శాస్త్రాల్లో చాలా రకాలున్నాయి.శాస్త్రీయంగా ఋజువైనవి అలా ఋజువు కానివీనూ.వీటిలో రెండవ రకానికి చెందినవాటిని కుహనా శాస్త్రాలని పిలవాలనీ వాటిని నమ్మకూడదనీ ఎవరైనా అనుకొంటారు.వాటికి ప్రజల మద్ధతు కూడా ఉండదని కొంచెం కామన్ సెన్సు ఉన్న వాళ్ళు అనుకొంటే అది తప్పు కాదు.కానీ కామన్ సెన్సు అనేది అంత కామన్ కాదని వీళ్ళు తెలుసుకోవాలి.
ఈ రకం తలా తోకా లేకుండా విశేష ఆదరణలో ఉన్న శాస్త్రాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూమరాలజీ జెమాలజీ అనె రెండు. జ్యోతిష్యాన్ని కూడా ఇందులో చేర్చేవాడినే కానీ ఈ వేదికలో దనికి గట్టి సపోర్టర్సు ఉన్నందువల్లనూ,వాళ్ళతో పోట్లాడే ఓపిక నాకు లేనందు వల్లనూ,ఆ పని ఇదె వేదికలో నచికేతుడు అద్భుతంగ చేస్తున్నందు వల్లను దానిని వదిలి పెట్టాను.
న్యూమరాలజీ చాల సింపుల్.ప్రతి వాడికీ ఒక బర్త్ నంబరూ ఒక డెస్టినీ నంబరు ఉంటాయి.మన జీవితంలో మనకు నచ్చని దాన్ని మార్చుకోవడానికి వీటిలో ఏదో ఒకదాన్ని కాన్నీ లేక రెండిటినీ గాని మార్చుకొంటే చాలు.
ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదనుకోండి. పద్ధతిగా అయితే కొత్త స్కిల్సు నేర్చుకోవాలనో.సాఫ్టు స్కిల్సు పెంచుకోమనో,ఎక్స్ పెక్టేషన్సు తగ్గించుకొని వచ్చిన ఉద్యోగంలో చేరిపొయ్యి మరింత మంచి ఉద్యోగానికి ప్రయత్నించమనో సలహా చెప్పాలి.ఇది సదరు వ్యక్తికి అంత బాగా నచ్చదు.అదే న్యూమరాలజిస్టు నడిగితే దినికి తేలికైన పరిష్కరం సూచిస్తాడు.పేరులో ఒక అక్షరాన్ని పెంచుకోవడమో లెక తగ్గించుకోవడమో చెస్తే సమస్య పరిష్కరమైపొతుందని చెబితే వాదికి అంతకన్నా ఆనందం ఏముంటుంది.అయితె దానివల్ల వాడికి ఉద్యోగం వస్తుందా లేదా అన్నది అప్రస్తుతమనుకోండి.
రోజూ ఉదయాన్నే ఒక టీవీ చానల్ లోను సాక్షి పత్రికలోనూ ఇలాంటి పరిష్కారాలు చెప్పె ఒక న్యూమరలజీ కాలం నడుస్తోండి.పేరులో అక్షరాలు మార్చుకోగనే సమస్యలన్నీ తేలిపోతె ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది.
ఇలాంటిదే జెమాలజీ.అమ్మాయి లావుగా నల్లగా ఎత్తు పళ్ళతో ఉంది.పెళ్ళి కావడం లేదు అని సమస్య చెబితే డైటింగ్ చేసి సన్న బడాలి,పళ్ళకి క్లిప్స్ వెయించాలి,బ్యూటీ టీప్స్ ఉపయోగించి కొంచెం రంగు పెంచాలి, కట్నం ఓ పది లక్షలు ఎక్కువ ఆఫర్ చేయాలి అని చెబితే అంత రుచించదు.గోమేధికాన్నో,ఇంకెదో రాయినో చెతికో ఇంకెక్కడో కట్టుకొంటే చాలు.పెళ్ళయిపోతుంది అని చెబితే సమ్మగా ఉంటుంది.
కాబట్టి ఇలాంటి తలా తోకా లేని శాస్త్రాలే ప్రజలకు నచ్చుతాయి.క్లిష్టమైన సమస్యలకు కూడా వీటిలో అతి తేలికైన పరిష్కార మార్గాలుంటాయి కాబట్టి.అయితే ఇవి పని చేస్తాయా లేదా అని ఎవరూ చూడరు.ఏదో చెప్పామా మన ఫీజు తిసుకున్నామా అంతే.అదే టీవీలో అయితే మన ప్రోగ్రాం అయ్యిందా లేదా అంతే.
6 comments:
బాగా చెప్పారు.ఇలా రత్నాలు అవి నిజంగానే కొనుక్కున్నవాళ్ళు చాలామంది ఉన్నారండీ. నిజంగ స్వసక్తిని వదిలేసి ఆ రాలని నమ్ముకోవడంలో వాళ్ళకి ఎంత తృప్తో !
"కానీ కామన్ సెన్సు అనేది అంత కామన్ కాదని వీళ్ళు తెలుసుకోవాలి.".........ఇది నాకు బాగా నచ్చింది.
మరే, బాగా చెప్పారు. న్యూమరాలజిస్టులు సినిమా వాళ్లకి అడ్డగోలుగా పేర్లు మార్చేస్తారు. వడ్డే నవీన్ కి నవ్వీన్ అని,ఆశా షైనీ అనే ఆమెకు మయూరి అని మార్చేశారు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ తెర మీద మాయం అయిపోయారనుకోండి.
పేర్లను మారిస్తేనో, రాళ్లను పెట్టుకుంటేనో మారతాయా జీవితాలు? అయినా అదొక 'ఫీల్ గుడ్" పని! అంతే!
స్వశక్తి వదిలేసి కాదు, స్వశక్తితోనే వాటిని కొంటారు. కామన్సెన్స్ తమరి సొత్తే అని భ్రమలో వుండకండి, దేవుళ్ళ బూతుబొమ్మలు గీచి అందులో కళను చూసి కళాపోస చేయాలనే కామన్సెన్సు మీది, అది మరచిపోకండి. మనకు నమ్మకం లేనంత మాత్రాన ఇంకోరి మతవిశ్వాసాలను మలిన పరచి ఆనందించేది మృగసెన్సు అవుతుంది కాని కామన్సెన్స్ అవదు కదా?
ఏదో చెప్పామా మన ఫీజు తిసుకున్నామా అంతే.అదే టీవీలో అయితే మన ప్రోగ్రాం అయ్యిందా లేదా అంతే.
____________________________________
LOL
ఎనోనిమస్సూ, ఈ మూఢ నమ్మకాలకీ మతానికీ సంబంధమేమిటో కాస్త వివరిస్తారా?
దేవుళ్ళ బూతుబొమ్మలు గీచి అందులో కళను చూసి కళాపోస చేయాలనే కామన్సెన్సు మీది, అది మరచిపోకండి
____________________________________
LOLOL :))
Post a Comment