నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 27, 2012

బట్టలు విప్పగానే దేవత అయిపోతుందా?


షెర్లిన్ చోప్రా అన్న పేరు పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. బాలీవుడ్ నటి, మోడల్ అయిన ఈ అమ్మడు పుట్టింది హైదరాబాద్‌లోనే. మెహిదీ పట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువులో టాపర్ అయిన ఈమె చదువు మీద ఆసక్తి లేక మోడలింగ్ రంగంలో ప్రవేశించి, ఆ పిమ్మట అడపా దడపా కొన్ని సినిమాలలో నటించింది. ఏ ఫిల్మ్ బై అరవింద్ అన్న సినిమాలో కూడా నటించింది ఈమె. ఆ తరువాత కొన్ని బాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలలో నటించినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి కొన్ని అసలు విడుదలకి నొచుకోక కొన్ని ఫట్ అవడంతో ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కాలని అందుకు బట్టలు విప్పి పారేయడమే మార్గం అని ఈ జనవరి 12న తన ట్విట్టర్ అకౌంట్‌లో( @SherlynChopra) ఒక నగ్న చిత్రాన్ని పెట్టింది. అయితే ట్విట్టర్ ఆ చిత్రాన్ని తొలిగించింది. 
  
అయితే ఇప్పుడు ఈ అమ్మడిని బాలీవుడ్ దేవత అని, బాలీవుడ్ దిగ్గజం (bollywood legend) అని ఒక అమెరికా పత్రిక కీర్తించింది. ఈమె బాలీవుడ్‌లో నటించింది సరిగ్గా ఎనిమిది సినిమాలు. అందులో ఆరింటిలో మోనా చోప్రాగా, ఒక దానిలో మేనకా చోప్రాగా, సహాయ పాత్రలో నటించిన దిల్ బోలే హడిప్పా అన్న సినిమాలో ఒక దానిలో మాత్రమే తన అసలు పేరు షెర్లిన్ చోప్రాతో నటించిన ఈమె Bollywood Goddess, Bollywood Legend ఎలా అయిందా అని ఆశ్చర్యం కలిగితే తప్పు లేదు. అసలు లెజెండ్ అన్న బిరుదు అందరికీ ఇవ్వరు. ఎన్నో సినిమాలలో విలన్‌గా, సహాయ నటుడిగా, హీరోగా నటించి, నిర్మాతగా విజయవంతమైన సినిమాలు తీసిన మోహన్ బాబుని ఆ మధ్య తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలలో లెజెండ్ జాబితాలో కాకుండా సెలబ్రిటీగా లెక్కేస్తే పెద్ద గొడవ అయింది.
 
ఈ చోప్రా చిన్న దానికి ఇంత పెద్ద పెద్ద తోకలు తగిలించింది ప్లేబాయ్ అన్న అమెరికా పత్రిక. ఇది ఒక బూతు పత్రిక లాంటిది. అమ్మయిల అర్ధ నగ్న, ముప్పావు నగ్న, పూర్తి నగ్న చిత్రాలతో వెలువడే ఈ పతికలో ప్రతి సంచికలో playmate of the month అని ఒక్కో నెల ఒక్కో అమ్మాయి బొమ్మలు వేస్తారు. మార్లిన్ మన్రోతొ మొదలుకొని చాలా మంది హాలీవుడ్ సుందరాంగులు అందాల రాణులు ఈ పుస్తకాని అలంకరించారు. అప్పట్లో మన ఐశ్వర్యా రాయ్‌కి కూడా ఈ పత్రిక ఆఫర్ ఇచ్చిందనీ, అయితే ఆమె నో అందని కూడా వార్తలొచ్చాయి. 
  
అయితే ఇప్పుడు షెర్లిన్ చోప్రా ప్లేబాయ్ ప్లేమేట్ ఆఫ్ ది మంత్ కోసం తన బట్టలు విప్పి పూర్తి నగ్నంగా ఫోటోలు దిగింది. నవంబర్ 2012 సంచికలో ఆ ఫోటోలు రానున్నాయి. ప్లేబాయ్ తన వెబ్ సైట్‌లో ఈ సుందరిని బాలీవుడ్ లెజెండ్ అని, బాలీవుడ్ దేవత అని ఆకాశానికి ఎత్తేసింది. ఏమిటో బట్టలు విప్పగానే దేవతలు అయిపోతారేమో?

3 comments:

Anonymous said...

ante vaalla drushtilo "nagna devata" ano "srungara devata" ano artham mastaru. Bongulo publicity ki padipoye janalu ippudu takkuva mande lendi. no need to worry.

Anonymous said...

ayyuntundi. lekapote aavida photos meerenduku mee bloglo pettukuntaaru?!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అయితే బ్లాగులోక శ్రుంగార దేవత అందామా?