ఇంద్ర కీలాద్రిపైనున్న కనక దుర్గమ్మ ఆలయంలో లడ్డూ తయారీకి కేవలం బ్రాహ్మణులనీ వైశ్యులనీ మాత్రమె అనుమతించాలన్న నిర్ణయాన్ని కొంతమంది విచిత్రంగా సమర్ధిస్తున్నారు. లడ్డూ తయారీకి శుచీ శుభ్రత పాటించాలనీ అందుకు వీళ్ళయితేనే సరి పోతారనీ లాజిక్కు తీస్తున్నారు.
శుచీ శుభ్రత అనేది కులంలో గానీ పుట్టుకలో గానీ ఉండవు.శుబ్బరంగా స్నానం చేసి ఉతికిన బట్టలెసుకొంటే ఏ కులం వాడైనా శుభ్రంగా శుచిగా ఉన్నట్టే. ఆలా కాకపోతే ఎవరైన కంపుగా ఉన్నట్టే.
నా చిన్నప్పుడు మా వూరిలో యానాది పోలిగాడు నా క్లాస్ మేట్. వాళ్ళమ్మ వాడిని ప్రతి రోజూ ఉదయం వాళ్ళు కాపలా ఉంటున్న పొలం పక్కనే పారుతున్న పంట కాలువలో శుద్ధంగా స్నానం చేయించి, ఉతికిన బట్టలేసి, అవి ఊళ్ళో ఉన్న రెడ్డెమ్మలు, నాయుడమ్మలూ, బాపనమ్మలు వాళ్ళ పిల్లలకు పనికి రాకపోతే దానంగా ఇచ్చినవే అయినా, స్కూలుకి పంపేది.వాడు శుభ్రత విషయంలో ఏ ఇతర సో కాల్డ్ ఉన్నత కులాల పిల్లలకి ఏమీ తీసిపోకుండా వుండేవాడు.వాడితో పోలిస్తే వూళ్ళో ఉన్న పెద్ద రెడ్ల, నాయుళ్ళ,పంతుళ్ళ,శెట్టి గార్ల పిల్లలే కొంచెం మురికిగా ఉండే వాళ్ళు.
అలాగే దుర్గ గుడిలో పోటు దగ్గర ఒక షవర్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ పూలులో దిగాలంటే ఎలాగైతే స్నానం చేసి దిగుతామో లడ్డూలు చేసే ముందు షవర్ తప్పనిసరి అని, వెంట్రుకలు రాలిపడకుండా తలకి కాప్ లు, ప్రతిరోజూ ఫ్రెష్ గా ఉతికి ఇస్త్రీ చేసిన యునిఫాం ధరించాలని రూలు పెడితే శుచీ శుభ్రతా పాటించవచ్చు కదా? ఈ మాత్రం దానికి కొంత మందికి ఉపాధి దూరం చేసి కుల మత వైషమ్యాలు పెంచడం దెనికి?
PS.This is my last post on this subject.
7 comments:
These kind of actions are the root cause of tarnishing the real Hinduism.
How about Tribes and untouchables take over maintenance of all Hindu Temples - I am okay with that.
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి మొత్తం పరపీడన పరయాణం.
I too am with you, Telugu.
గౌతమ బుద్దుడు
శంకరాచార్యులు
రామానుజాచార్యులు
అన్నమాచార్యులు
వీరబ్రంహ్మంగారు
మహాత్మాగాంధి
వివేకానందుడు
ఈ పేర్లు వినని భారతీయులు లేరు.వీరి లో కొందరికి మెక్కుతారు,కొందరి గురించి మా భారతీయులని గొప్పలు చెప్పుతారు.
కానీ వాళ్ళు జీవితాంతం మొత్తుకుని చెప్పిన విషయాన్ని మాత్రం బుర్రకు ఎక్కించుకున్న వారెంతమంది?
కులం గురించి సోది చెప్పేవాళ్ళని శాంతంగా కూర్చుని భగవద్గీత చదవమని చెప్పండి.
మా పని మనిషి పొందర అనే బి.సి. కులం నుంచి వచ్చింది. ఆమె నాన్ వెజ్ ముట్టుకోదు. మాంసాహారం అశుభ్రం అని ఆమె అభిప్రాయం. మేము ఒకసారి గుత్తొంకాయ కూర పెడితే చికెన్ అని అనుమానం వచ్చి అడిగింది. శుచి, శుభ్రత పాటించడానికి బ్రాహ్మణులే కావాలని రూల్ లేదు.
దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని తికమకపడుతున్నాడురా
మానవుడున్నంతవరకు దేవుడు ఉంటాడురా
వాడినితలచేందుకు మానవుడుండాలిరా [దేవుడు ]
తనలో మంచిని పెంచుకునేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొకరూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలుమతాలుగా మారాయిరా [దేవుడు]
భయంనుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే
ముక్తి అంటారురా [దేవుడు ]
మనిషికోసం బ్రతికే మనిషేదేవుడు
దేవుడి కోసం మనిషిని మరిచేవాడే మూఢుడు
ప్రేమ త్యాగం తెలిసిన వాడేమానవుడూ
దేవుడి పేరిట మూఢుడైతే వాడేదానవుడు [దేవుడు ]
గాయకుడు-జేసుదాసు
Rahamath,super.
Post a Comment