మామూలు కూలీలకీ వెట్టి చాకిరీ చేసే కూలీలకి ఒక తేడా ఉంది.మామూలు కూలీ ఒక పని పూర్తయ్యేంత వరకూ లేదా తనకి ఇచ్చిన డబ్బు మేరకే కూలీగా ఉంటాడు.వెట్టి వాడు అలా కాదు.తన జీవితాంతం తన యజమాని కుటుంబానికి కూలీగా ఉంటాడు.తనని నియమించుకొన్న ఆసామీ చనిపోయినా అతడి కొడుక్కి వాడూ పోతే వాడి కొడుక్కీ కూలీగా బతుకుతూనే ఉంటాడు.
నేడు మన సినిమా హీరోలకి అభిమానులమని చెప్పుకొంటున్న వాళ్ళని చూస్తుంటే వీళ్ళ బతుకులూ ఈ వెట్టివాళ్ళ లాగానే ఉన్నాయనిపిస్తోంది.
ఎవరైనా ఒక హీరోకి అభిమాని అయ్యాడంటే అతడి రూపం చూసో,అభినయం చూసో, డాన్సులూ ఫైటింగులూ చేయడంలో నేర్పరితనం చూసో అభిమానం పెంచుకొంటారు.కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని సినిమా కుటుంబాలకి గుత్తంగా అభిమానులున్నారు.
కృష్ణ మహేష్ బాబులకి జమిలిగా, చిరంజీవి,పవన్ కల్యాణ్,అల్లు అర్జున్, చరణ్ తేజ గుంపుకి కలిపి ఒక బ్యాచ్ బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీ ఆర్,కల్యాణ్ రాములకి కలిపి మరొక బ్యాచ్ ఇలా కుటుంబాలకి ఆ కుటుంబాం లోనుండి వచ్చిన వారసులకి కలిపి వీళ్ళు జీవితాంతం అబిమానులుగా ఉంటారు.
ఈ అభిమానానికి కారణం కులగజ్జీ,రాజకీయ పిచ్చీ కానీ మరొకటి కాదని అందరికీ తెలిసిన విషయమే!!
2 comments:
This is one of the valid reason's in our telugu industry movies not doing well
HI anonymous,
This is not one of the reason.
This is the only main reason.
Post a Comment