నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 30, 2010

ఉరేయ్ దళిత సంఘాల వాళ్ళూ ఈ నిస్సహాయ దళితుడి బాధ మీకు కనిపించడం లేదా?

మనకి ఎన్నో సంఘాలున్నాయి.కవులకీ,కళాకారులకీ,కష్ట జీవులకీ,ఉద్యోగులకీ,నిరుద్యోగులకీ,విద్యార్ధులకి,మహిళలకీ,ఎట్సెట్రా ఎట్సెట్రా... కానీ కులాల పేరుతో ఉన్నన్ని సంఘాలు ఇంకే ప్రాతిపదికనా లేవు.దళిత సంఘాలు,బీసీ సంఘాలు, కమ్మ,రెడ్డి,కాపు,బలిజ, ఇలా ప్రతి కులం పేరిట సంఘాలున్నాయి.ఈ అన్నింటిలో చాలా పవర్ ఫుల్ దళిత సంఘాలు.వాళ్ళ వెనక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నందువలన వాళ్ళతో ఎవరైనా కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు.

ఈ దళిత సంఘాలన్నీ కూడా ఒక్కటి కాదు.మాల,మాదిగ,యానాది,యెరుకల ఇలా నానా రకాల సంఘాలు ఉన్నాయి.ఎవరైనా దళితుడుకి అన్యాయం జరిగితే ఈ సంఘాల వాళ్ళు దాన్ని ఎదుర్కొంటారని సాధారణంగా ఏవరైనా భావిస్తారు. ఇటీవల ఆంధ్ర జ్యోతిలో బాడుగ నేతలు అని ఈ సంఘాలపై వచ్చిన కధనానికి వ్యతిరేకంగా ఎంతో గొడవ చేసి నానా యాగీ చేయడం అందరికీ గుర్తే కదా!

అయితే ఇప్పుడు ఈ దళిత నేతలు,అణగారిన వర్గాల ఆశాజ్యోతులూ ఒక దిక్కూ మొక్కూ లేని అమాయక నిస్సహాయ దళిత యువకుడికి అంతు లేని అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకొన్న పాపాన పోలేదు.

ఆయేషా మీరా హత్య కేసులో జైలులో పడి జబ్బుతోనో, విష ప్రయోగం వల్లనో నానాటికీ చిక్కి శల్యమౌతున్న సత్యం బాబు ఒక దళితుడన్న విషయం వీళ్ళ కంటికి కనిపించడం లేదా? లేకుంటే ఇక్కడ దండుకోవడానికి ఏమీ గిట్టుబాటు కాదని వీళ్ళు ఇటువైపు తమ దృష్టి సారించడం లేదా?

7 comments:

ప్రేమిక said...

మస్తు చెప్పినవ్

Dharanija said...

anthe kadaa mari

చెరసాల శర్మ said...

స్టూవర్టుపురంలో ఎరుకలవాళ్ళని పోలీసులు లేనిపోని కేసుల్లో ఇరికిస్తున్నప్పుడు కూడా ఈ దళిత సంఘాలు ఏమీ మాట్లాడలేదు. మెజారిటీ దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉంటేనే డబ్బున్న దళితుల పిల్లలు రిజర్వేషన్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాలు చెయ్యగలరు. అందుకే పేద దళితుల జీవితాల గురించి దళిత సంఘాలు పట్టించుకోవు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

శర్మ గారూ ఆణిముత్యం లాంటి మాట చెప్పారండీ.

Krishna said...

You missed one main point. అసలు నిందితుడుగా భావిస్తున్నోడు కొనేరు రంగారావ్ మనమడు కూడా ఓ దళితుడే, కాకపోతే డబ్బున్న దళితుడు, ఈ సంఘాలన్ని నడిపించేది, డబ్బుండి, లేని దళితులను మోసపుచ్చే దళితనాయకులే కాబట్టి, వాళ్ల సప్పోర్ట్ ఎప్పుడూ కోనెరు లాంటి వాళ్లకే ఉంటుంది, ఇక సత్యంబాబు గురించి ఎందుకు పట్టించుకొంటారు!!!

చెరసాల శర్మ said...

కులాంతర వివాహం వల్ల పుట్టినవాడు దళితుడినని చెప్పుకుని SC రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యొచ్చా? కోనేరు రంగారావు తల్లి దళితురాలే కానీ తండ్రి కమ్మవాడు. కోనేరు అని ఇంటి పేరు ఉన్నవాళ్ళు దళితులలో లేరు. కోనేరు రంగారావు దళితుడు కాడని తెలిసినా ఏదో రాజకీయ ప్రతిష్ట కోసం అతను తమవాడేనని దళితులు చెప్పుకుంటున్నారు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కృష్ణ గారు,శర్మ గారు మీ కామెంట్లకి థాంక్స్.మి కామెంట్ల కోసమైనా రోజూ ఒక పోస్టు కనీసం పెట్టాలనిపిస్తోంది.