నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, July 31, 2012

లండన్ షెర్లాక్ హోమ్స్‌ని మరిచి పోయింది ఎందుకో?


లండన్ ఒలింపిక్స్ ఓపెనింగ్‌ని Isles of Wonder అన్న థీమ్‌తో అధ్బుతంగా తీర్చి దిద్దాడు డర్శకుడు డానీ బోయెల్. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఇంగ్లాండ్ పల్లె వాతావరణాన్ని చూపించి సాంప్రదాయ వాదుల్ని, పరిశ్రమలు, అందులో చెమటోడ్చే కార్మికులనీ చూపించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించి వామ పక్ష భావాలున్న వారినీ ఇద్దర్నీ సంతృప్తి పరిచాడు. Quintessentially english అనిపించేవన్నీ చూపించాను అని చెప్పాడు ఈయన. అందులో భాగంగానే Great Ormond Street Hospital ని, హాస్య నటుడు మిస్టర్ బీన్‌గా టీవీపై నవ్వులు పూయించే Rowan Atkinson నీ, హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్‌ని, జేమ్స్ బాండ్‌ని ఇదే ప్రాతిపదికన ఈ ప్రారంభోత్సవంలో చూపించారు.
 
అయితే ఇందులో ఒక గొప్ప ఫిక్షనల్ కారెక్టర్‌ని మరిచి పోయారు. అది షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ సాహిత్యానికి ఉన్నత స్థాయి కల్పించిన ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ఈ అపరాధ పరిశోధకుడిని మించిన బ్రిటీషర్ ఎవరైనా ఉన్నారా? పద్దెనిమిదో శతాబ్ధి చివర్లో, ఇరవయ్యవ శతాబ్ధి మొదట్లో పాఠకులని విపరితంగా అలరించిన ఈ డిటెక్టివ్‌ని ఈ సందర్భంగా విస్మరించడం సరికాదేమో అని షెర్లాక్ హోమ్స్ అభిమానుల అభిప్రాయం.
 
అలాగే జేమ్స్ బాండ్ అనగానే అందరి మనసుల్లో మెదిలే సీన్ కానరీని కూడా డేనియల్ క్రెయిగ్‌తో కానీ అంతకన్నా ముందు కానీ చూపించి ఉంటే బావుండేదేమో. అసలు ఆ పాత్రకి గానీ ఆ సినిమాలకి గానీ అంత క్రేజ్ ఏర్పడింది అంటే అందులో సీన్ కానరీ పాత్ర ఎంతో ఉంది. 

Monday, July 30, 2012

తెలివి తక్కువగా ఉన్నాసరే రొమ్ములు మాత్రం పెద్దవిగా ఉంటే చాలట.


ఇప్పుడు టీవీల్లో ప్రకటనల్లోనూ, సినిమాలలోనూ కనిపించే అమ్మాయిలు సన్నగా పల్చటి పొట్టతో, ఎత్తైన వక్షాలతో, దొండ పండు పెదాలతో, తెల్లగా సున్నం కొట్టినట్లు ఉండే అందమైన పలువరసతో, కోటేరేసినట్లుండే ముక్కుతో తీర్చి దిద్దినట్లు కనిపిస్తూ అమ్మాయిలు అందరిమీద అలా కనిపించాలన్న ఒత్తిడి తెస్తున్నారు. అలా ఉంటేనే తాము అందంగా ఉన్నట్లు అన్న భ్రమలో అమ్మాయిలనే కాదు, నడి వయసు మహిళలని కూడా పడేస్తున్నారు. అందులో కనిపించె అందాలు మేకప్ ద్వారానో, ఆ మేని చాయ పోస్ట్ ప్రొడక్షన్‌లో అద్దిన డిజిటల్ మాయ అని, ఎత్తైన వక్షాలు ప్యాడింగ్ ద్వారా వచ్చినవి అని తెలుసుకోలేక పోతున్నారు.
   
ఈ మధ్య ఓ బ్రిటీష్ సంస్థ నిర్వహించిన సర్వేలో యాభై శాతం పైగా అమ్మాయిలు తమకి తెలివి తక్కువగా ఉన్నా సరే తమ వక్షాలు మాత్రం పెద్దవిగా ఉంటే చాలు అని కోరుకున్నారట. ఎందుకలా అంటే తమ తెలివికన్నా కూడా తమ రొమ్ముల సైజు బట్టే మగ వారు తమ పట్ల ఆకర్షితులవుతారని వారి వాదన. చాలా మంది అమ్మాయిలు పెద్ద రొమ్ముల కోసం తమ IQ ని వదులుకోవడం కోసం సిద్ధమే అని చెప్పారు. తమ తెలివికన్నా కూడా తమ వక్ష సౌందర్యమే ముఖ్యమని వారి భావన.
 
అమ్మాయిలు ఈ రకమైన అభిప్రాయాలతో ఉంటే రొమ్ముల సైజు పెంచడానికి, వాటి బిగువు పెంచడానికి ఆపరేషన్లు చేసే కాస్మెటిక్ సర్జరీ పరిశ్రమ మూడు రొమ్ములు, ఆరు ఆపరేషన్లుగా వర్ధిల్లుతూ ఉంటుంది.

Sunday, July 29, 2012

మిస్టర్ కాష్మోరా IPS


ఈ మధ్య పోలీసు బాసులకు క్షుద్ర విద్యల మీద పెరిగిన మోజు ఎంతగానో ఆహ్వానించదగ్గ పరిణామం. సాంప్రదాయ పోలీసింగ్‌తో పోలిస్తే ఇందులో చాలా అడ్వాంటేజీలున్నాయి. ఉదాహరణకి మొన్నటికి మొన్న చేతులకి కాళ్ళకి బేడీలు ఉన్నా పది మంది పోలీసులకి టోకరా ఇచ్చి పారిపోయిన సైకో సాంబడిని వందల మంది పోలీసులు వెదికినా పట్టుకోలేక పోయారు. అదే ఈ విద్యలతో ఒక శ్మశానంలో కూర్చుని ఒక అర్ధరాత్రినాడు ఏ చేతబడో, చిల్లంగో, కాష్మోరానో ప్రయోగించామనుకోండి. ఎక్కడ ఉన్నా రక్తం కక్కుకొని అక్కడికక్కడే చస్తాడు వెధవ. ఇదే విధంగా నిన్నటికి నిన్న తడ దగ్గర ఆర్టీసీ బస్సులో ముగ్గురిని నరికి చంపిన హంతకుడి ఆట కూడా కట్టించవచ్చు. 
మరింత పైలెవెల్లో ఆలోచిస్తే మన దేశంలో నేరాలు చేసి పాకిస్తాన్ వెళ్ళి తల దాచుకొనే దావూద్ ఇబ్రహీమ్, లష్కర్, ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాదులని కూడా ఇక్కడి నుంఛే ఫినిష్ చేసి పారేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాక దాన్ని చూపించి అమెరికా హిట్ లిస్టులో ఉన్న తాలిబాన్, ఆల్ ఖైదా ఉగ్రవాదులని చంపడానికి అమెరికా వాళ్ళతో మిలియన్, బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదుర్చుకొని వాళ్లని చంపడం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం సంపాదించవచ్చు. 
 


కాబట్టి మన బాసులు వెంటనే విషాచి, కాద్రా, దార్కా, మంత్ర ద్రష్ట, తంత్ర లాంటి పేరు మోసిన మాంత్రికులని వెతికి పట్టుకొని వాళ్ళని పోలీస్ విభాగంలో ఉద్యోగులుగా చెర్చుకుని పని మొదలు పెడితే మంచిదేమో. ఎవరయినా నేరగాడు ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు వీళ్ళు వెంటనే శ్మశానానికి వెళ్ళి తమ పని మొదలు పెడుతారు. అందుకు వీలుగా ప్రతి ఊరిలో శ్మశానంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి దానికి వీరిని ఇన్‌చార్జిగా నియమిస్తే సరిపోతుంది.

Friday, July 27, 2012

బట్టలు విప్పగానే దేవత అయిపోతుందా?


షెర్లిన్ చోప్రా అన్న పేరు పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. బాలీవుడ్ నటి, మోడల్ అయిన ఈ అమ్మడు పుట్టింది హైదరాబాద్‌లోనే. మెహిదీ పట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువులో టాపర్ అయిన ఈమె చదువు మీద ఆసక్తి లేక మోడలింగ్ రంగంలో ప్రవేశించి, ఆ పిమ్మట అడపా దడపా కొన్ని సినిమాలలో నటించింది. ఏ ఫిల్మ్ బై అరవింద్ అన్న సినిమాలో కూడా నటించింది ఈమె. ఆ తరువాత కొన్ని బాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలలో నటించినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి కొన్ని అసలు విడుదలకి నొచుకోక కొన్ని ఫట్ అవడంతో ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కాలని అందుకు బట్టలు విప్పి పారేయడమే మార్గం అని ఈ జనవరి 12న తన ట్విట్టర్ అకౌంట్‌లో( @SherlynChopra) ఒక నగ్న చిత్రాన్ని పెట్టింది. అయితే ట్విట్టర్ ఆ చిత్రాన్ని తొలిగించింది. 
  
అయితే ఇప్పుడు ఈ అమ్మడిని బాలీవుడ్ దేవత అని, బాలీవుడ్ దిగ్గజం (bollywood legend) అని ఒక అమెరికా పత్రిక కీర్తించింది. ఈమె బాలీవుడ్‌లో నటించింది సరిగ్గా ఎనిమిది సినిమాలు. అందులో ఆరింటిలో మోనా చోప్రాగా, ఒక దానిలో మేనకా చోప్రాగా, సహాయ పాత్రలో నటించిన దిల్ బోలే హడిప్పా అన్న సినిమాలో ఒక దానిలో మాత్రమే తన అసలు పేరు షెర్లిన్ చోప్రాతో నటించిన ఈమె Bollywood Goddess, Bollywood Legend ఎలా అయిందా అని ఆశ్చర్యం కలిగితే తప్పు లేదు. అసలు లెజెండ్ అన్న బిరుదు అందరికీ ఇవ్వరు. ఎన్నో సినిమాలలో విలన్‌గా, సహాయ నటుడిగా, హీరోగా నటించి, నిర్మాతగా విజయవంతమైన సినిమాలు తీసిన మోహన్ బాబుని ఆ మధ్య తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలలో లెజెండ్ జాబితాలో కాకుండా సెలబ్రిటీగా లెక్కేస్తే పెద్ద గొడవ అయింది.
 
ఈ చోప్రా చిన్న దానికి ఇంత పెద్ద పెద్ద తోకలు తగిలించింది ప్లేబాయ్ అన్న అమెరికా పత్రిక. ఇది ఒక బూతు పత్రిక లాంటిది. అమ్మయిల అర్ధ నగ్న, ముప్పావు నగ్న, పూర్తి నగ్న చిత్రాలతో వెలువడే ఈ పతికలో ప్రతి సంచికలో playmate of the month అని ఒక్కో నెల ఒక్కో అమ్మాయి బొమ్మలు వేస్తారు. మార్లిన్ మన్రోతొ మొదలుకొని చాలా మంది హాలీవుడ్ సుందరాంగులు అందాల రాణులు ఈ పుస్తకాని అలంకరించారు. అప్పట్లో మన ఐశ్వర్యా రాయ్‌కి కూడా ఈ పత్రిక ఆఫర్ ఇచ్చిందనీ, అయితే ఆమె నో అందని కూడా వార్తలొచ్చాయి. 
  
అయితే ఇప్పుడు షెర్లిన్ చోప్రా ప్లేబాయ్ ప్లేమేట్ ఆఫ్ ది మంత్ కోసం తన బట్టలు విప్పి పూర్తి నగ్నంగా ఫోటోలు దిగింది. నవంబర్ 2012 సంచికలో ఆ ఫోటోలు రానున్నాయి. ప్లేబాయ్ తన వెబ్ సైట్‌లో ఈ సుందరిని బాలీవుడ్ లెజెండ్ అని, బాలీవుడ్ దేవత అని ఆకాశానికి ఎత్తేసింది. ఏమిటో బట్టలు విప్పగానే దేవతలు అయిపోతారేమో?