నిన్నా మొన్నా తెలుగు సినిమా వాళ్ళందరూ పైరసీకి వ్యతిరేకంగా వూదరొగొట్టేస్తున్నారు.ఏ చానల్లో చూసినా ఇదే వరస.నా మట్టుకు నాకైతే పైరసీ మీద ఎలాంటి కంప్లైంటూ లేదు. పైపెచ్చు పైరసీ అనేది మధ్య తరగతి వాళ్ళకు చాలా మేలు చేసే ఒక అవసరంలాగా తోచింది.
ఉదాహరణకు ఒక టౌన్లో, మెట్రో సిటీ కాదు, ఒక సాదా సీదా కుటుంబాన్ని తీసుకోండి.మొగుడు,పెళ్ళాం,ఇద్దరు పిల్లలు కలిసి సినిమాకి వెళ్ళి రావడానికి ఇంటర్వెల్లో కూల్ డ్రింకులతో కలిపి ఎంత లేదన్నా అయిదొందలు అవుతుంది. ఇంత పెట్టి సినిమాకి వెళ్తే అదొట్టి చెత్త అయితే ఎక్కడో కాల్తుంది కదా?అదే ఒక ముప్పయ్యో, ఇరవయ్యో పెట్టి పైరేటెడ్ సీడీ కొని చూస్తే ఆ సినిమా బాగా లేకపోయినా పెద్దగా భాదేమి ఉండదు కదా?
అయినా సినిమా బావుంటే ప్రేక్షకుడు హాలుకి వచ్చి సినిమా చూస్తాడని అరుంధతి,మగధీర నిరూపించాయి కదా?ఆ సినిమాలు గ్రాఫిక్స్ వల్లనే హిట్టయ్యాయి అనుకొన్నా అష్టా చెమ్మా,హ్యాపీ డేస్ లాంటి చిన్న సినిమాలూ,గ్రాఫిక్స్ మాయా జాలం లేని చిత్రాలు కూడా జనాన్ని హాలుకే రప్పించాయి కదా?
పైరసీ మీద పడి వూరికే ఏడ్చే కన్నా సినిమా వాళ్ళు తమ ఖర్చు కొంచెం తగ్గించుకో వచ్చు కదా?సూపర్ స్టార్ల రెమ్యూనరేషన్ ని తగ్గించవచ్చు. బొంబాయి పిల్లల కోసం పోయే బదులు అంత కన్నా అందగత్తెలు అయిన మన లోకల్ ఆడ పిల్లలకి అవకాశం ఇయ్యొచ్చు కదా? తెలుగెలా పలకాలో కూడా తెలియని ఏ ఉదిత్ నారాయణ్ నో తెచ్చి పాటల్ని ఖూనీ చేసే కన్నా లోకల్ టాలెంట్ కి చాన్సు ఇస్తే తక్కువ బడ్జెట్ లొ ఇరగ దీస్తారు కద?
ధియేటర్లు కూడా మొదటి వారమని చెప్పి టికెట్ రేటు పెంచి జన్నాన్ని భయపెట్టి తీరా ఆ వారం గడిచే లోగా సినిమాలో పస లేదని అందరికీ తెలిసి వెల వెల పోయే కన్నా కొంచెం రేటు తగ్గించి ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించుకోవడం తెలివైన పని కాదా?
6 comments:
నా ఓటు కూడా పైరసీకే. :).
I also vote for piracy for the simple reason that when piracy was not there, the very producers who are weeping now robbed money from us for selling VHS tapes and later CDs. I remember old movies were used to be sold for Rs.300+ Rs. 500+ as they liked. Now??? even original CDs are less than Rs.50-. How this turn around possible?? only because of piracy.
Thanks to piracy, the CD/DVDs rates have come down drastically. The rates should come down further and the Producers instead of weeping, should sell more CDs at lower rates and make their healthy profit by higher increased turnover.
yes i too agree.....watching online is much better....
సినీమ నిర్మాతలు,దర్శకులు,హీరో హీరోయిన్స్, థియేటర్ యజమానులు తమతమ లాభాలను తగ్గిచుకుంటే పైరసీ ఇంతగా వృద్ది చెందేదేకాదు.అసలు సినీమా నిర్మాణం పైరసీ లేకుండా జరుగుతోందా? ఎన్నిరకాల సాఫ్ట్వేర్లు పైరసీవి వాడకుం తున్నారో!
నేను పైరసి చూడను , సపోర్ట్ చేయ్యను కానీ మన తెలుగు సినీ పరిశ్రమ ని చూస్తే మాత్రం బాగా కాల్తుంది.. చేతకానీ వెధవలు దేనిమీదొ పడి ఏడుస్తున్నారు.
అందుకే తెలుగు పైరసి కి యెస్స్..
They are making films by copying Hollywood movies.So, misuse is everywhere.
If we think like this, then only we feel confident.
Post a Comment