నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 24, 2011

BALAYYA STRIKES BACK

ఇంటర్నెట్‌లో జోకులకు సబ్జక్టుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాల కృష్ణది ఒక ప్రత్యేక స్థానం. నానా రకాల జోకులు, కార్టూన్లతో బాలయ్య దుంప తెంచారు నెటిజెన్లు. ఒక దశలో బాలయ్యకి కాలినట్లయి పొలీసు కంప్లయింట్ ఇచ్చేదాకా పోయింది వ్యవహారం.


 
    


 అయితే ఇప్పుడు బాల కృష్ణ అభిమానులు జూలు దులిపారు. బాల కృష్ణ, జూనియర్, సీనియర్ ఎంటీయార్ ముగ్గుర్నీ కలిపి హోల్‌సేల్‌గా ఎత్తేస్తున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు నెట్‌లో షికారు చేస్తున్నాయి.


         

Wednesday, November 23, 2011

రోడ్డు మీద ప్రపంచ కప్ చేత పట్టుకొని ఆటో కోసం ఎదురు చూస్తున్న ఛాంపియన్లు


మూడు రోజుల క్రితం లూధియానాలో జరిగిన కబడ్డి ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు మీద గెలిచి ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన భారత మహిళా జట్టుని మేనేజ్‌మెంట్, ఆర్గనైజింగ్ కమిటీలు దారుణంగా అవమానించాయి. జట్టు సభ్యులు ఇళ్లకి వెళ్ళడానికి కనీసం రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ అమ్మాయిలు కప్ పట్టుకొని రోడ్ మీద ఆటో కోసం ఎదురు చూస్తూ నించున్నారు. కొందరయితే నడిచే వెళ్ళారు.అలాగే క్రీడాకారులు బస చేసిన హోటల్‌లో వీరి భోజనానికయిన బిల్లు చెల్లించక పోవడంతో డబ్బులు కడితే కానీ రూమ్స్ ఖాళీ చేయడానికి వీల్లేదని  పార్క్ ప్లాజా హోటల్ యాజమాన్యం పట్టుబట్టడంతో రెండు గంటలు హోటల్ లాబీలో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు స్పందించిన టీమ్ మేనేజ్‌మెంట్ హోటల్ వారికి బకాయి పడ్ద 22 వేల రూపాయలు చెల్లించడంతో బతుకు జీవుడా అని బయటకొచ్చారు.


అంతకు రెండు రోజుల ముందు ఈ క్రీడా కారిణులు ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో చాలా మంది లగేజ్ కూడ అందులో కాలి పోయింది. దానితో చాలా మంది ఒంటి మీదున్న ఒక జత బట్టల తోనే వారమంతా గడిపారు. జట్టు మేనేజ్‌మెంట్‌కి వారికి మరొక జత బట్తలు కొనడానికి కూడా వీలు కాలేదేమో పాపం!


కొద్దిలో కొద్దిగా మెరుగు ఏమంటే ప్రపంచ కప్ గెలిచిన పురుషుల, మహిళల జట్లలో సభ్యులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి పంజాబ్‌లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీ దళ్ బీజేపీ ప్రభుత్వం హామీ ఇవ్వడం.

Monday, November 21, 2011

ఎవరన్నారు టెస్ట్ క్రికెట్ ఆసక్తికరంగా ఉండదని?


ఇంతకు ముందే ముగిసిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా మ్యాచ్ చూశాక మరొక సారి తెలిసి వచ్చింది అస్సలు క్రికెట్ అంటే టెస్ట్ క్రికెట్టే అని. వెస్టిండీస్‌తో మన వాళ్ళు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లకూ అస్సలు ప్రేక్షకులే లేకపోవడంతో ఈ ఫార్మాట్‌లో క్రికెట్ ఎక్కువ కాలం మనలేదేమో అని భయం వేసింది కానీ, ఇలాంటి మ్యాచ్‌లు మరొక అయిదారు జరిగితే మళ్ళీ అసలయిన క్రికెట్ ప్రేమికులు ఈ అయిదు రోజుల వెర్షన్‌ని మళ్ళీ ఆదరించరూ?

 
చివరిలో డేల్ స్టెయిన్ వెసిన ఓవర్లో ప్యాట్ కమ్మిన్స్ కొట్టగా బుల్లెట్‌లా దూసుకు వచ్చిన బంతిని స్టెయిన్ పట్టుకొని ఉండి ఉంటే నరాలు తెగిపోయే ఉత్కంఠ వచ్చేది కదా?


మొత్తానికి ఇరు జట్లు సమంగా ప్రతిభ చూపిన సిరీస్ ఇలా డ్రాగా ముగియడమే సమంజసం. 

Sunday, November 20, 2011

పిరుదులు పెంచడానికి సిమెంటు, కారు టైర్లు పంచర్లు వేసే మిశ్రమాన్ని ఇంజెక్షన్ చేసిన అమెరికన్ శంకర్ దాదా


నకిలీ డాక్టర్లు ఆపరేషన్స్ చేయడం మన లాంటి దేశాల్లోనే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. అమెరికాలాంటి అన్ని చట్టాలు పటిష్టంగా ఉన్న దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శంకర్ దాదాలు అక్కడ కూడా ఉన్నారు. 


ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రొమ్ములు పెద్దవి చేసుకోవడమే కాకుండా పిరుదుల భాగం పెద్దవిగా గుండ్రంగా చేసుకోవడం అన్నది లేటెస్టు ట్రెండులాగా కనిపిస్తుంది. అయితే శిక్షణ పొందిన సర్జన్ ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ పనిని కోందరు నకిలీలు తక్కువ ఖర్చుతో లాగించేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడవేషంలో ఉండే ఓనీల్ రాన్ మోరిస్ అనే ట్రాన్స్ జెండర్ పిరుదులని పెంచడానికి సిమెంటు, పంచరయిన టైర్లని సీలు వేయడానికి వాడే మిశ్రమాన్ని కలిపి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించే విధానం ఒకటి కనిపెట్టాడు. తను కూడా అదే పద్దతిలో తన పిరుదులని పెంచుకున్నానని చెప్పి, చూపించి, ఒక అమ్మాయితో 35 వేల రూపాయలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని వైద్యం చేశాడు. ఆ అమ్మయికి ఇంజెక్షన్ చేసిన దగ్గర తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు ఈ "సరికొత్త" పద్దతి గురించి తెలుసుకొని షాక్ తిని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు  కెసు నమోదు చేసి ఈ నకిలీ డాక్టరుని జైల్లో పెట్టారు.


Oneal     Dangerous: The cocktail injected into the woman's buttocks included cement
నకిలీ డాక్టరు/డాక్టరమ్మ            ఇంజెక్షన్ చేసిన మిశ్రమం

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లండన్‌కి చెందిన క్లాడియా అడెరోటిమి అనే విద్యార్ధిని ఇలాగే ఒక నకిలీ డాక్టరు దగ్గర పిరుదుల్లోకి ఇంజెక్షన్ తీసుకొని దాని వల్ల కలిగిన కాంప్లికేషన్స్‌తో మరణించింది. పోయిన సంవత్సరం అమెరికాలోనే, మియామికి చెందిన అనా జోసెఫా సెవిల్లా అనే ఒక నకిలీ డాక్టరు పిరుదుల్లోకి ఇంజెక్షన్ ఇచ్చే ప్రాక్టీసు చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు.
Image conscious: Friends said Miss Aderotimi was desperate to obtain the perfect curvy figure and had been rejected from one Hip Hop video for wearing padded trousers Image conscious: Friends said Miss Aderotimi was desperate to obtain the perfect curvy figure and had been rejected from one Hip Hop video for wearing padded trousers
                           క్లాడియా అడెరోటిమి


Breast aumrntation తరువాత ఆడవారు ఇటీవల ఎక్కువగా చేయించుకుంటున్నది పిరుదులు పెద్దగా, గుండ్రంగా కనిపించేలా చేసే buttock augmentation ఆపరేషన్. దీనిలో కూడ ఎక్కువ మంది అమ్మాయిలు అమెరికన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఇటీవల బ్రిటన్ యువరాజు విలియమ్ పెళ్ళాడిన కేట్ మిడిల్‌టన్ చెల్లెలు పిప్పా మిడిల్‌టన్, న్యూయార్క్ సోషలైట్ కిమ్ కర్డాషియన్‌లను పోలి ఉండేలా తమ పిరుదులని డిజైన్ చేయించుకుంటున్నారట. మియామీలోని ప్లాస్టిక్ సర్జన్ క్రిస్టియానో మెండియేటా అయితే Pippa Butt Lift అని ఈ ఆపరేషన్‌కి ఒక పేరు కూడా పెట్టి ఎడా పెడా అమ్మాయిల వెనుక భాగాన్ని మార్చేస్తున్నాడట.
    ఇంత విషయం ఉంది కాబట్టే జెన్నిఫర్ లోపెజ్ తన వక్షాలని వంద మిలియన్ డాలర్లకి ఇన్స్యూర్ చేస్తే, కాళ్ళని పిరుదులనీ కలిపి మూడు వందల డాలర్లకి ఇన్స్యూర్ చేసింది.  

Sunday, November 13, 2011

జగన్ మోహన్ రెడ్డి గారూ, ఆ పోజు కొంచెం మార్చండి ప్లీజ్.


ప్రతి రోజూ మా ఇంటికి హిందూ కన్నా సాక్షి ముందుగా వస్తూండడం వలన, మాతృ బాష మీద అభిమానం వలన సాక్షి పూర్తిగా తిప్పడం నాకు తప్పడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక పెళ్ళికో, చావుకో మరేదో ఫంక్షన్‌కి హాజరయిన జగన్ ఫోటో ఒకటయినా ఎదో ఒక పేజీలో ఉండి తీరుతుంది. సరే, పత్రిక అన్నది కాబట్టి అన్న ఫోటో ఉంటే తప్పేమీ లేదనుకోండి. అయితే ప్రతి ఫోటోలోనూ అన్న పోజు ఒకేలాగా చూసి చిరాకెత్తుతూంది.
  

మెడ ఒకవైపు వంచి తల ఒక వైపు వాల్చడం, రెండు చేతులు మోచేతుల వద్ద ముడిచి ఒక చెత్తో మరొక చేతి వేళ్ళు పట్టుకొని పెదాలు తెరవకుండా, మరికొన్ని సెకన్లలో బాత్‌రూమ్‌కి వెళ్ళాల్సిన వాడిలా ఒక బలవంతపు నవ్వు పులుముకొని అదే పోజుతో కాకుండా కొత్త పోజు పెట్టమని ఎవరయినా అన్నతో చెబితే బావుణ్ణు.

Saturday, November 12, 2011

ఆన్ లైన్‌లో పరిచయమైన అమ్మాయిలు రూమ్‌కి పిలిస్తే వెళ్ళాడు, కట్టేసి ఒళ్ళంతా కోసి పెట్టారు


ఒకప్పట్లో యండమూరి వీరేంద్రనాధ్ నవల వెన్నెల్లో ఆడపిల్ల పాఠకులని విపరీతంగా ఆకట్తుకున్నది. అందులో చదరంగంలో గ్రాండ్ మాస్టర్‌కీ ఒక అమ్మాయికీ ఫోన్‌లో జరిగే పరిచయం, ఆ అమ్మాయి తనెవరో చెప్పకుండా తనెక్కడ ఉంటుందో, ఎలా కలుసుకోవాలో ఫోన్‌లో గణిత ఫార్ములాలు ఉపయోగించి సాల్వ్ చేసే క్లూలు ఇచ్చి హీరోని పరీక్షిస్తూ ఉంటుంది. హీరో కూడా మామూలుగా యండమూరి నవలల్లో ఉన్నట్టుగానే మేధావి కావడం వల్ల ఇట్టే సాల్వ్ చేసి పారేసి, కొన్ని కాకతాళీయ పరిస్థితుల మూలంగా ఆమెని కలుసుకోవడం మిస్సవుతూ ఉంటాడు. ఇలా మూడు వందల పేజీలు ఒకరినొకరు కలుసుకోకుండా గడిపేస్తారు.
 


ఆ తరువాత అదే ఆంధ్ర భూమి వీక్లీలోనే పయనమయే ప్రియతమా అని బొమ్మదేవర నాగకుమారి రాసిన ఒక సీరియల్‌లో కూడా హిరో హీరోయిన్లు చాలా వారాలు కలం స్నేహంతో పరిచయమయి అలానే ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఉత్తరాలు పోయి సోషల్ వెబ్ సైట్లు వచ్చేశాయి. వాటి ద్వారా పరిచయాలు ఏర్పడి వాటికే పరిమితమయేవి కొన్నయితే ఆ పరిచయాలు పెరిగేవి కొన్ని ఉంటాయి. కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఏర్పడే ఈ పరిచయాలు విపరీత పరిణామాలకి దారి తీస్తాయి. ఒక ఉదాహరణ చూడండి.

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌లో జరిగిన సంఘటన ఇది. ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాడు(అతని పెరు పోలీసులు బయట పెట్టలేదు) ఒక అమ్మాయితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పరచుకొన్నాడు. ఆ అమ్మాయి, ఆమెతో కలిసి ఉంటున్నరూమ్‌‌మేట్ ఇతన్ని తమ ఫ్లాట్‌కి రమ్మని ఆహ్వానించారు. ఎరగా సెక్స్ ఆశ చూపించారు. దానితో ఇతగాడు ఆశగా వారి ఫ్లాట్‌కి వెళ్ళాడు. ఆక్కడికి వెళ్ళాక మొదలయింది నరకం. 
 Under investigation: Room-mates Rebecca Chandler, left, and Raven Larrabee, 20, have been arrested after a teenage boy told police he had been tortured during a satanic sex marathon
   రెబెక్కా చాండ్లర్, రేవన్ లారాబీ


వెరయిటీ సెక్స్ అని చెప్పి ఇతని కాళ్ళూ చేతులు కట్టి వేశారు. ఇదేదో తమాషా ఆట అని అనుకున్న అతన్ని రెబెక్కా చాండ్లర్,రేవన్ లారాబీ అనే ఈ ఇద్దరు అమ్మాయిలు రెండు రోజులపాటు బ్లేడు పెట్టి  వొళ్లంతా గాట్లు పెట్టి స్వర్గంలో విహరించాలని వచ్చిన చిన్న వాడికి నరకం ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఎట్టకేలకు బయట పడి పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి ఆ ఫ్లాట్‌లో చూడగా The Werewolf's Guide to Life, The Necromantic Ritual Rule Book, Intro to Sigilborne Spirits లాంటి క్షుద్ర విద్యల పుస్తకాలు కనిపించాయి. 
Discovered: Odd books including 'The Werewolf's Guide to Life' were found in the pair's apartment  


చేతులు కాళ్ళు కట్టేసి శృంగారం చేయడం, బ్లేడు పెట్టి కోయడం ముగ్గురూ ఇష్టపడే ప్రారంభించామనీ, మధ్యలో అడ్డం తిరిగి ఆ అబ్బాయికి కొన్ని గాట్లు ఎక్కువ పడ్డాయని ఆ అమ్మాయిలు పొలీసులతో చెప్పారు. పోలీసులు తలలు పట్టుకొని అతన్ని హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం ముదలు పెట్టారు.Wednesday, November 9, 2011

కడప పెద్ద దర్గా


ఏ.ఆర్. రెహ్‌మాన్ కడప పెద్ద దర్గాని దర్శించుకున్నాక ఆస్కార్ అవార్డు గెలిచాక ఈ దర్గా బాగా పాపులరయింది. ఆ తరువాత ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, మగధీర సినిమాకి ముందు రామ్ చరణ్ తేజ ఈ దర్గాని దర్శించుకోవడం, మగ ధీర సూపర్ డూపర్ హిట్ కావడంతో మతాలకి అతీతంగా ఈ దర్గాకి సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. ఎందరు వచ్చినా ఈ దర్గాకి పెట్టని బ్రాండ్ అంబాసడర్ రెహ్మానే. "నెలకి ఒకసారయినా ఆయన వచ్చిపోతూ ఉంటాడు" అని చెప్పాడు దర్గాలో ఉండే ఇమామ్.ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ కోరిక కోరినా తీరుతుంది అన్న నమ్మకం ఉండడంతో, రెహ్మాన్, రామ్ చరణ్‌ల విషయంలో అది నిజం కావడంతో ఇటీవల ఈ దర్గాకి మతాలతో సంబంధం లేకుండా భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ఈ దర్గాకి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పీరుల్లా హుస్సేని, అరీఫుల్లా హుస్సేని అనే ఇద్దరు ముస్లిం సాధువుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఖ్వాజా పీరుల్లా హుస్సేని, ఈయన్ని పీరుల్లా మాలిక్ అని పిలుస్తారు, 16వ శతాబ్ధిలో కర్ణాటకలోని బీదర్‌లో జన్మించాడు. ఈయన మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వాడు అంటారు. సూఫీ మతానికి చెందిన సాధువుల సమాధులను దర్శించుకుంటూ అజ్మీర్‌‍లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించుకున్నప్పుడు కడప ప్రాంతానికి వెళ్ళమని ఆగ్న లభించిందట. అలావస్తూ ప్రస్తుత చెన్నూరు దగ్గర పెన్నా నది ఒడ్డున విడిది చేసి ఉన్నప్పుడు సిద్ధవటం నవాబు నేక్ నామా సాహెబ్ ఈయన్ని దర్శించుకొని ఆశీస్సులు పొందాడు. ఆ నవాబు పీరుల్లా మాలిక్ ఉండడానికి తగిన సదుపాయాలను కల్పించగా అక్కడే ఉండి శాంతి, కరుణ, సామరస్యం అందరికీ బోధిస్తూ ఉన్నాడు పీరుల్లామాలిక్.


ప్రచారంలో ఒక కథ ప్రకారం అతి తక్కువ కాలంలో ఈయనకి వచ్చిన పేరు కొందరు ముస్లిం పెద్దలకు నచ్చక వారు ఈయన మోసగాడు అని ప్రచారం చేసి, ఏదైనా అద్భుతం చూపిస్తేనే నిన్ను నమ్ముతాం అని చాలెంజ్ చేశారు. అప్పటికప్పుడు భూమి విడిపోయి పీరుల్లా మాలిక్‌ని తనలో కలిపేసుకుందట. ఇది జరిగింది 1716ల, మొహర్రం నెల పదవ రోజున. అలా జీవ సమాధి అయిన పీరుల్లా మాలిక్ మూడు రోజుల తరువాత బయటకి వచ్చి ప్రార్ధనలు చేయడం భక్తులు చూశారు. దాంతో పీరుల్లా మాలిక్ శక్తి మీద అందరికీ అనుమానాలు తొలిగి పోయాయి. ఆ తరువాత కాలంలో నవాబ్ అబ్దుల్ హమీద్ ఖాన్ ఆయనకి ఒక సమాధి కట్టించారు. ఇప్పుడు పెద్ద దర్గాలో తూర్పు వైపు ఈ సమాధి ఉంది.


పీరుల్లా మాలిక్‌కి ఇద్దరు కొడుకులు. వీరిలో ఒకరు అరీఫుల్లా హుస్సేన్. ఈయన కూడా నాన్నగారి బాటలో నడిచాడు. ఈయన మనవడు అరీఫుల్లా హుస్సేన్-2. పీరుల్లా మాలిక్‌లాగా ఈయన కూడా సూఫీ తత్వవేత్తగా బాగా పేరు గడించాడు. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం ఒకసారి తన పూర్వీకుల సమాధులు దర్శించుకోవడానికి ఈయన బీదర్ వెళ్ళాడు. అక్కడ ఉన్న కాపలాదారు ఈయన్ని లోపలికి వెళ్ళనీయలేదు. గేటు ముందు నిలుచుని తాతా అని పిలవగానే సమాధి లోపల నుండి రా మనవడా అన్న పిలుపు వినిపించి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయట. ఈయన సమాధి కూడా ఇక్కడ ఉంది. ముస్లిం కాలెండర్ ప్రకారం అయిదవ నెలలో ఈయన పేరిట ఇక్కడ ఉరుసు జరుపుతారు. ఈ ఉరుసుకి దేశం నాలుగు మూలల నుండి భక్తులు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ ఉత్సవంలో భక్తులు ఆయన సమాధికి చద్దార్ అర్పిస్తారు. రెహ్మాన్, చరణ్ లాంటి సందర్శకులు ఈ సమాధి సందర్శించినప్పుడు వారి తలమీద పోటోలో కనిపించేది ఇదే.. "మీరు నాకు అది కావాలి, ఇది కావాలి అని ఆశించి ఇక్కడికి రావొద్దు. అల్లాని ప్రార్దించండి. మికు ఏం కావాలో ఆయనకి తెలుసు. అది మీకు దొరికేలా ఆయనే చేస్తాడు" అని చెప్పాడు ఒక సాధువు.
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు, నీలం సంజీవ రెడ్డి, మహ్మద్ రఫీ లాంటి వాళ్లు ఎందరో ఈ దర్గాని దర్శించుకున్న లిస్టులో ఉన్నారు.