నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 3, 2010

జగన్ ఓదార్పు దేవతా వస్త్రాలు

చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒక రాజు దేవతా వస్త్రాలు అని బట్తలేమీ లేకుండా దిగంబరంగా వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ దేవతా వస్త్రాలు తమకి కనబడలేదంటే తమలో ఎక్కడ లోపం ఉందనుకుంటారోనని ఎవరూ ఆ రాజు నగ్నంగా ఉన్నాడని చెప్పరు. చివరికి ఒక పిల్లవాడు ఆ సంగతి పెద్దగా చెప్పాక అందరూ పెద్దగ ఆ విషయం చెప్పడానికి సాహసిస్తారు.
ఇప్పుడు జగన్ ఓదార్పు విషయంలో నాకు ఆ కథే గుర్తుకొస్తూంది. తన యాత్ర ప్రజలని ఓదార్చడానికే అని జగన్ నమ్ముతూ ఉన్నట్లు అతనూ, అతని మీడియా, సాక్షి పేపర్, చానల్ అదేపనిగా ఊదర గొట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అదే విషయాన్ని అతని వెంట ఉన్న చెంచాలు కూడా పదే చెప్పడం దాన్ని అందరి చేతా నమ్మించడానికి ప్రయత్నించడం అంత అర్థం కాని విషయం కాదనుకున్నా, థూచ్ ఇది ఓదార్పు కాదు అని ఎన్నో సార్లు ఎంతో మంది బ్లాగర్లు విప్పి చూపుతున్నా వాళ్ళు ఏమాత్రం తొణక్కుండా తమ యాత్రని కొనసాగిస్తూ ఒక అబద్దాన్ని తాము నమ్మడమే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరిచేతా నమ్మించాలని ప్రయత్నిస్తూండడమే ఆశ్చర్యంగా ఉంది.

13 comments:

Anonymous said...

మంచిగ ఓదారుస్తున్నడు. తెలంగాన కెప్పుడొస్తాడొ, లచ్చ రూపాయలిచ్చి ఎప్పుడోదారుస్తడో అని సూత్తున్నం.

jaggampeta said...

odarpu anne idenaa ?

Anonymous said...

ఫ్లాష్ న్యూస్ ఓదార్పు యాత్ర లో ఉన్న జగన్ కి కరంట్ షాక్ కొట్టి మరణించారు

rakthacharithra said...

ఫ్లాష్ న్యూస్:-
ఈ విషయం విన్న కెసిఆర్ ఆనందం తో గుండె ఆగి మరణించాడు.
కరంట్ షాక్ తగిలిన జగన్ఆసుపత్రి లో కోలుకొంటున్నాడు.

blogyama said...

inkaa yentha mandhiki shock istavau nayinaa

Anonymous said...

దీన్ని జగన్ ఓదార్పు క్రూ యల్ యాత్ర అని కూడా చెప్పొచు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Cruel?Please explain.

Anonymous said...

సోనియా చెప్పినట్టు జనాన్ని ఒకచోట చేర్చి ఇవ్వదలుచుకున్నదేదో ఇచ్చేస్తే ,బాగుండేది. జగ న్ని చూడటానికి వస్తు తొక్కిసలాట లో మరణించినవారు,రాకపోతే ఆత్మహత్యలు
చేసుకొని చని పో యినవాళ్లు ఇలా లిస్టు పెరుగుతూ నే వుంది.ఇది అమాయక జనంలో అనవసర భావోద్వేగాలను రెచ్చ గొట్టడమే.ఇది cruelty కాదా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes.Got you.

sree said...

ఎవరో రాలేదని ఆత్మహత్య చేసుకుంటాం అనేంత వెర్రి వెధవలని ఎక్కడా చూడలేదు. దేవుడా ఎందుకయ్యా ఇలాంటి వాల్లని మా రాష్ట్రం లో పుట్టించావు?

Anonymous said...

వస్తాడు మా జగన్ ఈరోజు
రానే వస్తాడు ఓదార్చ ఈరోజు
తెస్తాడు లక్ష ఈరోజు
రావాలి నా చావు ప్రతిరోజు

sree said...

ఒకప్పుడు ఎవరిపైన అయినా బాగా కోపం వస్తే.. నీకు దినం పెట్ట అని తిట్టేవాల్లు. ఇక మీదట "నీ ఫేమిలీ ని జగన్ ఓదార్చ" అని తిట్టోచ్చు!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Ano and Sree very nice.