నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, October 19, 2010

టైటిల్ కోసం గొడవ పడ్డ ఏ సినిమా బతికి బట్టకట్టలేదు

ఖలేజా సినిమా టైటిల్ గొడవ సద్దుమణగక ముందే మరొక టైటిల్ వివాదం మొదలైంది. మహేష్ బాబు తన సినిమా టైటిల్ ఖలేజా అని ప్రకటించగానే ఒక చిన్న నిర్మాత ఆ టైటిల్ తనదనీ, తాను దాన్ని అంతకు ముందే రిజిస్టర్ చేసుకున్నాననీ తెర మీదికొచ్చాడు. దాంతో మహేష్ సినిమాకి మహేష్ ఖలేజా అని పేరు మార్చేశారు. ఆ చిన్న  నిర్మాత దీని మీద కోర్టుకెళ్లడం కోర్టు ఆ కేసు కొట్టి వేయడం తెలిసిందే. 


ఈ గొడవంతా చూసి సినిమాకి ఖలేజా అన్న పేరు చాలా ముఖ్యమేమో అనుకొని సినిమా చూస్తే అసలు ఖలేజా అన్న పేరుకీ సినిమాకి సంబంధం లేనేలేదు. సరే కావాలనుకున్న పేరు పెట్టుకున్నా సినిమా ఫ్లాప్ అయ్యింది వేరే సంగతి. 


ఇప్పుడు అదే రీతిలో కత్తి అన్న టైటిల్ పైన గొడవ జరుగుతోంది. కత్తి అన్న పేరుతో రవితేజ హీరోగా గుణశేఖర్ ఒక సినిమాని, అదే పేరుతో కళ్యాణరామ్ ఒక సినిమాని అనౌన్స్ చేశారు. ఇద్దరూ ఎవరికి వారు తమ సినిమాకి కత్తి టైటిల్ చాలా కీలకం అని చెప్తున్నారు. కళ్యాణరామ్ ఖలేజ దారిలో వెళ్ళి తన సినిమాకి  కళ్యాణరామ్ కత్తి అని టైటిల్ ఫిక్స్ చేశాడు.
 
టైటిల్ గొడవ విషయానికొస్తే చాలా కాలం క్రితం సామ్రాట్ అన్న టైటిల్ విషయంలో జరిగిన గొడవ గుర్తుకొస్తూంది.


మహేష్ బాబుకి రమేష్ అని ఒక అన్న ఉండేవాడు. కృష్ణ గారి పెద్ద కోడుకన్నమాట. అతన్ని హీరోగా పరిచయం చేయడానికి ఒక సినిమా తీస్తూ దానికి సామ్రాట్ అన్న పేరు ఫిక్స్ చేశారు. అదే పేరుతో బాలకృష్ణ మరొక సినిమా అనౌన్స్ చేశాడు. పెద్ద గొడవ జరిగాక బాలకృష్ణ సినిమాని సాహస సామ్రాట్ గా మార్చారు. కొసమెరుపేమిటంటే రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
 
కాబట్టి కథలో బలం, సినిమాలో దమ్ము ఉంటే టైటిల్ ఏదయినా సినిమా ఆడుతూంది. ఉదాహరణకి రజనీ కాంత్ తాజా సినిమా తెలుగు, హిందీలలో రోబో, తమిళంలో ఎంతిరన్. కానీ రిజల్టు మాత్రం ఒకటే-సూపర్ హిట్. అంచేత టైటిల్ కోసం గొడవ పడే బదులు ఆ సమయాన్ని, శక్తినీ కథా కథనాల మీద పెట్టండి బ్రదర్స్.

1 comment:

Sree said...

ఒక్క కామెంత్ కూడా ఎవరూ రాయకపోవటం లోనే అర్థమవుతోంది, మనకు ఈ టైటిల్ వివాదాలతో అస్సలు సంబంధం లేదని. సినిమా బావుంటే చూస్తాం లేదంటే మరో సినిమాకి పోతాం. అంతే కదా!