ఒక మ్యాచ్ కి కోట్లలో పారితోషికం చెల్లింపు,కోటాను కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో,ఇవి చాలవన్నట్టు ఐపీఎల్ ద్వారా మరిన్ని కోట్లు, టీవీ పెడితే ప్రకటనల్లోనూ,వార్తల్లోనూ,ప్రత్యేక ప్రోగ్రాముల్లోనూ వీళ్ళ ముఖాలు అను క్షణం మన వద్దన్నా తప్పించుకోలేనంత హంగామా!


.jpg)
పగలు ఆట,పొద్దు పోతే తెల్లవారేంత దాకా పబ్బులూ, పార్టీలూ,చేతుల్లో సినిమా హీరోయిన్లూ,ఎక్కడికి పోయినా ఎగబడి అటొగ్రాఫులు తీసుకొనే వాళ్ళు ఎగబడి ముద్దులు పెట్టే ఆడ అభిమానులూ ... ఇంత చేసీ టీ ట్వంటీ ప్రపంచ కప్పులో సూపర్ ఎయిట్ లొ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తిరుగు ముఖం పట్టడం!






మన క్రికెటర్ల ఆట తీరు ఇదీ!అయినా వాళ్ళనని ఏమి లాభం?ఈ చెత్త వెధవలకి ఇంతలేసి చెల్లించే బోర్డునీ, ఈ చెత్త ముఖాలని నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూసే మనల్నీ తిట్టుకోవాలి.
అదే మన మహిళా క్రికెట్ టీం చూడండి.అదే వెస్ట్ ఇండీస్ లో అదే కప్పులో సెమీ ఫైనల్స్ కి చేరుకొన్నారు.పాపం వాళ్ళకి ఇంతింత పారితోషికాలు లేవు,ఇంత కవరేజి లేదు, అసలు వాళ్ళు ఆడుతున్నట్టు,ఇంత బాగా ఆడుతున్నట్టూ చాలా మందికి తెలియనే తెలియదు.



కాబట్టే వాళ్ళు అంత బాగా ఆడుతున్నారేమో?



క్రికెట్ బోర్డు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మగ క్రికెటర్లకిచ్చే పారితోషికం తగ్గించి ఆ డబ్బుతో మహిళా క్రికెటర్లని ప్రోత్సహించడం, దేశ వాళీ క్రికెట్ ని అభివృద్ధి చేయడం లాంటి పనికొచ్చే పనులు చేయడం మంచిది.మన కూడా దేభ్యం మొహాలేసుకొని వీళ్ళ ఆట చూడ్డం మానేసి కొంచెం పనికొచ్చే పనులు చూసుకొంటే మనక్కూడా మంచిది.అలా చేస్తే మన పెళ్ళాలు కూడా సంతోషిస్తారేమో!
4 comments:
chaala baga chepparu... :)
ఆడవాల్లను చూసి నేర్చుకోవడం సంగతి పక్కన పెడితే, వాల్లనే చూస్తూ మిగిలిన పనులు మానుకోకుంటే అదే పదివేలని నా అభిప్రాయం. just kidding.
"మన కూడా దేభ్యం మొహాలేసుకొని వీళ్ళ ఆట చూడ్డం మానేసి కొంచెం పనికొచ్చే పనులు చూసుకొంటే మనక్కూడా మంచిది."
దీని గురించి కాస్త సీరియస్గానే ఆలోచించాలి. అసలే ఈ IPL వచ్చిన తరువాత క్రికెట్ మ్యాచ్ లేని నెలంటూ లేకుండా పోయింది. దీని వల్ల చదువులేకాదు, ఉత్పాదకత దెబ్బతింటుందని అని పిస్తోంది.
మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? వాళ్ళూ మనుషులేనండీ, ఇదే ధోనీ 2007 లో 20-20 ప్రపంచ కప్పు సాధించినప్పుడు పొగిడారు. ఇప్పుడు ఓడిపోతుంటే తిడుతున్నారు. అన్నిటినీ సమానముగా చూడడం నేర్చుకోండి.
గెలిస్తే పొగడడము, ఓడితే తిట్టడము చేసే మీలాంటివారు ఉండడము వలనే సమాజం ఇలా తయారైంది.
-హేమ
ఓడిపోవడం గెలవడం ఆటలో భాగాలండీ.ఒప్పుకొంటాం.కానీ ఆటని సీరియస్ గా తీసుకోబట్టి అప్పుడు గెలిచారు.ఇప్పుడు ఆ సీరియస్ నెస్ లేకపోబట్టి ఓడారు.నేను ఖండిచింది దీనినే.ఈరోజు భారత కోచ్ గారీ కిర్ స్టెన్ కామెంట్లు చూసారా.జట్టులో కనీసం ఎనిమిది మంది ఓవర్ వైట్ ఉన్నారనీ కనీసం ముగ్గురు అస్సలు ఫిట్ నెస్ తో లేరనీ.ఇదంత ఐపీఎల్ వల్లా,దానివల్ల వచ్చిన పబ్బులు,పార్టీల సంస్కృతి వల్ల్నె కదా?ఏదేమైనా ఆడపిల్లలు గెలుస్తున్నప్పుడు బోర్డు వాళ్ళకి కూడా ఎంతో కొంత పారితోషికం ఇవ్వాలి కదా?
Post a Comment