నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, March 28, 2010

దళితుడైతే అన్నిటికీ అతీతుడౌతాడా?

మొన్న రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది.ఏసీబీ దాడిలో బుక్కయిన ఒక అధికారికి ఐ ఏ ఎస్ గా ఎల పదవీ ఉన్నతి కల్పించారని ఒక టీడీపీ సభ్యుడు ప్రశ్న లేవనెత్తాడు. దానికి ఏం చెప్పాలో పాలుపోని అధికార పార్టీ తరఫునుంచి చీఫ్ విప్ భట్టు విక్రమార్క హర్ష వర్ధన్ అనే ఆ అధికారి కులాన్ని గుర్తు చేసి ఒక దళిత అధికారి మీద ఆరోపణలు ఎలా చేస్తారని ఎదురు దాడికి దిగాడు.

ఆ అధికారి ఏ రెడ్డో,కమ్మో, నాయుడో, రాజో, శర్మో లెక శాస్త్రో అయితే తెలుగుదేశమోళ్ళు కూడా పిచ్చి కేకలేసి అసెంబ్లీని కంపు కంపు చేసి పెట్టి ఉండే వాళ్ళు గానీ దళిత అధికారి అనే లోపు రూటు మార్చారు. ఆసలు సదరు అధికారి మీద అవినీతి నిరోధక శాఖ వాళ్ళతొ దాడి చేయించింది కాంగ్రెస్ వాళ్ళేనని ఎదురు దాడికి దిగారు.

దళితుడైనంత మాత్రాన అవినీతికి పాల్పడవచ్చని వీళ్ళ ఉద్ధేశ్యమా?కులం మాటున కోట్లకు కోట్లు బొక్కినా చూడకుండా వదిలేయాల్నా?అస్సలు ఈ నాయకులకు అణగారిన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందొ వాళ్ళకు బాగా తెలుసు.దళిత వోటుబ్యాంకుని గుంపగుత్తుగా కొల్లగొట్టాలనేదే వీళ్ళ లక్ష్యమని అందరికీ తెలిసిన విషయమే.

నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఒక్కరికైనా రిజర్వు చేయని స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారా?రబ్బరు స్టాంపులా తప్ప స్వతత్ర్యంగా పని చేసే అవకాసం కల్పించారా?

ఎందుకీ అవకాశవాద ప్రేమ వీళ్ళకి?

9 comments:

Anonymous said...

well said

Anonymous said...

SC/ST Atrocities can be filed on anyone, and no need of applying an iota of brain in putting the accused in jail without trial. That is the 'natural beauty' of the section. :P

Dalits be given 80% of the wealth earned by them all means.

Kathi Mahesh Kumar said...

అవినీతి ఎవరు చేసినా అవినీతే. దానికీ అతను దళితుడవడానికీ ఏమిటి సంబంధం? ఒక సారి "అవకాశవాద ప్రేమ" అన్నాక నిజానికి ఆ అధికారి దళితుడా కాదా అన్నది అప్రస్తుతం కదా! అసెంబ్లీలో జరిగింది పాలక-ప్రతిపక్షాల జోడునాటకం.దానికి వాళ్ళు రాజకీయ ఉద్దేశంతో కులం రంగుపులిమితే దాని అడ్డంగా పెట్టుకుని ఈ భూత్ జోలకియా తన అక్కసు వెళ్ళ బుచ్చుతున్నాడు. ఇద్దరూ ఇద్దారే!

Anonymous said...

మహేష్ గారు, మీరెవరో వుట్టి అమాయకుల్లా వున్నారు. తరాల తరబడి అగ్రవర్ణాలవారు అవినీతి చేస్తే లేనిది , దళిత అధికారి కడుపుమండి తనూ కొన్ని కోట్లు దాచుకుంటే తప్పా? ఇదేం న్యాయం? కడుపు మండి కోట్లేసుకుంటే తప్పా? అందుకే ఆనం స్పందించారు. మీరు నామీద పడటంలో అర్థం లేదు, కావాలంటే డోమెల్లా కాపర్ రష్యన్ లో రాసిన ' అవినీతికోవ్, దళితోవ్ ' చదివి రండి. ఇప్పుడే ఎ.పి. ఎక్స్ ప్రెస్ లో టాయిలెట్లో గంటసేపు పైగా కూచుని చదివివచ్చాను.

admin said...

YSR CM gaa undagaa Reddy Police offices... IPS..lu.. IAS lu..entha avineetiki paalpaddaaro...teliyadaa baasu..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అసలు పాయింటేమిటంటే అవినీతికి ఎవరు పాల్పడ్డా కులం ప్రసక్తి లేకుండా శిక్ష పడాలని మా ఉద్ధేశ్యం.అప్పుడు ఆ కులం వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టీ ఇప్పుడు ఈ కులం వాళ్ళు తరువాత మరో కులం వాళ్ళూ ఆ తరువాత ఇంకో కులం ...ఇలా పోతూ ఉంటే దేశం చంక నాకి పోదా?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Jolokia, are you serious?

Anonymous said...

Main problem in india is caste based Reservation. Thank god for no reserevation in Indian ARMY, else pakistan would have beat us long back.

Nrahamthulla said...

రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 60 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.