నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, April 22, 2010

క్రీమీ లేయర్ కి రిజర్వేషన్ అవసరమా?

ఎక్కడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజిలో గానీ ఇంజినీరింగ్ కాలేజిలో గానీ సీట్లు తెచ్చుకున్న వాళ్ళ ర్యాంకులు చూస్తే కొంతమందికి గుండె రగిలిపోతుంది.ముఖ్యంగా మెడిసిన్ లో ఇరవై ముప్పై వేలు ర్యాంకుతో సీట్లు తెచ్చుకొనే వాళ్ళు ఉంటారు.మూడు నాలుగు వేలు ర్యాంకుతో సీటు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు.ఈ వేలలో ర్యాంకుతో సీటు వచ్చిన వాడు బాగా వెనక బడ్డ వాడా అంటే అదేమీ ఉండదు.అమ్మా అబ్బా ఏ డాక్టర్లో లక్షలు,కోట్లు లంచాలు మింగే ఉద్యోగస్తులో అయి ఉంటారు.

రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని ఇందులో నేను రాయడం లేదు.ఈ పోస్టు టాపిక్ ఏమిటంటే ఉన్నతోద్యోగుల పిల్లలకి,అధిక ఆదాయ వర్గాల పిల్లలకీ రిజర్వేషన్లు అవసరం లేదు అన్నదే ఇక్కడ టాపిక్.

ఆర్ధికంగా,సామాజికంగా వెనకబడ్డ వారికి రిజర్వేషన్ అవసరం అన్నది రిజర్వేషన్లు పెట్టిన ముఖ్య ఉద్ధేశ్యం.మంచిదే,అయితే ఈ వెసులుబాటు ఉపయోగించుకొని లాభపడ్డాక ఆ కుటుంబం ఎంత మాత్రం ఆర్ధికంగా వెనకపడ్డ కుటుంబం కాదు.ఇప్పటి సమాజంలో డబ్బు ఉంటే సామాజిక వెనుకబాటుతనం కూడా ఏమాత్రం ఉండాదనుకోండి అది వేరే విషయం.
ఈ అర్ధికంగా బలపడ్డ కుటుంబాలని రిజర్వేషన్ పరిధిలోంచి తొలగిస్తే మరొక అర్ధిక, సామాజిక బలహీనుడికి ప్రయోజనం చేకూరుతుంది కదా!అయినా ఏ ఒక్క కుల సంఘం కూడా దీనికి ఒప్పుకోదు.

ఈ క్రీమీ లేయర్ ని రిజర్వేషన్ పరిధిలోంచి తొలగించడం వల్ల నిజమైన బలహీనులకి ప్రయోజనం చేకూరుతుంది.ఈ దిశగా ఉద్యమించాల్సింది బీసీ,ఎస్సీ,ఎస్టీ లలో వాస్తవాన్ని అంగీకరించి నిజమైన అభాగ్యులకోసం పోరాటం చేయగలిగిన వాళ్ళే.కులం పేరు చెప్పి డబ్బు చేసుకొనే పందికొక్కులు కాదు.
కాబట్టి ఇప్పడైనా ఆ వర్గాలలో కొంచెం ఆలోచన చేసే వాళ్ళు ఈ దిశగా పోరాటం చేస్తే రిజర్వేషన్లు పెట్టిన ఉద్ధేశ్యం నెరవేరుతుంది.కనీసం కొన్ని దశాబ్ధాలకైనా ఈ రిజర్వేషన్లని శాశ్వతంగా ఎత్తివేయవచ్చు.అప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుంది.

4 comments:

చెరసాల శర్మ said...

CPM నాయకుడు రాఘవులు గారు కూడా క్రీమీ లేయర్ వర్గాన్ని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలనే డిమాండ్ కి మద్దతు ఇచ్చారు.

Giri said...

తల్లి దండ్రులలో కనీసం ఒకరు రిజర్వేశన్లో ఉద్యోగం కానీ, లేక ప్రొఫెషనల్ కోర్సులో సీటు గానీ సంపాదిస్తే, పిల్లలకి రిజర్వేషన్ రాకుండా చేస్తే బాగుంటుంది.

ఆదాయం ప్రకారం అంటే మన దేశంలో మోసపోయేది ఉద్యోగులు మాత్రమే. వ్యాపారులు, ఆక్టర్లు, వైద్యుల ఆదాయాలకి లెక్క ఉండదు.

శరత్ 'కాలమ్' said...

అవసరం లేదు.

కెక్యూబ్ said...

ఓట్ల రాజకీయాలు సాగినంతకాలం ఇది సాధ్యం కాదు బ్రదర్..