నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 2, 2010

ఒరేయ్ వెధవా,రామక్రిష్ణ పరమహంసతో కల్కిని పోలుస్తావా?కళ్ళు పోతాయ్!

ఈ మధ్య మహా టీవీ వాళ్ళు కల్కి భగవాన్ ని ఫుట్ బాలాడేస్తున్నారు.రోజుకో ఎపిసోడ్ చొప్పున స్పెషల్ టాక్ షోలు పెట్టి సదరు భగవాన్ చేతిలో మోసపోయిన వాళ్ళని, అతన్ని నమ్మని హేతు వాదులనీ పోగేసి వరదాయ పాళెం లోని అశ్రమం లో జరుగుతున్న జుగుప్సాకరమైన కార్యక్రమాల వుజువల్స్ ని చూపించి ఎడా పెడా కుమ్మేస్తున్నారు.భక్తులుగా పిలుచుకొనె దాసాజీలు డ్రగ్స్ మత్తులో, నగ్నంగా తయారయ్యి పిచ్చి వెదవల్లాగ తయరయ్యి ఎగురుతు వుంటే దానిని సమర్ధించుకొనే ప్రయత్నంలొ లోకేష్ అనబడే ఆశ్రమ మేనేజర్ రామ క్రిష్ణ పరమహంస కానీ మీరాభాయి కానీ అప్పట్లో నగ్నంగానే ఉండే వాళ్ళు అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.ఆ పెద్ద మనిషి ఉద్ధెశ్యం తన బాస్ కూడా ఆ స్థాయికి చెందిన వాడు అని చెప్పటం కావచ్చు.
రామక్రిష్ణ పరమహంస సాదా సీదాగా పైన ఒక ఉత్తరీయం మాత్రమే వేసుకొని ఉన్నట్లు ఆయన బొమ్మ ఆయన్ని ప్రత్యంక్షంగా చూడని నాలాంటి వాళ్ళకున్న అభిప్రాయం.మీరాభాయిని కూడా బొమ్మల్లోనో సినిమలలోనొ మత్రమే చూసిన మాకున్న నమ్మకం. అయిన గుడ్డల సొంగతి తీసి పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడైనా శిష్యులతో కలవడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడైనా ఉందా?రామక్రిష్ణ గారి ప్రియ శిష్యుడు వివేకానందుడు ఆయన డబ్బు మనిషైతె ఆయనతో కలిసి వుండే వాడా? అసలాయన పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు నిర్మించి బోధ చేశాడా?
అలాంటి మహానుభావులతో కల్కి లాంటి ఫోర్ ట్వంటీ గాళ్ళను పొల్చడమే తప్పు. ఒరేయ్ లోకేష్ కళ్ళు పోతాయిరా రాస్కెల్.

7 comments:

Anonymous said...

Well said , Mr.cheppu

చదువరి said...

బాగా రాసారు.

rameshsssbd said...

sir,
these crroked fellows are done more and more examples. first of all public loose their common sense. like these kalki's firstley hang in public.

durgeswara said...

ఎవడా వెధవ

సద్గురువులైన రామకృష్ణులెక్కడ? ఈ నికృష్టులెక్కడ
శిష్యచిత్తపహారులైన ఆసద్గురువులు లోకకళ్యాణం కోసం తమ సాధనను ధారపోస్తే ,శిష్యవిత్తపహారులైన ఇలాంటి "కలి" గురువులు శిష్యుల సంపదను పోగేసుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను గూర్చే తాతగారు వీరబ్రహ్మేంద్రులు ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమ్ మిచ్చేటి కల్లగురువులు భువిన పుట్టేరయా అని హెచ్ఛరించారు. కానీ దరిద్రపు పెద్దమ్మ తలమీదకెక్కి కూర్చున్నవానికి ఇలాంటి హెచ్చరికలు తలకెక్కవు. కలి మాయ మరి.
http://durgeswara.blogspot.com/2008/10/blog-post_21.html

కెక్యూబ్ వర్మ said...

baagaa cheppaaru. dandukunE yilaamti neechulatO atuvaMti vaarini pOlchinavaadini uppu paatara veyali.

Anonymous said...

ప్రజల మానసిక దౌర్భల్యం వీరి ఆటలు సాగేలా చేస్తోంది.

mohanraokotari said...

tondara padi evarini nindicha kandi, inthaki ee guruvulu dabbunu emi chesthunnaru, hindu matha vyapthi korake kada aaropanalu ante evari mida levu cheppandi, prove ayyevi kaadu kadaa,swami vivekananda grunchi kudaa aaropanalu innaya gaaru chesinavi ikkade telugu blogullone unnayi, ivanni maamule kaani assammathi leni dekkada, swaamulu evari koraku emi chesthnaaranedi grahisthe chaalu.