నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 23, 2010

మాభూమి సినిమాకి ముప్పయ్యేళ్ళు

మా భూమి సినిమా విడుదలై నేటికి మూడు దశాబ్ధాలు అయ్యింది. ఈ తరం వారికి అస్సలు ఆ సినిమా గురించి తెలుసొ లేదో గానీ ఆ సినిమాని చూసిన వాళ్ళెవరూ దాన్ని మర్చిపోలేరు. అంతగా ఆకట్టుకోవడానికి ఏముంది అందులో.మా భూమి చూడని,చూడలేకపోయిన వారికోసం ఈ పోస్టు.ఇందులో నేని చిత్రాన్ని సమీక్షించ బోవడం లేదు. ఈది మాభూమి సినిమాకి ఒక పొగడ్త మాత్రమే.

కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలం లేదు, మెరిసి పోయే అందమైన భామలు లేరు, బెత్తెడు బట్టలతో ఎక్స్ పోజ్ చేసే అమ్మాయిలు లేరు, ఐటం పాటలు లేవు, చెవులు హోరెత్తిపోయేల రణ గొణ సంగీతం లేదు. మరేముంది?

గుండెల్ని పిండే ఇతివృత్తం ఉంది. జీవితాంతం వెంటాడే పాటలున్నాయి, వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే పాత్రలున్నాయి. ఫల్లె ప్రజల దయనీయ గాధలున్నాయి. ఇప్పుడు కొంతమంది వెధవలచేత పొగడ బడుతున్న నిజాం గాడు చేసిన దురాగతలు, వాటి మీద సగటు జీవి చేసిన మహోన్నత పోరాటం ఉంది. స్పందిచే హృదయాన్ని కదిలించే విషయాలు ఎన్నో ఉన్నాయి.

ఈ సినిమాని చూడాలనుకొంటే ఎక్కడా డీవీడీ మీకు దొరక్కపోవచ్చు. యూ ట్యూబ్ లొ పదేసి నిమిషాల నిడివితో సినిమా మొత్తాన్ని ఒక అభిమాని పోస్టు చేసి ఉన్నాడు. చూడండి. సినిమా అంతా చూసే ఓపిక లేకపోతే అదే యూ ట్యూబ్ లో బండెనక బండి కట్టీ… అనే ఒక ఆవేశ పూరిత పాట వుంది.వినండి. పాల బుగ్గల జీతగాడా.. అనె మరొక కరుణా రస భరితమైన గేయం కూడా ఉంది. ఈది మిమ్మల్ని ఎన్నో రోజుల దాకా వెంటాడుతుంది. దీన్ని కూడా వినండి.

ఈనాడు మన సినిమా జీవులు ఎప్పుడు చూసినా తాము తీసిన సినిమాలలో అతి తక్కువ శాతం మాత్రమే హిట్టవుతున్నాయి, అధిక భాగం ఫట్టవుతున్నాయి అని ఏడిచి చస్తుంటారు. ఆ వెధవలని ఈ సినిమా చూడమని నా విన్నపం. ంఅంచి కథనెన్నుకొని దాన్ని హృద్యంగా తీస్తే మనం చూడక చస్తామా.

ఈ సందర్భంలో ఏదైన చానల్ ఈ సినిమాని ప్రసారం చేస్తే బావుణ్ణు.

4 comments:

అక్షర మోహనం said...

your review is so good and apt. no channel will
telecast it. They need business. Even they did not show some inspiring scenes. Thanks for your effort.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you sir for the comment.

Rohiniprasad Kodavatiganti said...

గౌతం ఘోష్ సినిమాతో ఇతర తెలుగు సినిమాలను పోల్చడం హాస్యాస్పదమే అవుతుంది. ఏళ్ళుగా పాతుకుపోయిన హీరోలకో, ప్రొడ్యూసర్లకో కొడుకులూ, మనవలూ అయితే ఇప్పుడు హీరోలుగా వచ్చేసి చూడటానికి భయంకరంగా కనిపిస్తున్నారు. కె.వి.రెడ్డివంటివారు వీళ్ళకి భటుడి వేషం కూడా ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. అందులో ఒకడు మరీ కుష్టురోగి ముఖంతో కనిపిస్తాడు. వాడొక పెద్ద హీరో. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, థీయెటర్లను అదుపులో పెట్టుకున్నవాళ్ళే తెలుగు సినిమాల క్వాలిటీనీ, ప్రచారాన్నీ అదుపుచేస్తున్నారు. అందుకనే మన సినిమాలు పాయిఖానా లెవెల్లో ఉంటాయి.

Narsingrao said...

You can watch complete movie here
http://www.veoh.com/browse/videos/category/drama/watch/v19708592WBSjwP52