నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 10, 2010

భారత దేశం పేరు మార్చడమేమిట్రా సన్నాసీ?

నిన్న ఒక చానల్లో 10-10-10 తేదీ పైన ఒక చర్చ చూశాను. అందులో యధాప్రకారం హేతువాద శిరోమణి గోగినేని బాను ఉన్నాడు. ఇంకోవైపున ఉన్నది న్యూమరాలజిస్ట్ నెహ్రూ. ఈయన పేరు NEHRU కాదు. N..E..H..H..R..R..U. ఈ స్పెల్లింగ్ చూస్తే మీకర్ధమై ఉండాలి ఈయన ఏం చేస్తూ ఉంటాడో. ప్రజల పేర్లలో స్పెల్లింగ్ కొద్దిగా మార్చి,అంటే, ఒక అక్షరం ముందో వెనకో జోడించి వాళ్ళ భవిష్యత్తుని మార్చేస్తూ ఉంటాడు. 2010 సంవత్సరం అక్టోబరు 10 తేదీ గురించి, అందులో ఏదైనా ప్రత్యేకత ఉందా అన్నది చర్చ.
ఇంకో వైపు కామన్ వెల్త్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో సానియా మీర్జా ఆడుతూండడంతో, పెళ్ళయాక ఈ హైదరాబాదీ పిల్ల ఆటతీరు ఏమైనా మెరుగయిందా లేదా అన్న ఆసక్తితో ఈ చర్చ పూర్తిగా చూడలేదు గానీ అప్పుడప్పుడూ చానల్స్ మార్చి చూస్తున్నాప్పుడు ఒక షాక్ లాంటి విషయం నెహ్రూ గారు చెప్పారు.
అది ఆయన లోగడెప్పుడో ఇచ్చిన స్టేట్ మెంట్. దాన్ని బాబు గుర్తు చేసి ఎత్తి పొడిస్తే, నెహ్రూ దానిని సమర్ధించుకొని దానికి కట్టుబడి ఉన్నానని నొక్కి వక్కాణించడంతో నాకు షాక్ తగిలింది.

ఆయన చెప్పడమేమిటంటే, భారతదేశం పేరుని భారత్ గా మార్చిపారేస్తే దేశం ఎక్కడికో, అంటే, అభివృద్ధి మార్గంలో వెళ్ళిపోతుందని ఆయన నమ్మకం. కాదు, అలా అని సంఖ్యలన్నీ గగ్గోలు పెట్టి ఘోషిస్తున్నాయి అంటాడాయన.
ఇంకేం! మన్ మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియాలనందర్నీ ఇళ్ళకు పంపేసి, దేశం పేరు మార్చి పారేద్దాం. రెండు మూడేళ్ళకి మన దేశం అగ్ర రాజ్యమైపోయి, డబ్బులెక్కువై, ఆ డబ్బులేం చేసుకోవాలో తెలియక ప్రపంచ బ్యాంకుకి, అమెరికా, బ్రిటన్,ఫ్రాన్సులకి అప్పులిస్తూ కూర్చుంటుంది.

3 comments:

srinivas.a said...

chala bagaa rasaru.
Ilanti varivalle mudanammakalu perugutunnayi.
channels konchem aalochinchali.

కృష్ణశ్రీ said...

NEHHRRU గారికి ఇంతవరకూ తెలియదేమో--మన రాజ్యాంగం లో వున్నది "ఇండియా దటీజ్ భారత్" అనేనని!

ఇక వాడుకలో భారత దేశం అంటాం. అన్నగారైతే, "భారత్ దేశం" అనే పార్టీని పెట్టాడో, పెట్టాలని ప్రయత్నించాడో!

ఆంధ్ర భూమిలో "అ.చె" పేజీలో యెవరో "భారద్దేశం.....?" అని ప్రశ్నిస్తే, సికరాజు "రద్దేశాం!" అని జవాబిచ్చాడు!

ఈ ఛానెళ్లవాళ్లు వీళ్లకెంత పారేస్తున్నారో?

shayi said...

’నెహ్హ్రు’ గారికి తెలియదేమో .. మన దేశం పేరు ’భారత్’ మాత్రమే.
’భారత దేశం’ అని మన తెలుగువాళ్ళు అంటారు. ఉత్తర భారతీయులు ఏమని పిలుస్తారు ? ’భారత్’ అనేగా!
’భారత దేశం’ అంటే ’భారత్’ అను పేరు గల దేశం అని అర్థం.
మన దేశం పేరుతో పెట్టిన BHEL, BDL మొదలైన కంపెనీ పేర్లలో B అంటే ’భారత్’ అనే కదా ఉంది.
’గంగా నది’ అంటాం. ఆ నది పేరు ’గంగ’ అవుతుంది కాని పేరులో కూడా ’నది’ ఎందుకు ఉంటుంది?
ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వారు కూడా శాస్త్రాలు చదివి సమాజానికి మార్గదర్శనం చేయబూనడం మన ఖర్మ!