దేశంలో బాబాలకు, స్వాములకూ బ్యాడ్ టైం నడుస్తోంది. మొన్నటికి మొన్న కల్కి భగవాన్, నిన్న అమ్మాయిలతో కామ కేళీ కలాపాలలో నిత్యానందం ....ఇక నోట్లోంచి లింగాలు బయటికి తీయగలిగి కూడా చెక్ బౌన్స్ కాకుండా ఆపలేని సాయి బాబా జూనియర్, కబ్జా కోరు కాళేశ్వర్ ఉండనే ఉన్నారాయే. కొంతమంది ఇదంతా కేవలం విష ప్రచారమనీ, హిందువుల మనో భావాలు దెబ్బ తీసే కుట్ర అనీ వాదిస్తున్నారు.కానీ నా ఉద్దెశ్యంలో ఈ దొంగ వెధవ బాబాల వల్లనె హిందు మతం భ్రష్టు పట్టి పోతోంది.అయిన వీళ్ళని అని ఏం లాభం.కషాయం చూడగానే ఎగేసుకొని పోయే భక్తులని అనాలి ముందు. అసలు7 మనకేం తక్కువ?ముగ్గురు త్రిమూర్తులని పిలవబడే ఫస్ట్ క్లాస్ దేవుళ్ళూ,చిన్నాచితక దేవుళ్ళు ఓ మూడూ కోట్లూ, ఫెమినిస్టులు ఫీలవకుండా ఎందరో దేవతా మూర్తులూ, వీళ్ళలో కొందరు శాంతి మూర్తులు లక్ష్మి, సరస్వతి లాగా మరికొందరు రౌద్ర మూర్తులు కాళి ఎట్సెట్రా ఉండగా ఈ అందరినీ వదిలి పెట్టి ఈ వెధవలని దేవుళ్ళు అని పూజించాల్సిన ఖర్మ మనకేంటి?
అందుకె శంకరాచార్యులు గారు ఎప్పుడో అద్వైతాన్ని భోదించారు.ఒరేయ్ వెధవాయిలూ దైవత్వం ఎక్కడో లేదురా, అది నీలో ఉంది, నాలో ఉంది అన్ని చోట్లా ఉంది అని.మమూలూ భాషలో చెబితే వీళ్ళు వినరని సంస్క్రుతంలొ రెండు మాటలు చెప్పారు: సర్వం ఖల్విదం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి అని. అంటే అనీ చోట్లా బ్రహ్మం నిండి ఉంది, నేనే బ్రహ్మాన్ని అని. కాబట్టి విశ్వ వ్యాపితమైఉన్న దైవత్వాన్ని అరాధించండి, పూజించండి. దొంగ బాబాలని చీత్కరించండి.
6 comments:
స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.
Annai,
Roju Cheppu Debbalena, appudappudu Pooladandalu kooda veyyandi ...
మీరన్నట్టు మనకు ముక్కోటి దేవతలున్నారు. వారిని పూజించడానికి చక్కని పద్దతులు కూడా ఉన్నాయి. హాయిగా, ప్రశాంతంగా ఇంట్లో ఉండి పూజ చేసుకోవచ్చు. కాని ఇవన్నీ కష్టమనుకున్నవాళ్ళు ఇన్ స్టెంట్ మోక్షం కోసం అర్రులు చాస్తున్నారు అలాంటి వారి కోసమే ఈ సరికొత్త బాబా అవతారాలు. ఇలాంటి వారి వలన నిజమైన పరిత్యాగులకు కూడా విలువ లేకుండా పోతోంది.
well said.
aaropanalu maamule aasayaalu chudandi
SUPER
Post a Comment