నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 26, 2012

నమ్మి తీరాలి అందమైన ఈ పువ్వులు మనుషులే! PHOTOS

జాగ్రత్తగా గమనించండి ఈ పుష్పాలలో రెక్కలు, కాడలు అన్నీ మనుషులే!


బహుళ జాతి కంపెనీల దాడి నుంచి మనని మనం ఇలా కాపాడుకోవచ్చు


బహుళ జాతి కంపెనీలు చాపకింద నీరులా విస్తరించి జాతి సంపదని, దేశ వనరులనీ దోచుకొంటున్నాయన్నది ఏమాత్రం ఆలోచనా శక్తి ఉన్న వారయినా ఒప్పుకొనే సత్యం. బాగా బలిసిన ఈ కంపెనీలతో పోరాటం చేయడం అంత తేలిక కాదు, అందరివల్లా అయ్యే పని కూడా కాదు. అయితే వ్యక్తిగతంగా వీటితో పోరాటం కాకపోయినా ఈ కంపెనీల దోపిడీ బారి నుండి ఎవరికి వారు కొంత మేరకయినా తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు.
 
ముందుగా అందరి జేబులకి చిల్లు పెట్టి ఆరోగ్యానికి చిచ్చు పెడుతున్నవి శీతల పానీయాలు. "మా డ్రింకుతో దాహాం తీర్చుకోండి: అని "భుజాయే ప్యాస్" అని బాగా ఎండన పడి చెమటలు కక్కుతున్న మోడల్స్ ఈ డ్రింకులు తాగి దాహం తీరి చల్లబడుతున్న ప్రకటనలు చూపించి ఇవి దాహాన్ని తీర్చే పానీయాలుగా చూపించి డబ్బులు కొట్టేస్తుంటారు. కానీ ఆలోచిస్తే బాగా దాహం వేసినప్పుడు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ దాహాన్ని తీర్చవు, సరికదా నాలుక మీద నోటిలోనూ తడిని తగ్గించి అవి మరింత ఎండిపోయేలా చేసి దాహాన్ని పెంచుతాయి. ఎండన పడి వచ్చినప్పుడు చల్లని నీటిలో నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసుకొని తాగడాన్ని మించిన పని మరొకటి ఉండదులేదంటే లేత కొబ్బరికాయ నీటిని మించినా పానీయం మరొకటి ఉండదు.

ఏ సినిమా హాల్లోనో పిల్లల కోసం ఇవి కొనడం వేరే సంగతి. ఎండల్లో దాహాన్ని తీర్చే మాట శుద్ధ అబద్ధం. ఇక ఈ పానీయాల్లో ఉండే క్రిమి సంహార మందుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీటీవల్ల కలిగేమరో అనర్ధమేమిటంటే ఇవి ఎముకల్లో కాల్షియాన్ని తగ్గించి అవి మెత్త బడేలా చేస్తాయి.
 
"మీ పళ్ళు తలతలా మెరిసి పోవాలంటే క్రిస్టల్స్ ఉన్న మా పేస్టు వాడండి" అని ఆకర్షణీయంగా రంగుల్లో మెరిసి పోయే పేస్టు చూపుతారు. అయితే అందులో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నా బ్రష్ చేసి నీళ్ళతో కడుక్కున్నాక పళ్ల మీద నుంచి రాలిపావలసిందే. పళ్ళ ఆరోగ్యానికీ, వాటి మిలమిలకీ రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం, ప్రతి సారీ కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఒకటే మార్గం. అది బ్లాక్ అండ్ వైట్ పేస్టా మల్టి కలరా అన్నది ముఖ్యం కాదు. మామూలు తెల్ల పేస్ట్ వాడినా సరిగా వాడితే పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి.

  
"నీ సబ్బు స్లోనా" అని ఒక పిల్లవాడు తన స్నేహితుడిని అడుగుతాడు ఆ పిల్ల వాడు ఎక్కువ సేపు చేతులు కడుక్కోవాలి అని చెప్పినప్పుడు. లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ పదో పదిహేనో సెకన్లలో 95% సూక్ష్మజీవులని తొలగిస్తుంది ఆ ప్రకటన సారాంశం. కానీ ఇది పచ్చి అబద్ధం. ఆపరేషన్లు చెసే ముందు సర్జన్లు ఒకసారి సబ్బుతో ఒకట్రెండు నిముషాలు చేతులు కడుక్కున్నాక 10% అయోడిన్‌తో రెండు నిముషాలు కడుక్కొని ఆ తరువాత స్టెరీలియమ్ అన్న లిక్విడ్‌తో వాష్ చేసుకొని అప్పుడు స్పిరిట్ చేతుల మీద పొసుకుంటారు. ఇలా చేసినా అది 95% నుంచి 99% వరకే సూక్ష్మ జీవులని తొలగిస్తుంది అని ఎముకలు, కీళ్ళు, గుండె లాంటి ఆపరేషన్లలో చేతులకి రెండు జతల గ్లవ్స్ వేసుకుంటారు. అంచేత ఈ ఖరీదయిన హాండ్ వాష్ లిక్విడ్ చేసే పని మామూలు సబ్బుతో కొంచెం తాపీగా చేతులు కడుక్కొంటే ఆ సబ్బు కూడా చేస్తుంది.

Sunday, December 23, 2012

మూర్ఖత్వం రాక్షసత్వం కలగలిసిన నేల


పాకిస్తాన్‌లోని కరాచికి ఉత్తరాన దాడు జిల్లాలోని సీట గ్రామంలోని ఒక మసీదులో ఈ గురువారం ఉదయాన ప్రార్ధనలకోసం వచ్చిన వారికి ఖురాన్‌లోని కొన్ని కాగితాలు తగలబడి కనిపించాయి. మరెక్కడయినా అయితే అది అంతగా చెప్పుకోవలసిన విషయం కాదు కానీ పాకిస్తాన్‌లో దైవ దూషణ(Blasphemy) చట్తం ప్రకారం అది చాలా పెద్ద నేరం. ఆ రాత్రి ఆ మసీదులో ఒక యాత్రికుడు విశ్రాంతి తీసుకున్నాడు. అతను తప్ప మరెవ్వరూ ఆ మసీదులో లేరని ఆ మసీదు ఇమామ్ చెప్పాడు. దానితో అక్కడ గుమి కూడిన ప్రజలు అతన్ని తీసుకెళ్ళి పోలీసు స్టేషనులో అప్పగించారు. ఎక్కడయినా నాగరిక సమాజంలో ఇక్కడితో ఆ జనం బాధ్యత ముగిసి పోలీసుల విచారణ మొదలవుతుంది. 
 
అయితే అది పాకిస్తాన్. రాతియుగం మనుషులు నాగరికులుగా చెలామణి అవుతున్న నేల. పోలీసు స్టేషన్‌లో ఆ మనిషిని అప్పగించిన కొన్ని గంటల్లోనే అక్కడ ఒక గుంపు చేరి అతన్ని బయటకి లాక్కు వచ్చి కొట్టి చంపారు. ఆ పైన పెట్రోలు పోసి కాల్చి చంపారు. ఇదంతా అతను ఖురాన్‌ని కాల్చి ఉంటాడేమోనన్న అనుమానంతోనే. నిజంగా కాల్చడం ఎవరూ చూడలేదు.

పాకిస్తాన్‌లో దైవ దూషణ(Blasphemy) చట్టాలు చాలా అనాగరిక మైనవి. ఆ మధ్య డౌన్ సిండ్రోమ్‌ వల్ల బుద్ధి మాంద్యంతో బాధ పడుతున్న రింషా మాసిహ్ అనే 14 సంవత్సరాల క్రిస్టియన్ అమ్మాయి తన నోట్ బుక్‌లో ఖురాన్ గురించి రాసిన కాగితాలని చింపి వేసిందని పొరుగున ఒక మత పెద్ద కేసు పెడితే ఆ బాలికని జైలులో పెట్టారు. అయితే తరువాత కేసు పెట్టిన పెద్దే ఆ పని చేశాడని, తమ కాలనీ నుంచి క్రిస్టియన్స్ అందరినీ తరిమి వేయడానికె అతను ఆ పని చేశాడని వెల్లదయి ఆ కేసు కొట్టేశారు. అయితే నేటికీ ఆ అమ్మాయి కుటుంబం తమ  మునుపటి నివాసానికి పోవడానికి భయపడుతోంది. "అక్కడికి పోతె మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు" అంటారు వాళ్ళు. అది నిజమని అధికారులకి కూడా తెలుసు. అయినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

దాదాపు అన్ని ఇలాంటి కేసుల్లో దైవ దూషణ అభియోగం మోపబడ్డ వారికి, ఆ అభియోగం మోపిన వారికీ గతంలో గొడవలు ఉంటాయి. ఆ నెపం మీద తమకు కోపం ఉన్న వారి మీద ఈ అభియోగాలు మోపి వారు శిక్షకు గురయ్యేలా చేస్తారు. లేదంటే ఈ చట్టం కింద నేరం మోపబడే మరొక తరగతి క్రిస్టియన్లు. ఎవరయినా తమ ప్రాంతంలో ఉండే క్రిస్టియన్లు అక్కడి నుంచి పారిపోయేలా చేయడానికి ఈ చట్టాన్ని వాడుకుంటారు.

బ్రిటీషు వారి కాలంలో మత కలహాలు రాకుండా చూడడానికి పెట్టిన ఈ చట్టం స్వాతంత్ర్యం తరువాత భారత దేశంలో తీసివేయబడ్డా పాకిస్తాన్‌లో కొనసాగింది. జియా ఉల్ హక్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఈ చట్టానికి మరింత పదును పెట్టి అమానుషంగా తయారు చేశాడు. ఆ తరువాత కాలంలో క్రమేపీ ఇది మరింత భయంకరంగా తయారయింది. 

గతంలో ఈ చట్టం మీద విమర్శలు చేసినందుకు  పంజాబ్(పాకిస్తాన్ లోనిది) గవర్నర్ సల్మాన్ తసీర్‌ని ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు కాల్చి చంపాడు. ఆ తరువాత రెండు నెలలకి ఇదే విషయమ్ మీద పాకిస్తాన్ మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్న షాబాజ్ భట్టి అనే క్రిస్టియన్ కూడా హత్యకి గురయ్యాడు. కొంచెం ఆలోచించే వారిని భయపెట్టే సంగతి ఏమిటంటే ఈ రెండు హత్యలు చేసిన వారిని ఆ ప్రజలు హీరోలుగా చూడడం.

Friday, December 21, 2012

డిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులని శిక్షించకూడదు


అవును వాళ్ళకి శిక్ష పడకూడదు. ఒక వేళ శిక్ష పడితే ఏం పడుతుంది. ఏడాదో, రెండేళ్ళో మహా అయితే ఏ మూడు నాలుగేళ్ళో జైలు. అంతే. ఆ రాక్షసులు జరిపిన అమానుష హింసకి అది సరిపోతుందా? నిస్సందేహంగా సరిపోదు. అంతకు మించి శిక్ష వేయడానికి మన చట్టం ఒప్పుకోదు. అయితే వాళ్ళని ఏం చేయాలి. కాల్చి పారేయాలి. ఆ మధ్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడి ఘటనలో వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని షీలా దీక్షిత్ కూడా తీసుకొని వాళ్ళని కాల్చి పారేయమని పొలీసులకు చెప్పాలి.
 
దానికి ఓ చిన్న పిట్టకథ అల్లి మీడియాకి చెప్పవచ్చు. నిందితులని కోర్టుకి తీసుకెళ్ళే సమయంలో పోలీసుల దగ్గరున్న తుపాకులు లాక్కుని దాడి చేయడానికి ప్రయత్నించారని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపగా అందులో వాళ్ళు మరణించారని చెబితే ఏ ఒక్కరు, చివరికి ఆ చండాలుర కుటుంబ సభ్యులు కూడా నోరెత్తరు. 

వీళ్ళకి ఇది తగిన శిక్షేనా? అవును నిస్సందేహంగా! ఈ వెధవలు చేసింది మామూలు అత్యాచారం కాదు. చాలా పాశవికంగా హింసకి గురి చేశారు ఆమెని. చిన్న పేగు మొత్తం ఆ దాడిలో గాయపడి, కుళ్ళిపోతే డాక్టర్లు దానిని పూర్తిగా తొలగించి వేశారు. అత్యాచారం కేసుల్లో ఎప్పుడూ ఇంత హింస చూడలేదని ఆమెకి వైద్యం చేసే డాక్టర్లు చెప్పారు.

కన్నుకి కన్ను అన్నది ఆటవిక న్యాయం కదా? అయితే కానివ్వండి. నాగరీక న్యాయం పని చేయనప్పుడు ఆటవిక న్యాయమే సరయినది. అయినా న్యాయం, చట్టం అనేవి మనుషులకి వర్తిస్తాయి కానీ జంతువులకి కాదు. ఇలా నిందితులని చంపడం ఈ సమస్యకి పరిష్కారమా? కాకపోవచ్చు. మగవారి మైండ్ సెట్ మార్చి, సమాజంలో ఆడవారికి భయం లేకుండా చేసే ఒక బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసే ప్రోగ్రాం ఒక పక్కన ఎవరయినా చేసేవరకూ ఇలాంటి కౄర మృగాలని ఏరి పారేస్తూ ఉంటే అది ఏ ఒక్క మగ పశువునయినా భయ పెట్టి, ఆడదాని మీద చేయి వేయడానికి భయపడేలా చేసి ఒక్క మానభంగాన్ని అయినా నిరోధించగలిగితే ఈ నిందితుల చావు మంచి ఘటనే కదా?

లెబనాన్‌లో రేపిస్టులకి విధించే శిక్షలు ఇవి


కొంత మంది చెబుతున్నట్లు వృషణాలు కోయడమో, పురుషాంగాన్ని కోసేయడమో వీరికి తగిన శిక్ష కాదు. అది వీరిలో రాక్షసత్వాన్ని మరింత పెంచి వీళ్లని ఇమ్కా పశువులని చేసి వీరిలో హింసా ప్రవృత్తిని ఎక్కువ చేస్తుంది. అప్పుడు వీరివల్ల సమాజానికి మరింత హాని జరుగుతుంది. అది మంచిది కాదు. నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న మన దేశానికి అయిదు మంది చావు వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని వీరిని కాల్చి పారేయడం ఒక్కటే పరిష్కారం. కనీసం ఇప్పటికి.

Thursday, December 20, 2012

2000 MP ఫోటోలో ఎవరెస్టు అందాలను చూడండి

2000 mega pixels ఫోటోలో ఎవరెస్ట్ అందాలను బంధించిన ఈ ఫోటోలో ఎర్ర వృత్తంలో శిఖరాన్ని అధిరోహిస్తున్న వారిని, పసుపు వృత్తంలో బేస్ కాంపునీ చూడవచ్చు.

Amazing two billion pixel photo lets you zoom into the heart of Mount Everest

 మీ ఓపికని బట్టి జూమ్ చేసుకొని ఈ అద్భుతమైన శిఖరంలో ఇంకా ఎన్నో అందాలని చూడవచ్చు. పూర్తి ఇంటరాక్టివ్ ఫోటో కోసం ఈ లింకుని క్లిక్ చేయండి.

https://s3.amazonaws.com/Gigapans/EBC_Pumori_050112_8bit_FLAT/EBC_Pumori_050112_8bit_FLAT.html

Tuesday, December 11, 2012

పిచ్ గురించ్ అంత రగడ ఎందుకురా పిచ్చి నా ---------


పిఛ్ గురించి ఈసారి జరిగినంత రగడ గతంలో ఎప్పుడూ జరగలేదేమోననిపిస్తోంది. అయితే ఈ రగడ భారత్ చేతిలో ఓడిపోయిన పర్యాటక జట్టు కెప్టెన్ నుండి కాక మన కెప్టెన్ దగ్గరనుండి కావడం ఇందులో విశేషం. క్రికెట్ జట్టు కెప్టెన్ అంటే మన దేశంలో శ్రీ మహా విష్ణువు పదకొండవ అవతారంతో సమానం. కాబట్టి అతను ఏం కోరితే అదల్లా దక్కడం ఇక్కడ ఆనవాయితీ. జట్టులో కోరుకున్న ఆటగాళ్ళు, మైదానంలో తనకు నచ్చిన పిచ్ ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మన స్పిన్నర్లు రెచ్చిపోవడంతో, ముంబాయిలో జరిగిన రెండవ మ్యాచ్‌కి కూడా స్పిన్ పిచ్ కావాలని పట్టు బట్టాడు ధోని. "మొదటి రోజు, మొదటి గంటా కాదు, మొదటి బంతి నుండే స్పిన్‌కి అనుకూలంగా ఉండి, మూడు రోజుల్లో ఫలితం వచ్చే పిచ్ కావాలి" అన్నది క్యూరేటర్‌కి అయ్యగారి అల్టిమేటమ్. అయ్యగారు కోరిన విధంగా పిచ్ రెడీ అయింది. ఫలితం కూడా మూడు రోజులా ఒక్క గంటలో వచ్చేసింది. కానీ గెలిచింది ధోని అండ్ కో కాదు, కుక్ సేన గెలిచింది. పిచ్ స్పిన్‌కి అనుకూలంగా ఉండాలని అడిగాడే కానీ, ప్రత్యర్ధి జట్టులో ఎవరూ స్పిన్నర్లు ఉండకూడదు అన్న నిబంధన పెట్టడం మర్చిపోయాడు బాస్. దానితో మన స్పిన్నర్ల కన్నా అవతలి జట్టులోని పనేసార్, స్వాన్‌లు పిచ్ అనుకూలించడంతో రెచ్చి పోయి బంతిని మెలికలు తిప్పడంతో మన వాళ్ళు చేతులెత్తేశారు.
   

ఏదో ఒకసారి అలా అయింది కానీ మళ్ళీ అలా జరగదులే అన్న ధైర్యంతో కలకత్తాలో జరిగే మూడవ మ్యాచ్‌కి కూడా తనకి నచ్చినట్లుగానే పిచ్ ఉండాలని ఆర్డరేశాడు ధోనీ భాయ్. అయితే ఈసారి ఇక్కడున్న క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ ఎన్నో యుద్ధములనారితేరిన ఎనభై మూడేళ్ళ భీష్ముడు. సాక్షాత్తూ సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే అతనికి లొంగలేదు. ఎవ్వరి మాటా వినని సీతయ్య టైపు. అభిమానులు అయిదు రోజులు మ్యాచ్ చూడాలని టికెట్లు కొంటారు. వాళ్ళని అలరించేలా పిచ్ ఉండాలి కానీ, మూడు రోజుల్లో ఫలితాన్ని తేల్చి పారేసేలా కాదు అన్నది ఈయన ఫిలాసఫీ. అయితే ఈ సారి సారధి గంగూలీ కాదని ధోనీ అని మర్చిపోయాడు ఈ పెద్దాయన. బిసిసిఐ అధ్యక్షుల వారి యాజమాన్యంలో ఉన్న చెన్నయ్ ఐపీఎల్ జట్టుకి కూడా ధోనీయే కెప్టెన్ అనీ అతన్ని దేశంలో క్రికెట్‌కి సంబంధించిన అందరూ కొత్త అల్లుడిలాగా చూసుకోవాలన్న ఇంగిత ఙానం కూడా ఈ పెద్దాయనకి లేకపోయింది. ధోనీ ఆఙని ఈయన తిరస్కరించడంతో ఈయన్ని పక్కన పెట్టి మరొక క్యూరేటర్‌ని తెప్పించారు క్రికెట్ పెద్దలు. దానితో తిక్క రేగిన ప్రబీర్ ముఖర్జీ ఒక నెల సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం మీడియకి ఎక్కి కంపు కావడంతో మళ్ళీ ముఖర్జీని బ్రతిమిలాడి మైదానంలోకి తీసుకొచ్చి, పిచ్ మాత్రం కొత్త క్యూరేటర్ ఆధ్వర్యంలో ధోనీ కోరినట్లుగానే తయారు చేయించారు. అయితే మ్యాచ్ ముగిశాక "కోరుకున్న పిచ్ దొరికినది, మ్యాచ్ పోయినది" అయ్యింది ధోని పరిస్థితి.
 
ఇప్పుడు ఈ సిరీస్‌లో మరొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. కనీసం దానిలో అయినా గెలిచి సిరీస్ సమం చేయాలి ధోని గ్యాంగ్. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్, బ్యాటింగ్ ఇలా దేనికి అనుకూలించే పిచ్ అయినా గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి, ఈ నాలుగో మ్యాచ్‌లో గెలవడానికి ధోనీ కొన్ని కొత్త డిమాండ్లు ముందుకి తీసుకు రావొచ్చు.

౧.ఈ మ్యాచ్‌కి రెండు పిచ్‌లు ఉండాలి. ఒకటి పూర్తి బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండాలి. దాని మీద భారత జట్టు బ్యాటింగ్ చేయాలి. ఇక ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు దాని పక్కన మరొక స్ట్రిప్ రెడీ చేసి దాన్ని పూర్తిగా బౌలీంగ్‌కి అనుకూలించేలా చేయాలి.
౨. ప్రత్యర్ధి జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో మైదానం అంతా ఇసుకతో నింపాలి. దానివల్ల బంతి బౌండరీని చేరుకోకుండా ఉంటుంది. మన వాళ్ళు బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఆ ఇసుక తీసేసి, గ్రౌండ్‌లోని గడ్డి అంతా కత్తిరించి బంతి మెరుపులా బౌండరీ వైపు దుసుకెళ్ళేలాగా చేయవచ్చు.
౩. గల్లీ క్రికెట్ ఆడే పిల్లలు కొన్ని సార్లు రెండు సార్లు అవుటయితే కానీ అవుట్ కాదు అన్న రూల్ పెట్టుకుంటారు. అది మన వాళ్ళకి వర్తింపచేయాలి. అంటే ఇంగ్లాండ్ బౌలర్లు మనల్ని ఆలౌట్ చేయాలంటే ఒక్కో ఇన్నింగ్స్‌లో ఇరవై వికెట్లు తీయాలన్నమాట.

ధోనీ భయ్యా ఈ కోర్కెల లిస్టు శ్రీనివాసన్ గారికి పంపించు. ఎలాగోలా ఆయన వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.

Sunday, December 9, 2012

THE CURSE OF JAGAN MOHAN REDDY


1922లో లార్డ్ హోవార్డ్ కార్టర్ టుటాన్‌ఖామున్ పిరమిడ్‌లోని మమ్మీని పెట్టిన శవపేటికని తెరిచినప్పుడు చాలామంది ఆ మమ్మీని తెరిస్తే ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, ఆ మమ్మీ తన శాపాన్ని ఆ తెరిచిన వారిమీద ప్రయోగిస్తుందని భయపెట్టినా ఆ పురావస్తు శాస్త్రవేత్త భయపడలేదు. అయితే ఆయనకి ఏమీ కాకపోయినా ఆయన బృందంలోని కొంతమంది అనూహ్యంగా మరణించడమో ప్రమాదాలకి గురికావడమో జరిగింది. The Curse of Tutankhamun అని దీనిని వర్ణిస్తారు.
 
అలాగే The Curse of Hope Diamond అని మరొకటి ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక గుడిలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసి అందులోనుండి ఈ హోప్ వజ్రాన్ని ఒక ఫ్రెంచి దేశీయుడు తీసుకెళ్ళాడు. దీన్ని ఒక రష్యన్ ప్రభువుకి అమ్మిన కొన్నాళ్ళకే అతన్ని వేట కుక్కలు చంపేశాయి. ఈ వజ్రాన్ని కొన్న ఆ రష్యన్ ప్రభువు కూడా అకాల మరణం పాలయ్యాడు. అటు పిమ్మట దీన్ని చేజిక్కించుకొని తన కిరీటంలో అలంకరించుకొన్న ఫ్రెంచి రాజు పదహారవ లూయీ, అతని భార్య మేరీ అంటోనెట్‌లు ఫ్రెంచి విప్లవంలో గిలొటిన్ ద్వారా దాఋణంగా చంపబడ్డారు.
 
ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇలాంటిదే The Curse of Jagan Mohan Reddy అని ఒకటి నడుస్తుందని జగన్ వీరాభిమాని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అందుకు సమర్ధనగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. మొదటగా జగన్ పైన కేసు వేసిన శంకర్ రావు అత్యంత అవమానకర పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయబడ్డాడు. సాధారణంగా ఎవరినైనా మంత్రివర్గం నుండి తొలగించాలంటే ఆ విషయం చెప్పి వారి చేతనే గౌరవప్రదంగా రాజీనామా చేయించి సాగనంపుతారు. కానీ శంకర్ రావుని సస్పెండ్ చేసి పారేశారు.
 
తరువాత జగన్ పైన తీవ్ర విమర్శలు చేసి కడప పార్లమెంట్ స్థానానికి జగన్‌తో పోటీ పడ్డ డీఎల్ రవీంద్రా రెడ్డి, మంత్రిగా అధికారంలో ఉండీ డిపాజిట్ దక్కించుకోలేక పోవడమే కాకుండా, తన స్వంత అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా మెజారిటీ తెచ్చుకోలేకపోయాడు.

ఇక బొత్సా సత్యనారాయణ జగన్ మీద, వైఎస్ విజయమ్మ మీద ఇద్దరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. ఆయన మద్యం కుంభకోణంలో ఇరుక్కొని సీఎంతో కాళ్ళ బేరానికొచ్చి బయట పడ్డాడు.
 
జగన్ మీద కేసు పెట్టిన వారిలో మరొక ముఖ్యమైన వ్యక్తి తెలుగు దేశం నాయకుడు ఎర్రన్నాయుడు కారు ప్రమాదానికి గురయి ఏకంగా ఈ లోకం నుండే సెలవు తీసుకున్నాడు.
 
జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, ఆయన పైకి ఒంటికాలి మీద లేచిన మరొక వ్యక్తి నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి. వైఎస్ ఉన్నప్పుడు ఆయనకి వీర విధేయులుగా ఉండేవారు ఆనం సోదరులు. ఆ తరువాత వీరిలో పెద్ద వాడైన సింహపురి సోగ్గాడు వివేకా జగన్ పైన తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశాడు. ఆయన ఇప్పుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక కాస్పిటల్‌లో చికిత్స తీసుకొంటున్నారు. వివరాలు బయటకి రాకపోయినా ఎముకలకి చంబంధించిన కాన్సర్ అనీ ఒక వారం రోజుల్లో చికిత్స కోసం విదేశాలకి తరలించే అవకాశం ఉందనీ సమాచారం.

కాబట్టి ఇప్పుడు జగన్ వ్యతిరేకులు జాగ్రత్తగా ఉండాలేమో?!