నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, June 30, 2011

మానభంగం ఆయుధంగా సౌత్ ఆఫ్రికాలో లెస్బియన్ల మీద దాడులు


లెస్బియన్ల, గే లని గుర్తిస్తూ ఎన్ని చట్టాలొచ్చినా ప్రజల్లో వారిపైన అపోహలు తొలగడం లేదు. శరత్ లాంటివారు ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా ఇంకా అలాంటి లైంగిక కార్యకలాపాలు తప్పు, లేదా నేరం అన్న అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య రామ్ దేవ్ బాబా హోమో సెక్సువాలిటీ ఒక జబ్బు, ఈ జబ్బు పాలిట పడ్ద వారు జంతువులతో సమానం అని, తను వారికి ఆ జబ్బు నయం చేయగలనని ప్రకటించడం, గే, లెస్బియన్ హక్కుల కోసం పోరాడే బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇదేమీ జబ్బు కాదు, నువ్వు చికిత్స చేయాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకోవోయ్ అని ఘాటుగా సమాధానం చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.


   
అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో లెస్బియన్ల మీద దాడులు పెరిగి పోయాయి. ఈ దాడుల్లో మానభంగం అన్నది ప్రధాన ఆయుధంగా మారింది. లెస్బియన్ల మీద మానభంగానికి పాల్పడడం ద్వారా వారిని ఆ అలవాటు నుంచి బయట పడేస్తున్నామని ఈ చర్యకి పాల్పడ్డవారు చెప్పుకొంటున్నారు. అందు చేత వీటికి CORRECTIVE RAPES అని ఒక గౌరవమైన పేరు పెట్టారు.
Noxolo Nkosana 
సౌత్ ఆఫ్రికా జాతీయ ఫుట్ బాల్ జట్టులో సభ్యురాలయిన యూడీ సిమెలాన్ అనే లెస్బియన్ హక్కుల కార్యకర్త పైన కొందరు దాడి చేసి ఆమెని సామూహిక మానభంగం చేసి్, కత్తులతో పొడిచి చంపిన సంఘటనతో ఈ అకృత్యాలు వెలుగులోకొచ్చాయి. సిమెలాన్ తనని లెస్బియన్‌గా ప్రకటించుకొని, బహిరంగంగా ఒక మహిళతో కలిసి జీవిస్తున్న మొదటి మహిళ.
   
 ఈ సంఘటన తరువాత ఉవ్వెత్తున వెల్లువెత్తిన నిరసనతో అప్పటి వరకూ తమ మీద జరిగిన అకృత్యాలపైన ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన లెస్బియన్లు బయటకి రావడం మొదలు పెట్టారు. లులేకి సిజ్వే అనే సామాజిక కార్యకర్త మాటల్లో వారానికి కనీసం పది మంది లెస్బియన్లు సామూహిక మానభంగానికి గురవుతున్నారు. కానీ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసుల నుంచి కూడా వీరికి అవమానం ఎదురౌతుంది. నువ్వు ఆడవారితోనే చేస్తావు కదా, మగాళ్ళు నిన్ను ఎలా రేప్ చేస్తారు అని అవమానంగా మాట్లాడతారని, అందుకే ఎక్కువ మంది  తమకి జరిగిన న్యాయాన్ని మౌనంగా భరిస్తారని ఆమె చెప్పారు.
లెస్బియన్, గే హక్కులని గుర్తించిన ఒకే ఒక్క ఆఫ్రికా దేశం సౌత్ ఆఫ్రికా. అయితే అక్కడ ప్రజల్లో మాత్రం వీరి పట్ల వివక్ష తొలిగిపోలేదు. ప్రతి సంవత్సరం అక్కడ నమోదయ్యే 50,000 రేప్ కేసుల్లో ఎన్ని లెస్బియన్ల మీద జరుగుతున్నాయో ఖచ్చితంగా తెలియదు. చాలా మంది ఫిర్యాదు దారులు తాము లెస్బియన్స్ అని చెప్పుకోవడానికి వెనుకాడుతారు.


ఈ అకృత్యాలకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి హోమో సెక్సువాలిటీ, అందునా ఆడవారి మధ్య, అసహజమైన చర్య అన్న నమ్మకం. ఇది మతానికి విరుద్ధం అన్న భావనతో ఈ దాడులు జరుగుతున్నాయాన్నది ఒక కారణం. 
 


ఇక రెండవది, కొంచెం కండలు పెంచి, మగ రాయుళ్ళలా ఉన్న లెస్బియన్లు, (వీరిని Butch Lesbians అంటారు,) తమ ప్రియురాళ్ళను, తమ ఆడవారిని తమ నుంచి లాక్కుంటారన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం.


"ఈ లెస్బియన్లు మమ్మల్ని కించ పరుస్తున్నారు. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో శృంగారం చేస్తుంది అంటే, మేము చేతగాని వాఅమనేగా అర్ధం" అని చెప్పాడు ఇలాంటి కేసులో ఇరుక్కున్న తులాని బెంగు అనే వాడు. " ఒక సారి మేము రేప్ చేస్తే ఇలాంటి ఆడవాళ్ళు అమ్మాయిలయి పోతారు". ఇది మూడవ కారణం.


ఏప్రిల్‌లో నోక్సొలో నోగ్వజా అన్న అమ్మాయిని ఎనిమిది మంది కలిసి మానభంగం చేసి దాఋణంగా హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. 170,000 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా సంతకాలు చేసి పంపడంతో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ కరెక్టివ్ రేప్ కేసుల మీద సీరియస్ యాక్షన్ మొదలయింది.

20 comments:

Anonymous said...

"తులాని బెంగు" super name!!!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

It's a South African name.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

"When someone is a lesbian, it's like saying to us men that we are not good enough," Thulani Bhengu said.

Anonymous said...

నీకేమైనా రాందేవ్ మీద కోపముంటె పోయేంత వరకు తిట్టుకో, కాని సేలినా జైట్లి అనబడే ఒక బజారు మనిషి తిట్టిందని గొప్పగా రాయమాక. దానికి అయిదు పైసల విలువలేదు, ఏ సినేమాలో చేసిందో ఎవరికి తెలియదు,టైంస్ ఆఫ్ గాడు గాసిప్ కాలం లో తప్ప బ్రతికి ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇంతకీ రాందేవ్ మీద మీకంత కోపమేందుకో ఒకటపారాయండి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ పోస్టు రామ్ దేవ్ గురిమ్చి, సెలినా గురించి కాదు. మిమ్మల్ని నొప్పించి ఉంటె సారీ. రామ్ దేవ్ చాలా గొప్ప వాడు, మహాత్ముడు, పుజ్యనీయుడు. చాలా?

Anonymous said...

*రామ్ దేవ్ చాలా గొప్ప వాడు, మహాత్ముడు, పుజ్యనీయుడు. చాలా? *

వెటకారం. ఆయనకు మీలాంటి వారు గౌరవం ఇవ్వకపోతే పోయేది ఎమీ లేదు. కనుక నీ కితాబులు ఎవరికి అక్కరలేదు. కోట్ల మందికి ఆయన గురించి తెలుసు. మతి బ్రమించిన డిగ్గి రాజా లాంటి వారి సంతతి కే ఆయన అంటే వెటకారం.

ఇక మీడీయా లో బజారు/చౌకబారు మనుషుల ఒక గుంపును నెత్తిన ఎత్తుకోవటం ఒక భాగం. ఉదా|| ప్రమోద్ మహాజన్ కొడుకు రేండో పేళ్లి టి వి షో లో చేయించటం, వాడు అత్తగారి ఊరికి కలకత్తా కు పోయాడని రాయటం. ఇటూవంటి పైసా విలువ లేని వారి పై నిరంతరం ఎదో రాసుకొంట్టూ,వారి ఇమేజ్ ni ప్రజలలో పెంచుతారు. ఇటువంటి గుంపులో వారితో సమయాను సారంగా అన్నా హజారే, బాబా రాందేవ్ లాంటి వారు చేసే నిరాహార దీక్షల పై, పనులపైన వారు విమర్శలు చేయించి నిజాయితి పరులపైన (ముఖ్యంగా దేశ భక్తి గురించి మాట్లాడే వారిపైన)తమ విద్వేషాన్ని వేళ్ళగక్కి కుతి తీర్చుకొంటారు.

Anonymous said...

@anonymous

annahazare ni ramdev babani oke lanti vaalanakandi..... adi hazare gaariki avamaanam. mulikalammi kotlu gadinchagaligevaallu yemanna cheppagalaru popularity kosam. sanyasi anna padaanike ardam maarchesaaru. anyway asalu topic ikkada ee babala gurinchi kaadu. its a good post. people who talk about human rights shoud condemn such activities.

yaramana said...

క్రిష్ణ గారు ,
అద్భుతమైన పోస్ట్ . అభినందనలు . స్వజాతి సంపర్కం ఒకప్పుడు మానసిక వైకల్యంగా భావించబడింది . ఇప్పుడు కాదు . సనాతనులకి ఈ టాపిక్ ఒక కల్చర్ షాక్ . ఈ లెస్బియన్ , గే హక్కుల గూర్చి మాట్లాడుకోవటానికి మతవిశ్వాసాలు అడ్డొస్తుంటాయి . అన్ని మతాలకి ఈ విషయంలో ఒకే అభిప్రాయం ( తీవ్ర వ్యతిరేకత ) . సౌతాఫ్రికాలో కూడా మన దేశంలోలాగా పేదరికం , నిరక్షరాశ్యత , అజ్ణానం ఎక్కువ . ప్రస్తుతానికి మనం బాణామతి , మంత్రగత్తెలనే నెపంతో అమాయకులని చంపేస్తున్నాం . సౌతాఫ్రికా తరహా హత్యలు చెయ్యటానికి మనకి ఇంకొంచెం సమయం పడుతుంది .

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్ బాబూ నీ రామ్ దేవ్ బాబా భక్తికి జోహార్లు. రామ్ దేవ్ బాబాకి ఈ పోస్టుకీ సంబంధం లేదు. అనవసరంగా బాబాకి కొందరిచేతిలో చీవాట్లేయించావు.

Anonymous said...

రాందేవ్ గారిని నీ లాంటివారు 200 బ్లాగులు పెట్టుకొని రాసుకొన్నా పోయేది ఎమీ లేదు. ఆయన డబ్బులు సంపాదించాడు కాబట్టి సన్యాసి కాడు అన్న అజ్ణాతా! అసలికి సన్యాసి అంటే మీఉద్దేశం లో ఎలా ఉండాలో చెప్పండి నేను జవాబిస్తాను.

*సనాతనులకి ఈ టాపిక్ ఒక కల్చర్ షాక్ . ఈ లెస్బియన్ , గే హక్కుల గూర్చి మాట్లాడుకోవటానికి మతవిశ్వాసాలు అడ్డొస్తుంటాయి . అన్ని మతాలకి ఈ విషయంలో ఒకే అభిప్రాయం ( తీవ్ర వ్యతిరేకత ) .*
పాపం ఈ మాత్రం ఈ డాక్టర్ చేప్పెంతవరకు మాకు తెలిదు. మనిషి ఆనందం కొరకు సెక్స్ లో పాల్గొంటాడు, అది స్వలింగమైనా, ఇతరులతో అయినా. ఈ డాక్టర్ గారు ఊరకనే అనుభవం లేని మాటలు పుస్తక జ్ణానం తో మాట్లాడుతున్నాడు. డాక్టర్ సారు మీరు స్వంత ఇల్లే అద్దేకిస్తున్నారనుకొండి మేము హోమోలము/ లెస్బియన్లము పెళ్ళిచేసుకొన్నాం అని చెపితే కల్చర్ షాక్ గురికాకుండా మనస్పుర్తిగా అద్దెకిస్తారా? పోని కనీసం ఆయనకు తెలిసిన వారి చేత ఇప్పించగలరా?

yaramana said...

అయ్యా ఎనోనిమస్ గారు ,
" పాపం ఈ మాత్రం ఈ డాక్టర్ చేప్పెంతవరకు మాకు తెలిదు "
మీకు తెలీని విషయం నేను చెప్పానని అనుకోవట్లేదు .
" .. ఊరకనే అనుభవంలేని మాటలు పుస్తక జ్ణానం తో మాట్లాడుతున్నాడు."
ఈ టాపిక్ మీద అభిప్రాయం రాయటానికి ఏ రకమైన అనుభవం కావాలి ? పుస్తకపరిజ్ణానంతో మాట్లాడకూడదా ? నాకు అర్ధం కాలేదు .
" .. మనస్పుర్తిగా అద్దెకిస్తారా?"
సౌతాఫ్రికాలో హత్యాకాండకీ ఇల్లు అద్దెకివ్వటానికి సంబంధం లేదనుకుంటున్నాను .

Praveen Sarma said...

నేనేమీ రేప్‌లని సమర్థించడం లేదు కానీ మీ కూతురే లెస్బియన్‌గా మారితే స్వాగతిస్తారా? కత్తి మేతావిలాగ కుటుంబం వేరు, సమాజం వేరు అని సమాధానం చెప్పొద్దు.

Anonymous said...

డాక్టర్ గారు, మీరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నారు కాని మీర్ రాసినది ఒక సారి చదవండి " సనాతనులకి ఈ టాపిక్ ఒక కల్చర్ షాక్ .
ఈ లెస్బియన్ , గే హక్కుల గూర్చి మాట్లాడుకోవటానికి మతవిశ్వాసాలు అడ్డొస్తుంటాయి . అన్ని మతాలకి ఈ విషయంలో ఒకే అభిప్రాయం ( తీవ్ర వ్యతిరేకత )" ఇక్కడ మీరు అన్నిమతాలను ,సనాతనులను గురించి మాట్లాడారు. అందువలన నేను మిమ్మల్ని ప్రశ్నించటం జరిగింది. పుస్తక జ్ణానం తో మాట్లాడటానికి అది కేన్సర్,ఏయిడ్స్ లాంటి జబ్బు కాదు. సామాజిక సమస్య, ప్రవీణ్ అడిగినట్లు గా నాది అదే ప్రశ్న మీ అమ్మాయో లేక అబ్బాయో నాకు ఇంకొక అమ్మాయితో/అబ్బాయి తో కలసి జీవించాలని వుంది అని ఒకరిని తీసుకు వచ్చి పెళ్ళిచేసుకోవలనుకొంట్టునాం అంటే మీరు వాళ్లిద్దరికి ఊరంతా పిలిచి, పేళ్ళి చేసి, అక్షింతలు వేసి ఆశీర్వదించి మీ ఆస్థిలో భాగం ఇస్తారా? ఆ జంటను మీఇంటిలో కాపురం చేయనిస్తారా?

Praveen Sarma said...

ఇది చదవండి: http://telugu.stalin-mao.in/43497131

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రామ్ దేవ్ బాబా భక్తుడైన ఎనోనిమస్ గారూ కొంచెం తెలివి తెచ్చుకొని ఈ పోస్టు చదవండి. ఆయనకీ ఈ పోస్టుకీ సమ్బంధం లేదు. బాబామీద 200 పోస్టులు రాయడానికి నేను Hate Ram Dev campaign నడపడం లేదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sarath is missing here.

Anonymous said...

నాతెలివి సంగతి తరువాత తమరికున్న తెలివిని విచ్క్షణను ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకప్పుడు అట్టాంటి ఇంట్లాంటి దాన్ని కాను మేస్తిరి అర్దరూపాయ డబ్బులకు రాను మేస్తిరి అనే పాటలకు డాన్స్ వేసేవారి కన్నా ఘొరమైన దుస్తులను, పిచ్చి పిచ్చి డాన్స్లను వేసే సేలిన జైట్లి లాంటి వారు పబ్లిసిటికొరకు ఇచ్చే స్టెట్మెంట్లను గొప్పగా కోట్ చేయటం మీracayitagaa mI sthaayini, telivini,దిగజారుడు తనాన్ని తెలియజేస్తున్నాది. ఆమే అలా అనకుడదా! అని మళ్ళి ఎదురు దాడికి దిగుతారేమో, సేలినా జైట్లి లాగా నచ్చినపుడ్డల్లా కొత్త బాయ్ ఫ్రేండ్ ను మార్చే వారు మీ బందువులలో, స్నేహితులలో ఉంటే వారు ఇలాంటి సలహాలు మీకు ఇస్తే మీరు వొప్పుకుంటారా?

*ఆ మధ్య రామ్ దేవ్ బాబా హోమో సెక్సువాలిటీ ఒక జబ్బు, ఈ జబ్బు పాలిట పడ్ద వారు జంతువులతో సమానం అని, తను వారికి ఆ జబ్బు నయం చేయగలనని ప్రకటించడం, "గే, లెస్బియన్ హక్కుల కోసం పోరాడే బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇదేమీ జబ్బు కాదు,"నువ్వు " చికిత్స చేయాల్సిన అవసరం లేదు, "నీ పని నువ్వు చూసుకోవోయ్" అని ఘాటుగా సమాధానం చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.*
బాబూ తమరు పైన రాసిన దానిని ఒకసారి చదువుకోండి. పైసా విలువలేని సెలినా జైట్లి రాందేవ్ గారిని ఏకవచనంతో విమర్శించటం దానిని తమరు రాయటం.

Sree said...

మిగతా దేశాల సంగతేమోకాని, మన దేశానికి మాత్రం ఈ గే లెస్బియనులు ఒక సమస్య. మన దేశం లో స్నేహితులు ఎప్పుడూ చాలా దగ్గరగా మెసలుతుంటారు. మీ టీనేజ్, కాలేజ్ రోజులు గుర్తు తెచ్చుకోండి. మన ఫ్రెండ్స్ భుజాలపై చేతులు వేసి ఎంజాయ్ చేస్తూ గడిపాం. అప్పుడు మన మనసుల్లో వేరే విధమైన భావాలు లేవు. కాని ఇపుడు ఒక same sex వ్యక్తి పై చెయ్యి వేస్తే మనల్ని అదో టైపు అనుకునే రోజులు వచ్చేసాయి. ఇది ఒక సమస్య కాదా?
నేను వారిపై జరుగుతున్న మారణకాండని సమర్థించడం లేదు. నా దృష్టిలో స్వలింగ సంపర్కం అనేది సిగరెట్, మందులాంటి ఒక దుర్వ్యసనం. దీని నుంచి బయటపడాలనేవారికోసం కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టాలి. విదేశాల్లో ఒప్పుకున్న ప్రతీదీ మనమూ ఒప్పుకోవాలని లేదుకదా?
సాధారణంగా సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే టీనేజర్లలో డబ్బూ ఒళ్ళూ బలిసి ఉంటే, opposite sex దొరక్కపోయినా లేదా వారిచే మోసగింపబడినా ఇలాంటి వాటిబారినపడే అవకాశం ఉంది. ఇది నిజం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సెలీనా జైట్లీ రామ్ దేవ్ బాబాని ఏక వచనంతో సంబోధించడం తప్పు కానీ నేను దాన్ని ఇక్కడ కోట్ చేయడం తప్పెలా అవుతుంది? ఇంకో సారి చెప్తున్నాను. హోమో సెక్సువాలిటీని సమర్ధించే పోస్టు కాదు ఇది. లెస్బియన్లమీద వాళ్ళని సరి చెసే నెపంతో జరిగే corrective rapes అనే ఒక అకృత్యం మీద రాసిన పోస్టు ఇది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సెలీనా జైట్లీ రామ్ దేవ్ బాబాని ఏక వచనంతో సంబోధించడం తప్పు కానీ నేను దాన్ని ఇక్కడ కోట్ చేయడం తప్పెలా అవుతుంది? ఇంకో సారి చెప్తున్నాను. హోమో సెక్సువాలిటీని సమర్ధించే పోస్టు కాదు ఇది. లెస్బియన్లమీద వాళ్ళని సరి చెసే నెపంతో జరిగే corrective rapes అనే ఒక అకృత్యం మీద రాసిన పోస్టు ఇది.