నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 21, 2010

తుఫానులకి పెట్టాలంటే మన పేర్లు లేవా?

తుఫానులకు పేర్లు పెట్టడం మనవాళ్ళు ఈమధ్య కొత్తగా నేర్చుకొంటున్నారు.ఇది అమెరికావాళ్ళను చూసి నేర్చుకొటున్న అలవాటు.ఆమధ్యన అమెరికా వాళ్ళు ఒక తుఫానుకు,వాళ్ళు దానిని హరికేను అని పిలుస్తారు, కత్రినా పేరు పెట్టడం నాకు భాధ కలిగించింది. కత్రినా కైఫ్ ఎంత అందంగా,నాజూగ్గా ఉంటుంది!అలాంటిది ఆమె పేరు అంత విధ్వంసకర తుఫానుకు పెట్టడం ఏమైనా పద్ధతిగా ఉందా అని ఆ పేరు పెట్టిన వాడినడుగుదామనిపించింది.అయినా వాడెవరో గాని కత్రినా కైఫ్ మొహం చూడని వాడైఉంటాడ్లే అని . సర్దుకొన్నాను

ఆయిన మనవాళ్ళకి తుఫానులకు పెట్టడానికి పేర్లే లేనట్టు ఈ ఐలా,లైలా లాంటి పేర్లేమిటండీ? విధ్వన్సాన్నీ,వినాశనతనీ సూచించడానికి మనకి పేర్లు కొదవా?ఒక్కసారి అలా పురాణాలు తిరగేస్తే చాలదూ?
తటకి, పూతన, శూర్పణఖ,లంఖిణీ,శాఖిణీ.ఢాఖిణీ, ఇలా ఎన్ని పేర్లు లేవు?

ఆయిన ఇలాంటి నాశనం చేసేవాటికి అన్నిటికీ ఆడపేర్లే పెట్టడం ఏమిటని ఫెమినిస్టులు గొడవ చేస్తే మగ పేర్లు కూడా ఉన్నాయి కదా?
కంస,రావణ,నరకాసుర,హిడింబాసుర, మారీచ, సుబహు,హిరణ్యాక్ష, హిరణ్య కశ్యప ఇలా ఎన్ని లేవు?

కాబట్టి వాతావరణ శాఖ వాళ్ళూ కొంత నేటివిటీ చూపండి.

9 comments:

Nachiket said...

ఈ పేరు పెట్టింది మనవాళ్ళు కాదు, పాకిస్తాన్. దీని తరువాతి తుఫాను పేరు బందూ, శ్రీలంక వారు ఇచ్చిన పేరు.

Anonymous said...

ఇల్లు కాలి ఒకడు ఎడుస్తుంటె చుట్ట అంటించుకోడానికి నిప్పడిగాట్ట నీలంటొడు...

Anonymous said...

http://en.wikipedia.org/wiki/Lists_of_tropical_cyclone_names

Anonymous said...

Shame on you
pay homage to the lost souls and shed a tear for the unfortunate

praseeda said...

తుపాన్లకీ, భూకంపాలకీ పేర్లు పెట్టడంకంటే వాటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొని, ప్రాణనష్టమూ, ఆస్థి నష్టమూ కలగకుండా కాపాడుకున్నారన్న మంచి పేరు తెచ్చుకోవడం ముఖ్యం.

vijay said...

you guys are over reacting.. seems u r no lessthan politicians who take every opportunity to make controversies. U surpassed them because even they didnt commented on names. they are not naming it for fashion. And americans doesnt know who the heck katrina is..

http://ibnlive.in.com/news/cyclonic-storm-laila-named-by-pakistan/115770-3.html?from=tn

సుజాత said...
This comment has been removed by the author.
సుజాత said...

తటకి, పూతన, శూర్పణఖ,లంఖిణీ,శాఖిణీ.ఢాఖిణీ..కంస,రావణ,నరకాసుర,హిడింబాసుర, మారీచ, సుబహు,హిరణ్యాక్ష, హిరణ్య కశ్యప

మీరు సూచించిన పేర్లు భేషుగ్గా ఉన్నాయి.

తుఫాన్ల కు పేరు పెట్టడం 'ఫలానా ఏడాది ఫలానా నెల్లో వచ్చిన తుఫాను"అని చెప్పుకునేకంటే "పేరు"చెప్పగానే దాని రికార్డ్ అంతా సులభంగా ట్రాక్ చేయడానికే కదా! అయినా సైన్సు ఎంత అభివృద్ధి చెందినా ముందస్తు హెచ్చరికలు చేసినా జనం పారిపోయి ప్రాణాలు దక్కించుకోవచ్చు గానీ ప్రకృతికి చెక్ పెట్టి అసలు ఆస్థి నష్టం కూడా జరగకుండా చూడాలంటే అది అసాధ్యం!

Anonymous said...

Darling,

Hurricane Katrina vvasnt named after our Katrina Kaif.

I am supposing that u are being comical.

Sujataa