నేను ఇంటర్ పూర్తయినదాకా బూతులు అస్సలు మాట్లాడేవాడిని కాదు.డిగ్రీలో చేరాక బూతులు అలవాటైపోయి అవి నా నోటివెంట ఆలవోకగా వచ్చేవి.
ఆడవారివీ,మగవారివీ జననాంగాలూ,మల ద్వారం,సృష్టి కార్యం ఇలా ఇవన్నీ ఆ బూతులలో ఉండేవి.ఒకసారి డిగ్రీ పూర్తయి బయట పడగానే బూతులు నోటివెంట రావడం ఆగిపోయింది.అప్పుడో ఇప్పుడో పట్టలేని కోపం వచ్చినప్పుడు బూతులొచ్చినా అవి నా మన్సులోనే మెదులుతాయి గానీ నోరు దాటి బయట పడకుండా జాగ్రత్త పడుతాను.
అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో దొబ్బడం,దొబ్బించుకోవడం,దొబ్బేయడం చాలా తరచుగా వినిపించడంతో అది కూడా ఒకప్పుడు నేను వాడిన సృష్టి కార్యానికి సంబంధించిన బూతు మాటేమో నని అనుమానం వచ్చింది.
సరే,దాన్ని నివారించుకోవడానికి బ్రౌన్ నిఘంటువులో చూస్తే దొబ్బడం అంటే కాయిటస్ అని అర్ధం ఉంది.తెలుగు పాటలూ సినిమాలలో బూతులు కొత్త కాదు కాని మరి ఇంత పచ్చిగా ఒక బూతు పదం వాడడం దానిని గౌరవప్రదంగా వాడడం.......
4 comments:
దొబ్బడం = తోయడం , నెట్టడం
అని లిటరల్ మీనింగ్ గా రాయల సీమ ,తెలంగాణ ఇంకా విశాఖ ప్రాంతాల్లో వుపయోగిస్తారనుకుంటా. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో పెడార్థం తీసి వాడుతారనుకుంటా.
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=dobbu&table=brown
Take meaning to your taste. :P
ivaLa, repu idi just fashion ante
కృష్ణా గోదావరి, గుంటూరు డెల్టా ప్రాంతాల్లో దొబ్బడమంటే దొంగిలించడమని అర్థం. అక్కడ అది బూతు కాదు.
Post a Comment