిమ్చేవారు పాల్గోవటం ధర్మం .అప్పుడుమాత్రమే మనస్సులో ద్వేష భావనతో కాక సమస్య ఏమిటో దాని పరిష్కారమేమిటో సూచనలచేయగలుగుతారు . ఆలోచించండి.
ఛెప్పుదెబ్బలు గారు,
మీకు కుల ప్రాతిపదికన స్కూలు, కాలేజీలలో సీట్లు ఇస్తె తప్పులేనపుడు బ్రహ్మణులకే సొంతమైన పూజ, నైవేద్యం వంటి వైదిక కార్యాలు వారినే చెయ్యమనడం తప్పేమీ కాదు....
"లడ్డూల సంగతి సరే స్నానాల గదులు, పాయిఖానాలు కూడా బాపనోళ్ళనీ, శెట్టి గార్లనె కడగమండి చూద్దాం.అప్పుడు దీన్ని అందరూ స్వాగతించవచ్చు."
ఇదిచాలు మీకు పూర్తి విషయం తెలియదని చెప్పడానికి... మీరు చెప్పినట్టు చాలమంది నిరుద్యోగులు (అన్నీ కులాలవాల్లు) ఏ పని దొరికినా చేయటానికి సిద్దంగా వున్నారు...కాని మీకు తెలియదేమొ మీరు క్లాస్4 ఉద్యొగం చేయ్యటానికి కుల రిజర్వేషన్ వుండాలి...దయ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని విమర్శ చేయండి. లేకపొతె ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలే అల్లర్లకు దారి తీస్తాయి..
ఒక వృత్తి ఒక కులానికే అని నిర్ణయించడాన్నే నేను నా పోస్టులో ఎండగట్టింది.బ్రాహ్మణులు ఏదో చాల బాగుపడిపోతున్నారని నా ఉద్ధేశ్యం కాదు.మిరు నా పాత పోస్టులు చూస్తే నాకు సంకుచిత దృష్టి లెదన్న విషయం మీకు స్పష్టమౌతుంది.
దుర్గమ్మకి జధ్యం వున్నది కాబట్టి బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య కులాలలో ఏదో ఒక కులానికి చెందినదై వుండవచ్చు.
జంగాల వాడి(శివుని) భార్య కాబట్టి జంగంది కావచ్చు.
బ్రాహ్మణుడైన విష్ణువుకి సహొదరి కాబట్టి బ్రాహ్మణస్త్రీ కావచ్చు.
అప్పా(అక్క) అని పిలుచుకొనే కమ్మవారింటి బిడ్డ కావచ్చు.
రాజులింట బిడ్డ అయిన వెంకన్నబాబు(తిరుమల వేంకటేశ్వరుడు)కి అక్క కాబట్టి రాజుల ఆడపడుచు కావచ్చు.
ఇంకా ఎక్కువ మాట్లాడితే
బీబీ నాంచారమ్మ కి ఆడపడచు కాబట్టి తురకల ఆడబిడ్డేమో?
కొండల్లో వున్న భయంకర విగ్రహాన్ని చూసిన జనం జడుపు జ్వరాలు వచ్చి చచ్చిపోతుంటే,దూరదేశాలనుంచి వచ్చిన ఒక సద్బ్రాహ్మణుడు ఆవిగ్రహం మొహానికి చందనం పూసి కుంకుమతో నవ్వుతున్న నోటిని తీర్ఛిదిద్ది,
పూజాపునస్కారాలను ఏర్పాటుచేసాడు.కాబట్టి ముమ్మాటికీ ఆ బ్రాహ్మలకే పూర్తి అధికారం.
నేను మాత్రం బ్రాహ్మణుణ్ణి కాదండోయ్.కంగారుపడకండి.
బాగా చెప్పారు.
శ్రీ మహా విష్ణువు ను బ్రాహ్మణుడు అని తేల్చినందుకు చాలా కృతఙ్ఞతలు. నిరాకారుడైన విష్ణువు బ్రాహ్మణుడెలా అయ్యాడు? చాతుర్వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభాజకః అని. అంటే, చేసే వృత్తిని బట్టి కులము. జన్మ ని బట్టి కాదు. కుండలు చేసే వాడు కుమ్మరి, వాని తండ్రి, తల్లి బ్రాహ్మలు అయినా కూడా..
ఇంత చిన్న విషయం ఎందుకు జనం మర్చిపోతారో నాకు అర్థం కాదు. ఇక్కడ దుర్గ గుడి లో కూడా పుట్టు బ్రాహ్మలు, లేక పుట్టు వైశ్యులు అని అంటే అది చాలా ఘోరం. అలా కాక అక్కడ పని చేసే వారు ఇలా ఉండాలి అని మార్గదర్శకాలు ఇస్తే చాలా బాగుంటుంది.
"లడ్డూల సంగతి సరే స్నానాల గదులు, పాయిఖానాలు కూడా బాపనోళ్ళనీ, శెట్టి గార్లనె కడగమండి చూద్దాం.అప్పుడు దీన్ని అందరూ స్వాగతించవచ్చు."
భలే అడిగారండీ! ఇది నిజమైన చెప్పుదెబ్బ, కాబట్టి మీకు పూలదండలు :)
kulaala perutoa vidipoakoodadani chepparu kada last loa adi nachchindi. annitikee interviews test vunnatlu laddu evaru baaga cheastaaro test chesi iste baaguntundi kadaa!!! kaka potea ala test cheasetappudu naalaanti vaallani kondarini piliste inka baaguntundi.kidding..
u are choosing good topics. good blog. keep writing differently.
అసలు విషయం మర్చిపోతున్నారు. చీప్ హొటెల్‌లోనైనా, ఫైవ్ స్టార్ హొటెల్‌లోనైనా వంట చేసేవాళ్ళది ఏ కులమో తెలియదు. అక్కడ కులం గురించి ఆలోచించకుండా బిర్యానీలు బుక్కడం లేదా?
బ్రాహ్మణ భోజన హొటెల్ అని బోర్డ్ పెట్టినా హొటెల్ యజమాని మాత్రమే బ్రాహ్మణుడయ్యుంటాడు, వంటవాళ్ళది ఏ కులమో తెలియదు.
లడ్డూల గురించి ఇంత ఉపన్యాసాలు దంచి హొటెళ్ళ గురించి మర్చిపోయారు మనవాళ్ళు.
Post a Comment