నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 16, 2010

జగన్ బాబూ కొంచెం ఒరిజినాలిటీ చూపించు ప్లీజ్!

ఏ రంగంలో నైనా ఒరిజినాలిటీ ఉంటేనే రాణించడానికి విలవుతుంది. గాన గంధర్వుడు అని గొప్పగా పొగిడించుకొన్న ఘంటసాల లాగా పాడాలని ప్రయత్నించి ఎందరో గాయకులు విఫలమై పోయారు.ఆ మూస లోంచి బయట పడి తనదైన స్వంత బాణీలో పాడబట్టే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పది కాలాలు నిలవగలిగాడు.

ఇప్పుడు వై ఎస్ జగన్ తన మాటల్లో హావ భావాలలో తన తండ్రి అయిన రాజ శేఖర్ రెడ్డిని అనుకరించాలని ప్రయత్నిస్తున్నాడు.చేతిని ఊపడంలో. కాబట్టీఈఈఈఈ చేస్తా మూఊఊఊఊ అని ప్రతి మాట వెనక ధీర్ఘం తీయడం లోనూ నూటికి నూరు పాళ్ళూ తన తండ్రిని గుడ్డిగా అనుకరిస్తున్నాడు.కానీ ఎంత విజయవంతమైన స్టైలు అయినా అది ఒకరికే పనికొస్తుబంది. గుడ్డిగా అనుకరించే వాళ్ళకి అంతగా విజయం చేకూర్చక పోవచ్చు.

అచ్చు తన తండ్రిలా ఉన్నాడు అనిపించుకోవాలని జగన్ తపన కాబోలు.ఎవరికైనా జగన్ ఉపన్యాసాన్ని కళ్ళు మూసుకొని కేవలం సౌండ్ మాత్రం వింటే ఎవరో మిమిక్రీ కళాకారుడు వైఎస్సార్ ని అనుకరిస్తున్నట్లనిపిస్తుంది కానీ మరొక నాయకుడు మాట్లాడుతున్నట్లనిపించదు.

జగన్ వెనక చుట్టుపక్కల ఉండే భజనగాళ్ళు ఈ విషయం అతనికి తెలియజేస్తే బావుంటుంది.

1 comment:

Anonymous said...

nice for him to know that some one is observing him too ..

Is anyone listening/caring him?