నకిలీ డాక్టర్లు ఆపరేషన్స్ చేయడం మన లాంటి దేశాల్లోనే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. అమెరికాలాంటి అన్ని చట్టాలు పటిష్టంగా ఉన్న దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శంకర్ దాదాలు అక్కడ కూడా ఉన్నారు.
ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రొమ్ములు పెద్దవి చేసుకోవడమే కాకుండా పిరుదుల భాగం పెద్దవిగా గుండ్రంగా చేసుకోవడం అన్నది లేటెస్టు ట్రెండులాగా కనిపిస్తుంది. అయితే శిక్షణ పొందిన సర్జన్ ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ పనిని కోందరు నకిలీలు తక్కువ ఖర్చుతో లాగించేస్తున్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడవేషంలో ఉండే ఓనీల్ రాన్ మోరిస్ అనే ట్రాన్స్ జెండర్ పిరుదులని పెంచడానికి సిమెంటు, పంచరయిన టైర్లని సీలు వేయడానికి వాడే మిశ్రమాన్ని కలిపి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించే విధానం ఒకటి కనిపెట్టాడు. తను కూడా అదే పద్దతిలో తన పిరుదులని పెంచుకున్నానని చెప్పి, చూపించి, ఒక అమ్మాయితో 35 వేల రూపాయలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని వైద్యం చేశాడు. ఆ అమ్మయికి ఇంజెక్షన్ చేసిన దగ్గర తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు ఈ "సరికొత్త" పద్దతి గురించి తెలుసుకొని షాక్ తిని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు కెసు నమోదు చేసి ఈ నకిలీ డాక్టరుని జైల్లో పెట్టారు.


నకిలీ డాక్టరు/డాక్టరమ్మ ఇంజెక్షన్ చేసిన మిశ్రమం
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లండన్‌కి చెందిన క్లాడియా అడెరోటిమి అనే విద్యార్ధిని ఇలాగే ఒక నకిలీ డాక్టరు దగ్గర పిరుదుల్లోకి ఇంజెక్షన్ తీసుకొని దాని వల్ల కలిగిన కాంప్లికేషన్స్‌తో మరణించింది. పోయిన సంవత్సరం అమెరికాలోనే, మియామికి చెందిన అనా జోసెఫా సెవిల్లా అనే ఒక నకిలీ డాక్టరు పిరుదుల్లోకి ఇంజెక్షన్ ఇచ్చే ప్రాక్టీసు చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు.


క్లాడియా అడెరోటిమి
Breast aumrntation తరువాత ఆడవారు ఇటీవల ఎక్కువగా చేయించుకుంటున్నది పిరుదులు పెద్దగా, గుండ్రంగా కనిపించేలా చేసే buttock augmentation ఆపరేషన్. దీనిలో కూడ ఎక్కువ మంది అమ్మాయిలు అమెరికన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఇటీవల బ్రిటన్ యువరాజు విలియమ్ పెళ్ళాడిన కేట్ మిడిల్‌టన్ చెల్లెలు పిప్పా మిడిల్‌టన్, న్యూయార్క్ సోషలైట్ కిమ్ కర్డాషియన్‌లను పోలి ఉండేలా తమ పిరుదులని డిజైన్ చేయించుకుంటున్నారట. మియామీలోని ప్లాస్టిక్ సర్జన్ క్రిస్టియానో మెండియేటా అయితే Pippa Butt Lift అని ఈ ఆపరేషన్‌కి ఒక పేరు కూడా పెట్టి ఎడా పెడా అమ్మాయిల వెనుక భాగాన్ని మార్చేస్తున్నాడట.
ఇంత విషయం ఉంది కాబట్టే జెన్నిఫర్ లోపెజ్ తన వక్షాలని వంద మిలియన్ డాలర్లకి ఇన్స్యూర్ చేస్తే, కాళ్ళని పిరుదులనీ కలిపి మూడు వందల డాలర్లకి ఇన్స్యూర్ చేసింది.
5 comments:
మన దేశంలోలాగా నకిలీ డాక్టర్లు ప్రాక్టీసు చేయడం అమెరికాలో వీలు కాదు. అక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఇంతకీ ఈ ఇన్ఫర్మేషన్ నిజమేనని చెక్ చేసుకున్నారా KRISHNA గారూ?
ఇది Daily mail లాంటి బాగా పేరున్న పత్రికలలో వచ్చింది. కాబట్టి నకిలీ డాక్టర్లకి అమెరికా అతీతం కాదు.
ఆరు బాగా షేపున్న బటక్స్ ఫోటోలు పెట్టారు. వారి పెర్లు రాయలేదు. మధ్యలో ఉన్నది పిప్పా మిడిల్‌టన్ అని తెలుస్తూ ఉంది. కిందిది కిమ్ కర్డాషియాన్ కదా? చూడ్డానికి బాగానే ఉంది. అయితే ఈ అమ్మడితో 72 రోజులు కాపురం చేసి విడిపోయిన క్రిస్ హంఫ్రీస్ అనే మాజీ మొగుడు ఈ పిల్ల పిరుదులు సహజమైనవి కాదు, ఎప్పుడు బయటకి వెళ్ళాల్సి వచ్చినా ఒక గంట ప్యాడ్స్ పెట్టుకొని రెడీ చేసుకొంటుంది అని లోగుట్టు బయట పెట్టాడని చదివాను.
అయినా ఆ నకిలీ డాక్టరు గాడికి వెనకాల అదేమిటండీ లోపల ఫుట్‌బాల్ దాచిపెట్టినట్లు. ఏదో కార్టూన్‌లా ఉంది గానీ?
ఇండియాలో కూడా డాక్టర్లు తమ సర్టిఫికేట్లు ఫ్రేమ్ చేసి గోడకి తగిలించి డిస్ప్లే చెయ్యాలని రూల్ ఉంది.
Post a Comment