నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, June 21, 2010

ప్రజా రాజ్యం పార్టీకి అల్లు అరవింద్ మరణ శాసనం.

పెను తుఫాను సృష్టించాలని ఆశ పడి ఆ తుఫాను కాస్తా తుంపర వాన అయ్యాక భంగ పడి, ఆ తుఫాను కోసం ఆశ పడి వచ్చిన వాళ్ళు అసలు నిజం తెలిశాక చెయ్యిచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపలేక పార్టీని మూసేసి తిరిగి సినిమాల్లోకి వెళ్ళలేక కాంగ్రెస్సు పార్టీ చెయి చాపితే అందుకొని తోక పార్టీ అని పిలిపించుకొని ఎలాగైనా వార్తల్లో ఉండాలని బస్సు యాత్రలు గట్రా చేస్తూ రోజులు లాక్కొస్తున్న చిరంజీవికి ఆయన బావ ఆలు అరవింద్ ఒక శరాఘాతం లాంటి వార్త తెలియ జేశాడు. తాను మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన నిన్న ఒక స్టేట్ మెంటిచ్చాడు.
పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడానికి కౌంటరు తెరిచి అందిన కాడికి పోగేసుకొని చివరికి ఎంతో ఊదరగొట్టి రిలీజు చేసిన సినిమా మటాషు అని తెలిశాక పబ్లిక్కు కి మొహం చాటేసిన అరవింద్ గారు మళ్ళీ ఎందుకు వస్తున్నట్టో?

కాంగ్రెసుతో దోస్తీ కుదిరాక ఆ వంకతో మళ్ళి నలుగో అయిదో రాళ్ళు సంపాయించుకోవాడానికే అని కొంత మంది ఆయన మనసెరిగిన వాళ్ళ అభిప్రాయం.ఈ కళలో చిరంజీవికి పెద్ద అనుభవం లేదనీ తనయితే అందుకు సరిగ్గా సరిపోతాడనీ తెలిసిన అరవింద్ మళ్ళీ తెర ముందుకి వస్తున్నట్లు వాళ్ళు చెబుతారు.

ఏమో నిజమేనోమో?

1 comment:

Anonymous said...

ఉప ఎన్నికల్లో సీట్లు అమ్ముకోవడానికి మళ్ళీ వస్తున్నాడొచ్....