అస్సలు ఈ తెలంగాణా కావాలి అనె వాళ్ళకు గానీ, వద్దు సమైక్యంగ వుందాం అనే వాళ్ళకు గానీ ఆ వాదం వెనక మోటివ్ రాజకీయమే అన్న విషయం చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు. తెలంగాణా వస్తే నాలుగు కేబినెట్ పదవులో, సీ ఎమ్మో లేకుంటే డిప్యూటీయో వస్తుందన్న ఆశతో తెలంగాణా వాదులూ, హైదరాబాద్ విడిపోతే అందులో ఉన్న తమ వందల వేల కోట్ల ఆస్తుల విలువ పడి పోతుందన్న ఏకైక మోటివ్ తో సమైక్య వాదులూ పోరాటం చెస్తున్నారన్న విసహయం సుస్పష్టం.
అయితె తెలంగాణా వచ్చినా రాకున్నా దానివల్ల ప్రభావితమయ్యె మూడో నాలుగో కోట్ల సాధారణ ప్రజానీకం అభిప్రాయం సరిగ్గా వెలుగు చూడటం లేదు. అందుకే ఈ క్రిష్ణా రామా కమిటీల స్థానంలో ప్రజల అభిప్రాయం తెలుసుకొనెందుకు ఒక రెఫరెండం పెట్టి చూస్తే మంచిది కాదా? ఎక్కువ మంది మాకు తెలంగాణా కావాలి అంటే ఈ లగడపాటి జగడపాటిలను తుంగలో తొక్కి తెలంగాణా ఇచ్చెయ్యాల్సిందే.వాళ్ళు వద్దు అంటే ప్రత్యేక ఉద్యమాన్ని కట్ట కట్టి చరిత్ర చెత్త బుట్టలో పారేయవచ్చు.
ప్రజలు అఫెక్టయ్యె విషయానికి సంభందించిన అంతిమ నిర్ణయం ప్రజలకే వదిలి పెట్టడం తెలివైన పని కాదా?
1 comment:
Yes sir...you are absolutely correct.......but what can we do.....ummm...let's see...
Post a Comment