నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 30, 2010

వాటే క్యాచ్ డేవిడ్ హస్సీ!

ఈ రోజు ఢిల్లీ కొల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ లొ కొల్ కతా ఓడిపోయినా ఆ జట్టుకి చెందిన డేవిడ్ హస్సీ ఎప్పటికీ మరపు రాని ఒక అద్భుతమైన క్యాచ్ ని అందరికీ చూపించాడు.ఇంతకు ముందు చాల అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనలని చూశాను కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. జాంటీ రోడ్స్ నేలకి సమాంతరంగా బంతిని పట్టుకొని రన్ అవుట్ చేయడం చూశాను. అదె జట్టు ఆటగాళ్ళు అనేక సార్లు కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేయడం చూశాను గానీ ఈ హస్సీ యాక్ట్ మాత్రం అన్నింటికన్నా ముందున నిలుస్తుంది.

కోలింగ్ వుడ్ కొట్టిన బంతి బౌండరీ దాటి పడితే అక్కడ ఉన్న హస్సీ గాలిలోకి జంప్ చేసి గాలిలో ఉండగానే బంతి ఇవతలికి లాగి మళ్ళి ఎగిరి బంతిని పట్టుకొని బౌండరీ ఇవతల ల్యాండయ్యాడు.ఆ విన్యాసం చూస్తే గానీ అర్ధం చేసుకోవడం కష్టం.మొయ్త్తానికి నైట్ రైడర్స్ ఓడిపోయినా మంచి ఫీల్డింగ్ విన్యాసం చూసే అవకాశం దొరికింది.వెరీ వెల్ డన్ డేవిడ్ హస్సీ.

3 comments:

desi said...

Michael Hussy Akkada Newzealand tho Test match adutunte, ikkada IPL Matchlo Catch ela Pattukunnado Cheptara !!!!!!!!!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sorry1This is David.

M.Srinivas Gupta said...

మైఖెల్ హస్సి కాదు బాస్, డెవిడ్ హస్సి
Watch Here

http://www.youtube.com/watch?v=wfQLk7sUyrw

http://www.youtube.com/watch?v=VC2dGXfJMH0