నేను మొదటినుండీ సౌతాఫ్రికా క్రికెట్ టీం అభిమానిని.వాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి అడుగు పెట్టినప్పటినుంచీ ఆ జట్టు నన్ను ఆకట్టుకొంటూ వచ్చింది.వాళ్ళ తొలి అంతర్జాతీయ పర్యటన భారత్ లోనే జరిగింది.క్లైవ్ రైస్ సారధ్యంలోని ఆ జట్టు తొలి రెండు మ్యాచులు ఓడిపోయి మూడవ మ్యాచ్ లో మంచి విజయం సాధించింది.
వాళ్ళు తొలి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడారు.అందులో సెమీఫైనల్ లో గెలిచే దశలో వర్షం వచ్చింది.ఆ టోర్నమెంటులో ఒక చెత్త రూలు మూలంగా 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన ఆ జట్టు పది నిమిషలు వర్షం అంతరాయం వలన ఒక బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది.అయ్యో పాపం అని బాధపడి ఆ తిక్క రూలు పెట్టిన ఆస్ట్రేలియా మెంటల్ గాళ్ళని తిట్టుకొని తరువాతి కప్ ఇంక వీళ్ళదే అని డిసైడై పోయాను.
తరువాతి కప్పు ఇండియా,లంక,పాకిస్తానులో జరిగింది.హ్యాన్సీ క్రోన్యే నాయకత్వంలొ ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపించింది.ఇమ్రాన్ ఖాన్ కూడా వాళ్ళ ఆట చూసి ముచ్చట పడి పోయి వాళ్ళ బౌలర్లు వికెట్లు తీయలేకపోతే ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ని ఔట్ చేయడానికి జాంటీ రోడ్స్ వున్నాడుగా అని కితాబిచ్చాడు.దానికి తోడు లీగ్ దశలో ఆడిన అయిదు మ్యాచులూ గెలిచి అజేయుల మనిపించుకున్నారు.కోచ్ బాబ్ వూల్మర్ తన ల్యాప్ టాప్ పైననే మ్యాచ్ గెలిపించేస్తాడన్న నమ్మకం కలిగించాడు.క్వార్టర్ ఫైనల్లొ వాళ్ళ ఖర్మ కాలి బ్రియన్ లారా అరివీరభయంకర సెంచరీ సాధించి వాళ్ళని ఇంటికి పంపాడు.
2000 కప్పులో కూడా లీగ్ దశలో ఎదురులేకుండా సాగి సెమి ఫైనల్ లో లాన్స్ క్లూసెనర్ వీరోచిత బ్యాటింగుని అలాన్ డొనాల్ద్ మూర్ఖత్వం డామినేట్ చేయడంతో ఇంటిదారి పట్టింది.
తరువాతి కప్పు సౌత్ ఆఫ్రికాలో జరగడంతో ఇంక ఈసారి అయినా వీళ్ళు గెలవక తప్పదు అనుకొన్నాను.క్రికెట్ ప్రపంచానికి కంప్యూటర్లొ ప్రత్యర్ధి జట్ల బలాలు బలహీనతల్ని విశ్లేషించి ప్రణాళికల్ని రూపొందించడాన్ని నేర్పిన జట్టు ఒక చిన్న కాన్వెంటు పిల్లవాడికి సైతం అర్ధమయ్యే విషయాన్ని అర్ధం చేసుకోలేక వర్షం దెబ్బకి వెనుతిరిగింది.శ్రీలంకతో గెలిచి తీరాల్సిన మ్యాచ్ వర్షం వలన ఆగే సమయానికి సౌత్ ఆఫ్రికా డక్ వర్త్ లూయీస్ పద్దతిలో గెలుపుకి కావలసిన పరుగులు సాధించింది.అయితే వర్షం వచ్చెముందు ఇంకొక బంతి వెయడానికి టైం ఉన్నది.ఆ బంతికి మరొక పరుగు తీసి ఉంటే విజయం దక్కేది.పరుగు తీసె అవకాశం ఉన్నా గెలిచేశం కద రిస్కు ఎందుకు అని సౌత్ ఆఫ్రికన్లు పరుగు తీయలెదు.ఇంకొక బంతి వెయడంతో ఈక్వేషన్లు మారిపోయి సౌత్ ఆఫ్రికా ఓడిపొయింది.
2007 లో నంబర్ వన్ టీముగా సెమీ ఫైనల్ చేరుకున్నా అక్కడ ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ తిని నిష్క్రమించింది.
సరే 20-20 లొ చూద్దామంటే తొలి సారి స్వదేశంలో జరిగిన కప్పులో సెమీ ఫైనల్స్ చేరకుండానే మటాషై పోయింది.తరువాతి కప్పులో సెమీ ఫైనల్లో గెలుపు ముంగిటిలో తచ్చాట్లాడి అలవాటు ప్రకారం ఓటమిని కౌగిలించుకొంది.ఈ రోజు కూడా ఒక దశలో గెలుస్తుంది అనిపించి పరాజయం పాలయ్యింది.
కాబట్టి సౌత్ ఆఫ్రికన్లని ప్రోటియాస్ అనేకన్నా చోకర్స్ అని పిలవడం బావుంటుంది.
3 comments:
సౌత్ ఆఫ్రికా మొదటి వరల్డ్ కప్ లో వాడిపోయింది...ఇంగ్లండ్ చేతిలో...ఆస్ట్రేలియా చేతిలో కాదు (13 బంతుల్లో 22 పరుగులు).
నిన్న మ్యాచ్లో 150 కొత్తలేకపోవడం అనేది చాలా దారుణం. ఎ మాత్రం ప్రణాళిక లేకుండా బాటింగ్ కి దిగి 20 ఓవర్స్ ఆడితే గెలిచేస్తాం అని అనుకున్నారు. స్లో స్టార్ట్, స్లో ట్రాక్, మంచి స్పిన్ బౌలింగ్ వాళ్ళని ముంచేసాయి.
నిజమే.నేను ఓడింది ఎవరితో అన్నది రాయలేదు.ఆడింది ఆస్ట్రేలియాలో చెత్త రూలు పెట్టింది ఆస్ట్రేలియన్లు అని మాత్రమె రాశాను.
నిజమే..నా పొరపాటు.
Post a Comment