నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, July 31, 2012

లండన్ షెర్లాక్ హోమ్స్‌ని మరిచి పోయింది ఎందుకో?


లండన్ ఒలింపిక్స్ ఓపెనింగ్‌ని Isles of Wonder అన్న థీమ్‌తో అధ్బుతంగా తీర్చి దిద్దాడు డర్శకుడు డానీ బోయెల్. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఇంగ్లాండ్ పల్లె వాతావరణాన్ని చూపించి సాంప్రదాయ వాదుల్ని, పరిశ్రమలు, అందులో చెమటోడ్చే కార్మికులనీ చూపించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించి వామ పక్ష భావాలున్న వారినీ ఇద్దర్నీ సంతృప్తి పరిచాడు. Quintessentially english అనిపించేవన్నీ చూపించాను అని చెప్పాడు ఈయన. అందులో భాగంగానే Great Ormond Street Hospital ని, హాస్య నటుడు మిస్టర్ బీన్‌గా టీవీపై నవ్వులు పూయించే Rowan Atkinson నీ, హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్‌ని, జేమ్స్ బాండ్‌ని ఇదే ప్రాతిపదికన ఈ ప్రారంభోత్సవంలో చూపించారు.
 
అయితే ఇందులో ఒక గొప్ప ఫిక్షనల్ కారెక్టర్‌ని మరిచి పోయారు. అది షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ సాహిత్యానికి ఉన్నత స్థాయి కల్పించిన ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ఈ అపరాధ పరిశోధకుడిని మించిన బ్రిటీషర్ ఎవరైనా ఉన్నారా? పద్దెనిమిదో శతాబ్ధి చివర్లో, ఇరవయ్యవ శతాబ్ధి మొదట్లో పాఠకులని విపరితంగా అలరించిన ఈ డిటెక్టివ్‌ని ఈ సందర్భంగా విస్మరించడం సరికాదేమో అని షెర్లాక్ హోమ్స్ అభిమానుల అభిప్రాయం.
 
అలాగే జేమ్స్ బాండ్ అనగానే అందరి మనసుల్లో మెదిలే సీన్ కానరీని కూడా డేనియల్ క్రెయిగ్‌తో కానీ అంతకన్నా ముందు కానీ చూపించి ఉంటే బావుండేదేమో. అసలు ఆ పాత్రకి గానీ ఆ సినిమాలకి గానీ అంత క్రేజ్ ఏర్పడింది అంటే అందులో సీన్ కానరీ పాత్ర ఎంతో ఉంది. 

No comments: