నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, April 15, 2010

బంగారు బురఖా-కొంచెం జాగ్రత్త సానియా బాలికా

సానియ మీర్జా పెళ్ళి గురించి మన వద్ద మీడియా అతి చెసింది కాని జనం పెద్దగా పట్టించుకోలేదు.అక్కడక్కడా శివసేన లాంటి వాళ్ళ హడావిడి తప్ప.కానీ పాకిస్తాన్లో ఈ పెళ్ళి చేస్తున్న సంబరం అంతా ఇంతా కాదు.ప్రభుత్వ వేడుక లాగా అధికారిక ప్రతినిధులూ,బహుమతులు...అబ్బో అంతా ఇంతా అని చెప్పనలవి కాని వేడుక వాళ్ళకి.బంగారు కిరీటం,లోపల ఏముందో తెలియని మిస్టరీ గిఫ్టుతో ఒక మంత్రిత్వ శాఖ ప్రతినిధీ,సానియా షోయబ్ ల బొమ్మలతో టీ షర్టులూ ఇలా గోల గోలగా ఉంది పాక్ లో.

అయితే ఈ అన్నింటిలోకీ కొట్టవచ్చినట్టు కనిపించేది ఒక బహుమతి ఉంది.అది బంగారు జరీతో చేసిన ఒక బురఖా.బహుశా ఇది సానియాకు ముందస్తు హెచ్చరిక ఏమో.మోకాళ్ళ పైకి స్కర్టులూ,పొట్టి చేతుల షర్టులూ వేసుకొని టెన్నిస్ ఆడటం ఇకపై వీలుకాదని ఒక సున్నితమైన హెచ్చరిక ముందుగానే జారీ చెసినట్టు అనిపించడం లేదూ దీన్ని చూస్తుంటే?

అయినా టెన్నిస్ లో కొనసాగడం వల్ల ఇకపై సానియా సాధించేది పెద్దగా ఉండబోదని ఇప్పటికె చాలామంది నిపుణుల అభిప్రాయం.అమ్మడి ర్యాంకు ఇప్పతికె ఎక్కడికో వెళ్ళిపోయింది.సింగిల్స్ లో గ్రాండ్ శ్లాం మెయిన్ డ్రా చేరే సత్తా ఆమెలో ఇప్పుడు లేదు.మంచి పార్ట్ నర్ దొరికితే డబుల్స్ లో కొద్దొ గొప్పో లాక్కురాగలదేమో గానీ మెడల్సూ చాంపియన్ షిప్పులూ గెలిచే సీన్ ఇప్పుడు లేదు.

అలాంటిది ఆమెకు పెళ్ళయ్యాక మా దేశానికి ఆడాలంటే మా దేశానికి ఆడాలని పాకిస్తానోళ్ళూ ఇండియా వాళ్ళూ గింజుకోవడం శుద్ధ దండగ.

తన మానాన తనని వదిలేస్తే ఎక్కడొ పాక్ లోనో దుబాయి లోనో నిండుగా బురఖా తొడుక్కొని షోయబ్ మాలిక్ కి కాబోయే పెళ్ళాల జెనానాకి పెద్ద పెళ్ళం లాగా హాయిగా బతికేస్తుంది.ఖుదా హఫీజ్!

3 comments:

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

ఏ చెట్టూలేని చోట ఆముదం చెట్టు మహా వృక్షమే కదండీ. సానియా రాకముందు మన దేశం పరిస్థితి కూడా అదే. పాకిస్తానులో అయినా దుబాయిలో అయినా టెన్నిస్ మీద జనాలకు ఆసక్తి కలగటానికి సానియా కూడా కారణమే. అందుకే ఇదంతా.

Anonymous said...

Manchi blogbagundi. plz check my site for Telugu Cinema News, Photos & Reviews