రేపిస్టులారా తస్మాత్ జాగ్రత్త. మీ పాలిట,సారీ, మీ అంగాల పాలిట యమ దూతలాంటి ఒక కండోముని లండన్ కి చెందిన ఒక డాక్టరమ్మ తయారు చేసింది.
రేప్-యాక్స్ లేదా రేప్-గొడ్డలి అనబడే ఈ కండోముని తయారు చేయాలనే ఆలోచన ఎహ్లర్స్ సోనెట్ అనే ఆమెకి తను దక్షిణ ఆఫ్రికాలో పని చేస్తుండగా కలిగిందట. అత్యధికంగా రేప్ లు జరిగే దేశంగా పేరు పొందిన అక్కడ ప్రతి 17 సెకన్లకీ ఒక రేప్ రిపోర్టు చేయబతుంది. అలా ఒక బాధితురాలికి చికిత్స చేస్తూండగా ఆ అమ్మాయి ఆపుకోలేని కోపంతో బాధతో "నాకు అక్కడే గనుక పళ్ళు ఉన్నట్లయితే వాడి దాన్ని కొరికి నమిలేసే దాన్ని" అని అన్నదట.
ఆ మాటలతో ఆలోచనలో పడ్డ సోనెట్ కి అక్కడ పళ్ళు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి దానికి ఆమె ఇచ్చిన రూపమే ఈ రేప్-యాక్స్.
ఇది ఒక ఫిమేల్ కండోం.అయితే దీనిలో లోహపు పళ్ళు ఉంటాయి.దీన్ని తమ మర్మాగం లో పెట్టుకొన్న అమ్మాయికి ఎలాంటి బాధ ఉండదు.అయితే ఎవడైనా దుండగుడు ఆమెని మాన భంగం చేయాలని తన అంగాన్ని ఆమె మర్మాయవంలో చొప్పిస్తే ఆ లోహపు పళ్ళు దానిని గట్టిగా పట్టుకొంటాయి.
అప్పుడు కలిగే భరించలేని బాధతో వాడు తన అంగాన్ని బయటకు తీసినా ఆ లోహపు పళ్ళు వీడి పోవు.దాన్ని తొలిగించాలంటే తప్పక డాక్టర్ని సంప్రదించాల్సిందేనట.మత్తు ఇచ్చి ఆపరేషన్ తో గానీ దాన్ని తీయడం సాధ్యం కాదు.దీని వల్ల వాడిని పోలిసులకి పట్టివ్వడం కూడా సాధ్యపడుతుంది.
చాలా కాలం నుంచీ పత్రికల్లొ రేప్ కేసు గురించి చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన కలిగేది.అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవడైనా అంగ ప్రవేశం చేస్తే ఆ అంగం తెగిపోయేలా ఒక సాధనాన్ని ఆ అమ్మాయి మర్మాంగంలో ఉంచుకొనేలా రూపొందిస్తే కొంత వరకూ రేపులని అరికట్టవచ్చు కదా అని.
దీనికి ప్రేరణ ఇండియానా జోన్స్- ది లాస్ట్ క్రూసేడ్ నుంచి వచ్చింది.అందులో క్లైమాక్స్ లో విలన్ హోలీ గ్రయిల్ ఉన్న చోటికి పోబోతే రెండు పదునైన కత్తులు వచ్చి అతడి తలని కత్తిరిస్తాయి.అలాంటి మెకానిజం యోనిలోపల పెట్టడం అయ్యేపని కాదని అంతకు మించి ఆలోచించడం మాని వేశాను.కానీ సోనెట్ డాక్టరు కాబట్టి,ఆడది కాబట్టి కొంచెం తెలివిగా ధరించిన అమ్మాయికి ఇబ్బంది లేకుండా రేప్ చేయడానికి సాహసించిన వాడికి మళ్ళీ అలాంటి ఆలోచన కలగకుండా ఉండేలా శిక్షించే సాధనం కనుక్కొంది.
వెరీ వెల్ డన్ ఎహ్లర్స్ సోనెట్.
12 comments:
great idea...but, what if they misuse it....??
raccha concept....
1)how about maintenance?
2)which tooth paste is recommanded for brushing the teeth? - colgate or close-up?
3)any vajradanti type of Ayurvedic pastes?
4)is it under patent protection?
They are metallic teeth, hence no need of any paste.Patent, eh, no idea.You may contact Ms.Sonet.
Metalic or ceramic or plastic maintenance is a must. I don't know about you but I brush my teeth atleast two time in a day.
Metals do get corroded or rusted over time under moist acidic environments unless it is plated with thick gold. Gold is very expensive.
దీనివల్ల స్త్రీలకు పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోను. మానభంగ నేరపు మూలాలు యోనిలో లేవు. అవి ఆడదాని అబలాత్వంలో ఉన్నాయి. దీన్ని తయారు చేసినవారికి అసలు మానభంగం ఎలా జరుగుతుందో ఆ గ్రౌండ్ లెవెల్ ప్రక్రియ గురించి అవగాహన లేదు. వారి దృక్కోణం - సినిమాల్లో చూపించినట్లు మగవాడు ఆడదానితో కలియబడి ఆ తరువాత ఆమెలోపలికి బలవంతంగా చొరబడతాడు అని ! ఇదొక పిల్లకారు ఐడియా. ఇది వాస్తవం కాదు. రేపిస్జ్టులంతా మానభంగానికి ముందు ఏ ప్రొవొకేషనూ లేకుండానే ఆడదాన్ని స్పృహ తప్పేలా చావగొడతారు. ఆ తరువాతనే ఆమెని మానభంగం చేస్తారు. అంతే కాక సాధారణంగా మానభంగాలనేవి మగవాడికి స్త్రీశరీరం సహకరించడం వల్లనే జరుగుతాయి. ఈ కండోమ్ గురించి తెలిసిన రేపిస్టు ముందు దాన్ని ఆమె శరీరంలోంచి తీసిపారేసి ఆ తరువాత అసలు పనికి ఉపక్రమిస్తాడు.
ఇది మంచి ఐడియానే, కానీ ఎంతవరకు ఫలితాలనిస్తుంది అనేది తెలీదు. ఇంకొక ముఖ్య విషయం. ఇది ఎంతమందికి అందుబాటులో ఉంటుంది అనేది? సాధారణంగా మానభంగాలు అనేవి "పోష్" స్త్రీలకి జరగవు. మధ్యతరగతి, పల్లెటూరి జానలకే జరుగుతాయి. వారికి ఇది అందుబాటులో ఉంటుందా? ఉన్నా వాడుకునే అవకాశం సమాజం ఇస్తుందా అనేవి ఆలోంచించాల్సిన విషయాలు.
పైన అఙ్ఞాత చెప్పినట్టు మానభంగానికి ప్రధాన కారణాలు సమాజసిద్ధంగా వచ్చిన "బేలతనం", హక్కులు తెలీని "అమాయకత్వం", ఎదురుతిరగలేని "సున్నితత్వం". నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. రేప్ చెయ్యబడేటప్పుడు బలంగా దాన్ని తన్నితే ఆ మగవాడు చస్తే పైకి లేవలేడు కదా ఇలా ఎందుకు అమ్మాయిలు చెయ్యరు అని? తరువాత అర్థమయ్యింది ఆ "బలం", "విశ్వాసం" అమ్మాయిలలో లేవు అని. ఇలాంటి పరికరాలు కనిపెట్టడం మంచిదే అయినా బలం, విశ్వాసం ఆడవాళ్ళకి కలిగించడం ఇంకా ముఖ్యం.
ఇంకొకటి గేంగ్ రేప్స్ అనేవి పెరుగుతున్నాయి ఈ కాలంలో. ఎంత బలవంతురాలైనా ఒక్క స్త్రీ ఒక "గేంగ్" ని ఎదురుకోవడం కష్టమే. ఆ లెక్కన చూస్తే ఒక స్త్రీ మాత్రమే కాదు ఒక్క "పురుషుడు" కూడా గేంగ్ ని ఎదుర్కోలేడు అది సినిమా అయితే తప్ప.
ఇవన్ని పోవాలంటే మనుషుల్లో పైశాచికత్వం పోవాలి. ఆభిజాత్యం పోవాలి. సమానత్వం పెరగాలి.
ఇవన్నీ పక్కనపెడితే, ఇలాంటి పరికరం ఒకటి కనిపెట్టలనే ఆలోచన వచ్చినందుకు సోనెట్ కి జోహార్లు. కనిపెట్టినందుకు అభినందనలు. దీని గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
Thank you Sowmya.
బలంగా దాన్ని తన్నాలనే సౌమ్య గారి అవుడియా దివ్యంగా వుంది, ఐతే ఆ రేపిస్ట్ కాళ్ళు ఎడం చేసి 'హుందాగా ' అందుకు సహకరించే 'అభిజాత్యం' వుండదని గ్యారంటీ ఏమిటి? నయానో భయానో అతన్ని ఒప్పించాల్సి వుంటుంది.
ఎనోనిమస్సూ, రేపిస్టు కాళ్ళు ఎడం చేసి కాళ్ళ మధ్యలో తన్నించుకొంటే వాడికి పేలిపోతుంది.ఆ తరువాత పగిలి పోతుంది.కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు.
నీ అభిజాత్యం చూపుకున్నావుగా
What and how?
Post a Comment