నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, June 8, 2011

మొగుళ్ళ పాతివ్రత్యం కాపాడడానికి మరొక అద్భుతమైన మార్గం


ఈమధ్య ముస్లిం దేశాల్లో ఆడవారికి తమ మొగుళ్ళను వేశ్యల బారి నుండి ఎలా కాపాడుకోవాలా అన్న చింత ఎక్కువైనట్లుంది. మలేషియాలో ఒక డాక్టరు పెళ్ళాలే వేశ్యలాగా మొగుళ్ళని తృప్తి పరచాలి అని చెప్పడమే కాకుండా వేశ్యల్లా ఎలా ప్రవర్తించాలో నేర్పింఛడానికి ఒక సంస్థ నెలకొల్పి అందులో సభ్యులుగా చేరిన వారికి  ఇంటిని చక్కదిద్దుకోవడం, వంటా వార్పు లాంటి వాటితో బాటు సెక్స్‌లో కూడా పాఠాలు నేర్పించాలని తయారయింది. ఈ విషయమై రాసిన పోస్టు ఇక్కడ చూడొచ్చు.
http://hittingontheface.blogspot.com/2011/06/blog-post_07.html
ఇప్పుడు కువైట్‌లో ఒక రాజకీయవేత్త ఇందుకు మరొక మార్గం కనిపెట్టింది. సల్వా అల్ ముతైరి అనే రాజకీయవేత్త సెక్స్ బానిసలు అన్న కాన్సెప్టుతో ముందుకొచ్చింది. లోగడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఈ అమ్మడు ఈ విషయమై చాలా రీసెర్చే చేసింది. ఈమెకి గతంలో ఉన్న ఒక ప్రియుడికి ఆడవారి యావ ఎక్కువగా ఉండడంతో వాడిని ఎలా కంట్రోల్ చేయాలా అని అలోచించినప్పుడు ఈమెకి ఈ అద్భుతమైన ఆలోచన తట్టిందట. అంతటితో ఆగకుండా మక్కా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మత పెద్దతో ఈ విషయమై చర్చించగా అది ఇస్లాంకి విరుద్ధం కాదని ఆయన భరోసా ఇచ్చాడట.


  

డబ్బూ, కోరికా, ఒంట్లో ఓపికా ఉన్న వాళ్ళు ఆడ్శవారిని కొనుక్కొని తమ కోరికలు తీర్చుకోవడానికి వాడుకోవడంలో తప్పు లేదని అలా చేయడం వల్ల మగవారు తప్పు దారులు పట్టకుండా ఉండవచ్చని ఈమె సిద్ధాంతం. ఇందుకోసం ఆఫీసులు తెరిచి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు స్థాపించి ఈ తతంగం నడపవచ్చని కూడా ఈవిడ ఒక సలహా కూడా చెప్పింది. ముఖ్యంగా యుద్ధాలు జరిగి దిక్కులేకుండా పోయే ఆడవారిని ఇందుకోసం వాడుకోవచ్చని అలా చేయడం వల్ల ఆ దీనులకు ఆకలితో చచ్చే ఖర్మ లేకుండా ఆదుకోవచ్చని కూడా ఒక సలహా పారేసింది.


తన వాదన బలపరచుకోవడానికి ఒక మంచి ఉదాహరణ కూడా ఈమె చెప్పుకొచ్చింది. చెచెన్యాలో యుద్ధంలో పట్టుబడ్డ ఆడ ఖైదీలను, ఇల్లూ వాకిలి లేకుండా పోయిన వాళ్ళనూ ఈ సెక్స్ బానిస వ్యాపారంలో వాడుకోవచ్చని ఆ విధంగా వారికి మంచి జీవితం ప్రసాదించిన వాళ్ళు కావచ్చని చెప్తూ, ఇందులో తప్పేమీ లేదు. చరిత్రలోకెళ్తే హరూన్ ఆల్ రషీద్ అనే ఖలీఫా చచ్చే సమయానికి రెండు వేల మంది ఉంపుడుగత్తెలని పోషించేవాడని, ఇస్లామిక్ చట్టం షరియా కూడా దీనిని ఆమోదిస్తుందని ఈమె భరోసా కూడా ఇచ్చింది.


అయితే ఈమెని, ఈమె సూపర్ కాన్సెప్టునీ విమర్శకులు తిట్టి పోశారు. ఇంటర్నెట్ డిస్కషన్ ఫోరమ్‌లో ఒక సభ్యుడు, "ఇరాక్ కువైట్‌ని ఆక్రమించుకున్నప్పుడు నిన్ను పట్టుకెళ్ళి సెక్స్ బానిసగా అమ్మిపారేసి ఉంటే ఏమి చేసేదానివే బోడిముండా?" అని తిట్టి పోశాడు.

ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఏ ప్రియుడి కోసం అయితే ఈమె ఇంత అద్భుతమైన ఆలోచన చేసిందే వాడు ఈమెని వదిలెసి మరొకరిని తగులుకోవడం. కొత్తగా ప్రియుళ్లని వెతుక్కోకుండా ఎవరికో ఒకరికి శృంగార బానిస (sex slave) గా ఉండడం ఈమెకి బెస్ట్ అని అందరూ చాటుగా చెప్పుకొంటున్నారు.

2 comments:

Anonymous said...

pachi telugulo cheppalante "aavida ni naa sanka naakamanandi". edi badite adi matladatam prajaswamyam ayipoyindi ipudu.

Ramana said...

అన్నా ఒక సారి నా బ్లాగ్ ఆర్టికల్ చదువుతారా

http://pachchinijaalu.blogspot.com/