చంద్ర బాబు గారి అరవయ్యవ పుట్టిన రోజు నేడు.అధికారం కోల్పోయిన చాన్నాళ్ళకి ఆయన మళ్ళీ అదికారం కైవశం చేసుకోగలన్న నమ్మకంతో జరుపుకొంటున్న పుట్టిన రోజు ఇది కావచ్చు.వై ఎస్ మరణం ఈ నమ్మకానికి కారణ అన్నది నిర్వివాదాంశం.
ఏదేమైనా ఆంధ్ర ప్రదేశ్ ని ఐటీ దారి పట్టించి ఎందరో యువతీ యువకుల బంగారు భవితకి మార్గాన్ని తెరిచిన దార్శనికుడాయన.కాకపోతే తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు రైతులని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం ఉద్యోగుల చేత పని చేయించాలన్న తపనతో వాళ్ళని దూరం చేసుకోవడం ఆయనకి మైనస్ అయ్యింది.
రాబోయే ఎన్నికలలో ఆయన గెలిచి ముఖ్య మంత్రి పీఠం అధిరోహించడం రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతైనా అవసరం.ఆయన గెలిస్తే రాష్ట్రం బంగారు కాంతులతో నిడి పోతుందని కాదు.రెండు సార్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిచి అధికారం అనుభవించారు.అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ప్రజా సంక్షేమం అన్న ముసుగులో అవి మరుగున పడి పోయాయి.ఈ సారి గెలిస్తే వాళ్ళకి అడ్డు లేకుండా పోతుంది.అవినీతి ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకోరు అని నిశ్చయించుకొని రెండు చేతులా రాష్ట్రాన్ని భోంచేసి ప్రజలకి సంక్షేమం అని నాలుగు ఎంగిలి మెతుకులు పడేసి తమ భక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. దీన్ని నివారించడానికైనా ఈ సారి చంద్ర బాబు ముఖ్యమంత్రి అవాలి.
ప్రకృతిలొ ఒక చెక్స్ అండ్ బ్యాలన్స్ మెకానిజం ఉంటుంది.అది పని చేసి ఈ సారి బాబుని అందలం ఎక్కిస్తుంది.
కాబట్టి బాబూ బీ హ్యాపి!!!
5 comments:
Well said
....కాబట్టి బాబూ బీ హ్యాపి!!!
చిన్న సూచన అండీ,హోప్ యౌ విల్ టేక్ ఇట్ యాజ్ కన్స్స్ట్రక్టివ్ క్రిటిసిజం.మీరు కూడా మన తెలుగు చానెళ్ళ వాళ్ళ లాగ చంద్ర భాబు గారిని బాబు అనడం బావుందనిపించలెదు నాకు.
ఫ్స్:నేను ఆయనకి ఫ్యాన్ నో కూలర్ నో కానండోయ్
అంగీకరిస్తున్నాను.పూర్తి పేరు టైపు చేయడం కష్టమనిపించి అలా రాశాను.నేనూ ఆయనకి ఫానునో కూలర్ నో కాదు.కానీ ఈసారి ఆయన సీఎం కావడం ఒక చారిత్రక అవసరం అని నా ఉద్ధేశ్యం.
>> "రైతులని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం"
వరసగా నాలుగైదేళ్లు వర్షాలు పడకపోతే రైతుల్ని దేవుడు నిర్లక్ష్యం చేసినట్లు, చంద్రబాబు కాదు :-)
>>"ఉద్యోగుల చేత పని చేయించాలన్న తపనతో వాళ్ళని దూరం చేసుకోవడం ఆయనకి మైనస్ అయ్యింది"
ఇలాంటి జనాల్ని ఉద్దరించాలన్న తపనా, దానికోసం విజన్లూ అనవసరం అన్న జ్ఞానం ఆయనకి ఇప్పటికైనా వచ్చిందో లేదో.
అబ్రకదబ్ర గారూ,విజన్లు తరువాత లేదు అన్న పదం మరిచిపొయ్యారు.
Post a Comment