నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, April 22, 2010

వైఎస్సార్ Vs చంద్రబాబు-2

లోగడ ఇదే టైటిల్ తో ఒక పోస్టు పెట్టాను.ఇది రెండవ భాగం.

వైఎస్ కీ చంద్రబాబుకీ ఒక ముఖ్య మైన తేడా ఏమిటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహరించిన తీరు.చంద్రబాబు ఉద్యోగుల దుంప తెంచేవాడు పని చేయండ్రా అని.నెను నిద్ర పోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అని కూడా అన్నట్లు పత్రికల్లో వచ్చింది.ఒక గ్రామ సభలో ఒక అధికారి ఆయన సమక్షంలో గుండెపోటు వచ్చి చనిపోయాడు కూడా.
See full size image

సహంజగానే తీసుకొనే జీతనికీ చేసే పనికీ ఏమాత్రం పొంతన లేని ఉద్యోగులకి ఈ వ్యవహరం నచ్చలేదు.అందుకె 2004 ఎన్నికలలో వాళ్ళు మూకుమ్మడిగా ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు.చాల చోట్ల రిటర్నింగ్ ఆఫిసర్లు వోటు వేయడం తెలియని వాళ్ళవీ చూపూ సరిగా లెని వాళ్ళవీ వోట్లు వాళ్ళు సైకిల్ అని చెప్పినా హస్తమ్మీద వేశారని చాలా మంది ఉద్యోగులే ఒప్పుంటారు.

వై ఎస్ ఈ పొరబాటు చేయలేదు.ఆయన ఉద్యోగస్తులకి చాలా వెసులుబాటు కలిగించారు.ఖచ్చితంగ పని చెసి తీరాలని పట్టుబట్టి వాళ్ళ పీకల మీద కూర్చోలేదు.టేకిటీజీ పాలసీలో పరిపాలన నడిపారు.లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా ఉద్యోగంలోంచి సస్పెండ్ అవ్వాల్సిన పని లేదని,విచారణలో దోషి అని తేలే దాకా ఉద్యోగం చేసుకోవచ్చనీ ఒక జీవొ కూడా ఇచ్చారు.

ఇంత చేసినా 2009 ఎన్నికలలో తాము బొటాబొటీగానె నెగ్గడం ఆయన్ని నిరాశ పరిచింది.అందుకే రెండవసారి గెలిచాక ఉద్యోగులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలలో తనని తన పార్టీని డిస్టింక్షన్ తో గెలిపించే భాధ్యతని ఆయన ఉద్యోగస్తులమీద పెట్టారు."మీకేం కావాలన్నా ఇస్తాం మమ్మల్ని బంపర్ మెజారిటీతో గెలిపించే పూచీ మీదే" అని అన్నారు.

ఆయన బ్రతికి ఉంటే వాళ్ళకోసం ఏమేమి చేసి ఉండే వాడో ఏమిచ్చి వాళ్ళని తమ శాశ్వత అనుయాయులుగా తిప్పుకొని ఉండేవాడో గానీ విధి ఆడిన కౄర నాటకంతో ఈ ప్రశ్నకి జవాబు లెకుండా పోయింది.

7 comments:

Anonymous said...

విధి ఆడిన వింత నాటకంలో వై.ఎస్. మృతే సరైన జవాబు . ప్రకృతి ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటుంది . వై.ఎస్సే బ్రతికుంటే రాష్ట్రం వల్లకాడు అయిపోయేది

Anonymous said...

అడ్డదారిలో అధికారంలోకి( ఉద్యోగస్తులు, ఈ.వి.ఎం ల వలన ) వస్తే ఇలా అర్ధంతరంగా పై కెగిరిపోవాల్సి వస్తుందని వై.ఎస్ కు తెలీదు తెలిసుంటే ఈ పని చేసుండే వాడు కాదు

Anonymous said...

కేవలం ఉద్యోగస్తులు తమ వర్గ ప్రయోజనాల కోసం రావణాసురున్ని గెలిపించారు. అతగాడేమో రాష్ట్రాన్ని వల్లకాడు చేసి ...క్క చాచు సచ్చాడు

Anonymous said...

2014 వరకూ ఈ రావణాసురుడు బ్రతికుంటే డ్యూటీకి రాకపోయినా నెలనెలా జీతం ఇంటికి పంపే పధకం ప్రారంభించి ఉండేవాడు . పాపం ఉద్యొగస్తులు . ఒక మంచి సేవకుడిని కోల్పోయారు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్సూ ఈ కామెంట్లు అన్నీ ఒక్కడివేనా?

రవిచంద్ర said...

అందులో సందేహమేముంది?

Anonymous said...

what chandrababu did is action? Govt employees are not fools to accept.Initial years it seems to be all right.but later he did all the things for publicity.
he has not sanctioned money for any schemes ,rather he thought everybody in the society has to work hard to make income to the govt.He came in the power intially through backdoor politics so he and his media bombarded the public that everything is well.but nobody cheat people.
2.Don't blame govt. employees .As they are the brilliant students at their studies.Because of political support people throughing dog buscuits to them for their favour and gaining in terms of time/money/fame etc.
3Media and many of not understanding the real reason for corruption.who will fight with politicians and contractors.Will the Govt support employees if really honest?
Society and people need readymade justice they can't question and wait for the truth