నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 2, 2010

వైఎస్సార్ Vs చంద్ర బాబు

చంద్ర బాబు నాయుడు వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి ఇద్దరు ఒకే కాలంలొ కాంగ్రెస్ పార్టీలో ప్రవెశించి అక్కడ మంత్రులై తరువాత బాబు మామగారి పార్టీలో దూరి సీ ఎం పదవిని అధిష్టించి రాష్ట్రానికి సి ఈ ఓ గా తనని తను అభివర్ణించుకొని దరిమిలా వై ఎస్ దెబ్బకి వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో దెబ్బ తిన్నాడు.ఈ ఇద్దరి మధ్య సారూప్యాలూ,వైవిధ్యాలూ అన్వేషించే ప్రయత్నం ఈ వరస టపాలలో.
మొదటిగ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వై ఎస్ సంక్షెమ పధకలు అయన్ని గెలిపించాయని.ప్రత్యర్ధులు ఆయన అవినీతిని ఎత్తి చూపుతారు.కాంగ్రెస్ వాళ్ళు బాబు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారబట్టే ప్రజలు ఆయనని తిప్పిగొట్టారని అంటారు.
నా విశ్లేషణ ఏమంటే : చంద్ర బాబు రూపాయి తింటే అందులో వంద పైసలూ తనకో లేక తన పార్టీ వాళ్ళకో దక్కేలా చూశాడు.వై ఎస్ రూపాయి తినే చోట పది రూపాయలు తినేలా చేసి అందులొ ఒక పావలో అర్ధో ప్రజలకు పడేసే వాడు.అంతే అందరు గప్ చుప్.నిజంగా తెలివంటే ఇదీ.
ఒక పక్క రాష్ట్రంలోని వనరులన్నింటిని తనొ, తనకు కావలసిన వాళ్ళో దొచుకొనే ఏర్పాట్లు చేసిన ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ వై ఎస్ కె పట్టం కట్టారంటే ఇడె అందులో రహస్యం.ఐరన్ ఓర్ మొత్తాన్నీ గాలి స్వాములు లారీల్లో అటు పిమ్మట ఓడల్లో అక్కించి తరలిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు కదా!ఎడొ ప్రతి పక్షాలు గోల చేయడం మినహా కోర్టులూ స్వపక్షంలోని ప్రతిపక్షం ఏమీ మట్లాడకుండా మిన్నకుండిపోయారు కదా.
రాజకీయ నాయకులు తెలుసుకోవలసిన నీతి ఏమంటే నువ్వు ఎంత తిన్నావన్నది ముఖ్యం కాదు.అందులో అంతో ఇంతో ప్రజల మొహాన్న వేశావా లేదా అన్నదే ప్రధానం.

2 comments:

Anonymous said...

Cheppudebba gaaru,

baagaa viDamarachi cheppaaru.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you sir/madam.