నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, November 13, 2011

జగన్ మోహన్ రెడ్డి గారూ, ఆ పోజు కొంచెం మార్చండి ప్లీజ్.


ప్రతి రోజూ మా ఇంటికి హిందూ కన్నా సాక్షి ముందుగా వస్తూండడం వలన, మాతృ బాష మీద అభిమానం వలన సాక్షి పూర్తిగా తిప్పడం నాకు తప్పడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక పెళ్ళికో, చావుకో మరేదో ఫంక్షన్‌కి హాజరయిన జగన్ ఫోటో ఒకటయినా ఎదో ఒక పేజీలో ఉండి తీరుతుంది. సరే, పత్రిక అన్నది కాబట్టి అన్న ఫోటో ఉంటే తప్పేమీ లేదనుకోండి. అయితే ప్రతి ఫోటోలోనూ అన్న పోజు ఒకేలాగా చూసి చిరాకెత్తుతూంది.
  

మెడ ఒకవైపు వంచి తల ఒక వైపు వాల్చడం, రెండు చేతులు మోచేతుల వద్ద ముడిచి ఒక చెత్తో మరొక చేతి వేళ్ళు పట్టుకొని పెదాలు తెరవకుండా, మరికొన్ని సెకన్లలో బాత్‌రూమ్‌కి వెళ్ళాల్సిన వాడిలా ఒక బలవంతపు నవ్వు పులుముకొని అదే పోజుతో కాకుండా కొత్త పోజు పెట్టమని ఎవరయినా అన్నతో చెబితే బావుణ్ణు.

4 comments:

Anonymous said...

ఏమో! ఒక్క ఫోటోనే ఫొటొషాప్ వాడి, వేరే వేరే సంధర్భాల ఫోటోల్లో చొప్పిస్తున్నారేమొ!

Anonymous said...

.....మరికొన్ని సెకన్లలో బాత్‌రూమ్‌కి వెళ్ళాల్సిన వాడిలా....Hilarious!

Anonymous said...

ఈ లింకు చూడుడి
http://epaper.sakshi.com/epaperimages/13112011/13112011-sh-hyd-2/D27936108.JPG

Anonymous said...

correct gaa cheppaaru,ade pose ,maarchu jagan annaa plz........