బిల్డింగూ, లక్షలకు లక్షలు పోసి చేరిన విద్యార్ధులూ,ఒకరిద్దరు ముసలి,రిటైరైన ప్రొఫెసర్లు తప్ప టీచర్లు,పేషంట్లూ లేని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజి అది.
యధా ప్రకారం ఎం సి ఐ వాళ్ళు ఇన్స్ పెక్షన్ కి వస్తామని ముందుగా చెప్పడంతో కాలేజీ యాజమాన్యం అద్దె డాక్టర్లు,కిరాయి పేషంట్లతో సిద్ధమయ్యింది. రాష్ట్రం,దేశం నలుమూలలనుండీ డాక్టర్లు వచ్చేశారు.వాళ్ళు సంవత్సరం పొడవునా తాము హాజరవుతూ ఉన్నట్టు అప్పటికప్పుడు పాత తేధీలతో తయారయి ఉన్న రిజిస్టర్లలో సంతకాలు చేశారు.
ఒక రోజులో తంతు పూర్తయ్యింది.కాకపోతే చివర్లో ఒక చిక్కొచ్చి పడింది.వచ్చిన ఇన్స్ పెక్టర్లకు వీళ్ళు అందించిన ముడుపులు సరిపోలేదు.దాంతో వాళ్ళకు చిర్రెత్తి సరిగ్గా వారం తరువాత ముందస్తు హెచ్చరిక లేకుండా పరీక్షకు వచ్చేశారు.
దాంతో దొరికి పోయిన యాజమాన్యం ఒక డ్రామా ఆడింది. వార్డు బాయ్స్ నీ స్వీపర్లనీ తెల్ల కోట్లు తొడిగి డాక్టర్లుగా చూపడానికి ప్రయత్నించింది.ఇలాంటి వారిని ఎందర్నో చూసిఉన్న ఆ వచ్చిన జగత్ కిలాడీలు ఒకడిని పిలిచి నీ సంతకం చేయరా అని అడిగారు.వాడు ఇంగ్లీషులో వాడి పేరు కూడా రాయలేకపోయాడు.
దాంతో కాలేజీ గుర్తింపు రద్దయింది.తరువాత యాజమాన్యం చాలా తంటాలు పడి గుర్తింపు తెచ్చుకొన్నది.అందుకు ఇటీవలే పబ్లిగ్గా దొరికి పోయిన మోసగాళ్ళకు మోసగాడు కేతన్ దేశాయ్ సహకారం ఉందని ఒక నానుడి.
ఇదంతా నాకెలా తెలుసంటే ఆ కాలేజీలో అతిధి పాత్రలో అద్దె అసోసియేట్ ప్రొఫెసర్ గా నా కజిన్ ఉన్నాడు.సంవత్సరానికి ఒక సారి అతిధి పాత్ర పోషించినందుకు వాడికి కాలేజీ వాళ్ళే ఒక బ్యాంకు అకౌంటు తెరిచి నెల నెలా పాతిక వేలు వేస్తూ ఉంటారు. వేషం వేయడానికి పోవాలంటే ఏసీ కారు,హోటలూ సరే సరి!
3 comments:
So,.. you say your cousin is collegue of that ward boy. anTE , 'dondoo dondE'
Ano,you missed the point.Psch..psch..
Nice post and this enter helped me alot in my college assignement. Thank you for your information.
Post a Comment