నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, March 22, 2010

విజయం కౌగిలిలోంచి బయట పడి పరాజయాన్ని అందిపుచ్చుకున్న సూపర్ కింగ్స్

ఏదైనా మ్యాచ్ లో ఒక జట్టు ఆటగాళ్ళు అద్భుతంగా ఆడాల్సిన అవసరం వచ్చింది అంటే జట్టు పరాజయం ముంగిట్లో ఉంది అని అర్ధం.అప్పుడు ఆ జట్టు ఆటగాళ్ళు ఎక్స్ ట్రార్డినరిగ ఆడి జట్టుని అందులోంచి తప్పించాల్సిన అవసరం వస్తుంది.కానీ నిన్న ఇందుకు విరుద్ధంగా చెన్నై లో సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక తమాషా చోటు చేసుకొంది.తమ జట్టు విజయం ముంగిట్లో ఉన్న తరుణంలో చెన్నై ఆటగాళ్ళు అరివీర భయంకరమైన ఆట తీరుతో అపజయాన్ని స్వంతం చేసుకొన్నారు.

చెన్నై ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు పూర్తయ్యాక పరిస్థితి చూడండి.చిన్న లక్ష్యం,మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం,భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్,బంతికి ఒకటి కన్నా తక్కువ పరుగులు కావల్సి ఉంది....ఇలాంటి స్థితిలో ఏ జట్టైనా సింగిల్స్ తీస్తూ లూజ్ బాల్స్ వచ్చినప్పుడు బౌండరీలు సాధిస్తూ ఎలాంటి రిస్కూ లేకుండా లక్ష్యం వైపు తాపీగా నడుచుకొంటూ వెళ్తార్.కానీ చెన్నై వీరులు నడుచుకొంటూ వెళ్తే మజా ఏముంది అనుకొన్నారో ఏమో లక్ష్యం వైపు ఉసైన్ బోల్ట్ లాగా మెరుపు వేగతో పరుగెత్తాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు.

ఇంత చేసినా ఇన్నింగ్స్ చివరి రెండు బంతులు మిగిలి ఉండగా పరిస్థితి చూడండి.మ్యాచ్ తై లో ఉంది, ఇరు జట్ల స్కోరులు సమం,రెండు బంతులున్నాయి, చెన్నై నుండి ఎనిమిదో ఆటగాడు బంతిని ఎదుర్కొంటూ ఉంటే అవతలి వైపు మంచి హిట్టర్ గా పేరు గాంచిన మోర్కెల్ ఉన్నాడు.కొంచెం కామన్సెన్సు ఉన్న వాడెవరైనా ఆ బంతికి ఏదో ఒక విధంగా బ్యాటుని తాకించి అవతలి వైపుకి వెళ్ళాలనుకొంటాడు ఆ ప్రయత్నంలో పరుగు సాధిస్తే విజయం, అవుటైన పోయేదేమీ లేదు. తరువాతి బంతికి మోర్కెల్ లాంటి వాడు ఏదో ఒక విధంగా పరుగు సాధించగలడు.

స్కూలు క్రికెట్ స్థాయిలో ఇలాంటి సిచుయేషన్ వచ్చినప్పుడు పిల్లలు కూడా పాటించే స్ట్రేటజీ ఇది. అలాంటిది ఒక ఐ పీ ఎల్ మ్యాచ్ లో ఆడే ఆటగాడికి తెలియక పోవడం వింతగా అనిపించడం లేదా?

ఏదైతేనేం, మొత్తానికి చాలా రోజుల తరువాత ప్రీతీ జింటా మొహంలో నవ్వు కనిపించింది. పంజాబు కింగులూ మీ ఆట తీరు మార్చుకోక పోతే ఇదే ఆఖరు నవ్వు అవుతుంది ఈ ఐ పీ ఎల్ సీజన్ లో.

No comments: