నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 26, 2012

బహుళ జాతి కంపెనీల దాడి నుంచి మనని మనం ఇలా కాపాడుకోవచ్చు


బహుళ జాతి కంపెనీలు చాపకింద నీరులా విస్తరించి జాతి సంపదని, దేశ వనరులనీ దోచుకొంటున్నాయన్నది ఏమాత్రం ఆలోచనా శక్తి ఉన్న వారయినా ఒప్పుకొనే సత్యం. బాగా బలిసిన ఈ కంపెనీలతో పోరాటం చేయడం అంత తేలిక కాదు, అందరివల్లా అయ్యే పని కూడా కాదు. అయితే వ్యక్తిగతంగా వీటితో పోరాటం కాకపోయినా ఈ కంపెనీల దోపిడీ బారి నుండి ఎవరికి వారు కొంత మేరకయినా తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు.
 
ముందుగా అందరి జేబులకి చిల్లు పెట్టి ఆరోగ్యానికి చిచ్చు పెడుతున్నవి శీతల పానీయాలు. "మా డ్రింకుతో దాహాం తీర్చుకోండి: అని "భుజాయే ప్యాస్" అని బాగా ఎండన పడి చెమటలు కక్కుతున్న మోడల్స్ ఈ డ్రింకులు తాగి దాహం తీరి చల్లబడుతున్న ప్రకటనలు చూపించి ఇవి దాహాన్ని తీర్చే పానీయాలుగా చూపించి డబ్బులు కొట్టేస్తుంటారు. కానీ ఆలోచిస్తే బాగా దాహం వేసినప్పుడు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ దాహాన్ని తీర్చవు, సరికదా నాలుక మీద నోటిలోనూ తడిని తగ్గించి అవి మరింత ఎండిపోయేలా చేసి దాహాన్ని పెంచుతాయి. ఎండన పడి వచ్చినప్పుడు చల్లని నీటిలో నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసుకొని తాగడాన్ని మించిన పని మరొకటి ఉండదులేదంటే లేత కొబ్బరికాయ నీటిని మించినా పానీయం మరొకటి ఉండదు.

ఏ సినిమా హాల్లోనో పిల్లల కోసం ఇవి కొనడం వేరే సంగతి. ఎండల్లో దాహాన్ని తీర్చే మాట శుద్ధ అబద్ధం. ఇక ఈ పానీయాల్లో ఉండే క్రిమి సంహార మందుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీటీవల్ల కలిగేమరో అనర్ధమేమిటంటే ఇవి ఎముకల్లో కాల్షియాన్ని తగ్గించి అవి మెత్త బడేలా చేస్తాయి.
 
"మీ పళ్ళు తలతలా మెరిసి పోవాలంటే క్రిస్టల్స్ ఉన్న మా పేస్టు వాడండి" అని ఆకర్షణీయంగా రంగుల్లో మెరిసి పోయే పేస్టు చూపుతారు. అయితే అందులో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నా బ్రష్ చేసి నీళ్ళతో కడుక్కున్నాక పళ్ల మీద నుంచి రాలిపావలసిందే. పళ్ళ ఆరోగ్యానికీ, వాటి మిలమిలకీ రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం, ప్రతి సారీ కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఒకటే మార్గం. అది బ్లాక్ అండ్ వైట్ పేస్టా మల్టి కలరా అన్నది ముఖ్యం కాదు. మామూలు తెల్ల పేస్ట్ వాడినా సరిగా వాడితే పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి.

  
"నీ సబ్బు స్లోనా" అని ఒక పిల్లవాడు తన స్నేహితుడిని అడుగుతాడు ఆ పిల్ల వాడు ఎక్కువ సేపు చేతులు కడుక్కోవాలి అని చెప్పినప్పుడు. లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ పదో పదిహేనో సెకన్లలో 95% సూక్ష్మజీవులని తొలగిస్తుంది ఆ ప్రకటన సారాంశం. కానీ ఇది పచ్చి అబద్ధం. ఆపరేషన్లు చెసే ముందు సర్జన్లు ఒకసారి సబ్బుతో ఒకట్రెండు నిముషాలు చేతులు కడుక్కున్నాక 10% అయోడిన్‌తో రెండు నిముషాలు కడుక్కొని ఆ తరువాత స్టెరీలియమ్ అన్న లిక్విడ్‌తో వాష్ చేసుకొని అప్పుడు స్పిరిట్ చేతుల మీద పొసుకుంటారు. ఇలా చేసినా అది 95% నుంచి 99% వరకే సూక్ష్మ జీవులని తొలగిస్తుంది అని ఎముకలు, కీళ్ళు, గుండె లాంటి ఆపరేషన్లలో చేతులకి రెండు జతల గ్లవ్స్ వేసుకుంటారు. అంచేత ఈ ఖరీదయిన హాండ్ వాష్ లిక్విడ్ చేసే పని మామూలు సబ్బుతో కొంచెం తాపీగా చేతులు కడుక్కొంటే ఆ సబ్బు కూడా చేస్తుంది.

No comments: